Makutam: నటుడు విశాల్ స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆర్.బి. చౌదరి 99వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు రవి అరసు కథ అందించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో, చిత్ర యూనిట్ తాజాగా ఓ కీలక అప్‌డేట్‌ను పంచుకుంది. ‘మకుటం’ సినిమాకు సంబంధించిన గ్రాండ్ క్లైమాక్స్ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ క్లైమాక్స్‌ను 17 రోజుల పాటు ఎక్కడా విరామం లేకుండా చిత్రీకరించారు.
Read also-Mufthi Police: ఇన్వెస్టిగేషన్‌లో కొత్త కోణంలో చూపించనున్న “మఫ్టీ పోలీస్”.. వచ్చేది ఎప్పుడంటే?
ఈ క్లైమాక్స్ చిత్రీకరణ కోసం వందల కొద్దీ స్టంట్ ఆర్టిస్టులను ఉపయోగించారు. ఒక భారీ వార్ సీక్వెన్స్ తరహాలో దీనిని తీర్చిదిద్దారు. దాదాపు 800 మంది టెక్నీషియన్లు ఈ భారీ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ఈ క్లైమాక్స్ ప్రేక్షకులకు ‘నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’ అనే అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. రా ఎమోషన్స్, విజువల్ గ్రాండియర్, బ్రీత్ టేకింగ్ యాక్షన్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా చిత్రీకరించారు. దర్శకుడిగా విశాల్‌కు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది. 17 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ అకుంఠిత దీక్ష, అంకిత భావం, నిబద్ధతను ప్రదర్శించారని యూనిట్ కొనియాడింది. విశాల్ దర్శకత్వంలో, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రం అన్ని కంప్లీట్ కమర్షియల్ అంశాలు కలిగి ఉంటుందని తెలిపారు.
‘మకుటం’ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఆయన కంపోజిషన్స్ సినిమా భావోద్వేగాలను, యాక్షన్‌ను పతాక స్థాయికి చేర్చేలా ఉంటాయి. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరించి, దృశ్యాలను అత్యంత గ్రాండ్‌గా, ఉన్నత ప్రమాణాలతో చిత్రీకరించారు. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా వ్యవహరిస్తూ, కథనాన్ని పదునుగా, వేగవంతంగా ముందుకు నడిపించేలా కత్తిరించారు. ఇక భారీ యాక్షన్ సీక్వెన్సెస్‌కు, ముఖ్యంగా 17 రోజుల పాటు చిత్రీకరించిన క్లైమాక్స్‌కు దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ కొరియోగ్రఫీ అందించగా, ఆ సన్నివేశాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ‘నెవ్వర్ బిఫోర్’ అనేలా తీర్చిదిద్దారు. ఈ సాంకేతిక బృందానికి దురైరాజ్ కళా దర్శకుడిగా తన సహకారాన్ని అందిస్తూ, సినిమాకు అవసరమైన భారీ సెట్టింగ్‌లు దృశ్య రూపకల్పనను చేపట్టారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
