Hidma Encounter (imagecredit:swetcha)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

Hidma Encounter: ఏపీలో సంచలనంగా మారిన హిడ్మా మరణం.. హిడ్మా చంపాలనుకున్న నాయకుడెవరు.?

Hidma Encounter: మావోయిస్టు పార్టీలో నిన్న మొన్నటిదాకా ఒక రకమైన వివాదం అయితే.. హిడ్మా మృతి చెందిన తర్వాత మరో రకమైన వివాదం తెరపైకి వస్తుంది. ఇప్పుడు ఆంధ్రాలో కొత్త రకమైన చర్చకు దారితీస్తుంది. మావోయిస్టు పార్టీలో విభేదాల కారణంగానే సీనియర్లంతా లొంగుబాటు చేశారు. ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో ప్రశాంత వాతావరణం గడుపుతున్నారు. జూనియర్లు వర్సెస్ సీనియర్లు అన్న కోణంలోనే మావోయిస్టు పార్టీలో వివాదం కొనసాగింది. ఈ నేపథ్యంలో అత్యధికంగా సీనియర్లు తమతోపాటు ఉన్న వివిధ క్యాడర్లలో ఉన్న మావోయిస్టు లతో కలిసి భారీ సంఖ్యలో పోలీసుల ఎదుట లొంగిపోయారు.

హిడ్మాను మట్టు పెట్టడంలో కోవర్టు ఎవరు..?

మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో భద్రతా బలగాలపై దూకుడు ప్రదర్శించే హిడ్మా(Hidma) ను భద్రత బలగాలు, ఆక్టోపస్ సంయుక్తంగా మంగళవారం ఉదయం ఎన్కౌంటర్లో మట్టుపెట్టారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్, చత్తీస్గడ్(Chhattisgarh), తెలంగాణ(Telangana), మహారాష్ట్ర(Maharasta), ఒడిశా(Odisha) రాష్ట్రాల్లో దావానంలా వ్యాపించింది. అయితే ఇప్పుడు హిడ్మా ను మట్టు పెట్టడంలో లొంగిపోయిన మావోయిస్టులా, లేదంటే సహచర మావోయిస్టులా..? కోవర్టుగా వ్యవహరించింది ఎవరనే దానిపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

హిడ్మా చంపాలనుకున్న పొలిటికల్ నాయకుడు ఎవరు..?

చత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ, సుక్మా లతోపాటు అబూజ్ మడ్, కర్రెగుట్ట ప్రాంతాలలో ఎక్కువగా తిరిగే హిడ్మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు వచ్చినట్లు అని కూడా చర్చ జరుగుతుంది. గత రెండు రోజులుగా మీడియాలో ఓ పొలిటికల్ నాయకుడిని హతమార్చేందుకే మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారని చర్చ జరగడం గమనార్హం. అయితే విజయవాడలో ఓ మూడంతస్తుల భవనంలో హిడ్మా అనుచరులు 19 మంది, దేవ్ జి అనుచరులు 9 మంది తల దాచుకోవడంలో ఎలాంటి ప్రణాళిక ఉందోనని అక్కడి ప్రజలు మాట్లాడుకోవడం విశేషం. హిడ్మాతో ఉండాల్సిన ప్రొటెక్షన్ టీం విజయవాడ సమీపంలోని పెనమలూరు ఆటోనగర్లో ఎందుకు ఉన్నారనేది ఎవరికి అంత చిక్కని ప్రశ్న. అదే విధంగా దేవ్ జి ప్రొటెక్షన్ టీం సైతం అక్కడ ఉండడానికి గల కారణాలేంటనే వాటిపై సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ఓ ప్రజా ప్రతినిధి విశేషంగా కృషి చేస్తున్నారు. అదే విధంగా గతంలోనూ సీఎంగా పనిచేసిన ముఖ్యమంత్రికి మావోయిస్టులకు కొంత దూరం ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎవరిని టార్గెట్ చేసుకొని ఇక్కడికి మావోయిస్టులు వచ్చారు. ఈ విషయాలన్నిటిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తీవ్రంగా పరిగణించి జరిగిన వాటన్నిటికీ పరిష్కార మార్గం చూపేందుకు కృషి చేస్తోంది.

Also Read: Mahabubabad District: రాజ్యాంగ రక్షణకై దళితుల ఆత్మగౌరవం కోసం ఢిల్లీలో మహాధర్నా..!

మావోయిస్టు పార్టీలో కూడా బీసీ ఎస్టీ వర్గాల ఆజమాయిషి సాగుతోందా..?

ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియర్లుగా భావించబడిన వారంతా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇక మిగిలింది ఒకరిద్దరు వయసు పైబడిన వారు ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నదంతా యువరక్తమే. గత నెల రోజుల క్రితం జూనియర్స్ వర్సెస్ సీనియర్స్ అనే రీతిలో ఉన్న మావోయిస్టు పార్టీ ప్రస్తుతం బీసీ, ఎస్టి నేతల మధ్య పోరు సాగుతుందా… అనే చర్చ సాగుతుంది. దేవ్ జి ప్రొటెక్షన్ టీం విజయవాడలో ఉండడానికి గల కారణాలేంటి..? అక్కడే హిడ్మా ప్రొటెక్షన్ టీం కూడా అక్కడే ఉండడం ఏంటి..? ఈ పరిణామలన్నింటిపై అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో దర్శనమిస్తున్నాయి. దేవ్ జి ఎక్కడున్నారు… దేవ్ జి ప్రొటెక్షన్ టీం ఎక్కడ ఉన్నారు.. అనేకమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్ జరిగి హిడ్మా తో పాటు మరో ఐదుగురు మృతి చెందారు. మరోవైపు చత్తీస్గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మంగళవారం ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అసలు మావోయిస్టు పార్టీలో ఏం జరుగుతోంది.. చర్చ సాగుతున్నట్లుగానే బి సి, ఎస్టి అజమాయిషి కొనసాగుతుందా..? అంటే వేచి చూడాల్సిందే.

ఉక్కిరి బిక్కిరితోనే..

చతిస్గడ్ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా ఆదివాసి గూడాల్లో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. రహదారులు, విద్యుత్, విద్య, ఉపాధి వంటి చాలా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్నారు. అంతేకాకుండా దట్టమైన అటవీ ప్రాంతాల్లో భద్రత బలగాల బేస్ క్యాంపు ఏర్పాటు చేసుకొని మావోయిస్టుల చర్యలపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు స్వర్గధామాలుగా మారిన బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ, సుక్మా లతోపాటు అబూజ్ మాడ్, కర్రెగుట్టల ప్రాంతాలలోనూ ఉనికి కోల్పే పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలోనే మావోయిస్టులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైతే తమకు అనుకూలంగా ఉంటుందని, ఇక్కడ మారుమూల గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులను అడ్డుకుంటే మా ఉనికిని చాటుకోవచ్చని మావోయిస్టులు భావించి ఒక పొలిటికల్ లీడర్ ను హతమార్చేందుకు వచ్చారనేది చర్చ జరుగుతుంది.

Also Read: SI Bribery Case: గోడ దూకి పరారైన ఎస్ఐ, వెంబడించి పట్టుకున్న ఏసీబీ.. ఇంతకీ ఏం చేశాడంటే?

Just In

01

Parineeti Chopra: తన కుమారుడికి ఎవరూ ఊహించని పేరు పెట్టిన బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా.. అర్థం ఏంటంటే?

CM Revanth Reddy: ఇందిరమ్మ జయంతి స్పెషల్.. కోటి చీరల పంపిణీపై.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

Malaysia Glowing Roads: స్ట్రీట్‌లైట్ రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన గ్లోయింగ్ రోడ్ల ప్రయోగం మలేషియాలో ఎందుకు ఫెయిలైంది?

Maoist Encounter: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. హిడ్మా రైట్‌ హ్యాండ్‌ టెక్‌ శంకర్‌ ఎన్కౌంటర్..!

Fertility Centers: ఫెర్టిలిటీ సెంటర్లపై సర్కార్ ఫుల్ సీరియస్.. మూడు సెంటర్ల సీజ్!