Hema mother death: టాలీవుడ్ ప్రముఖ నటి హేమ తల్లి మృతి..
hema-mother(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Hema mother death: టాలీవుడ్ ప్రముఖ నటి హేమ తల్లి మృతి.. సంతాపం తెలిపిన ‘మా’ సభ్యులు..

Hema mother death: టాలీవుడ్ ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి, తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన కోళ్ల లక్ష్మి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె, సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో నటి హేమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నటి హేమ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు. కోళ్ల లక్ష్మి మరణవార్త తెలుసుకున్న రాజోలు వాసులు, బంధువులు, స్నేహితులు హేమ ఇంటికి చేరుకుని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కోళ్ల లక్ష్మి తమ ప్రాంతంలో మంచి వ్యక్తిగా, ఆప్యాయతతో మెలిగే మహిళగా పేరు తెచ్చుకున్నారు. ఆమె మృతి తీరని లోటు అని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.

Read also-Chhinnamasta Devi: రాజమౌళి ‘వారణాసి’ గ్లింప్స్‌లో కనిపించిన శిరస్సు లేని దేవత గురించి తెలుసా.. ఇది తెలిస్తే భక్తుడైపోతారు..

నటి హేమ తన తల్లి కనకదుర్గ అంటే ఎంత అభిమానం ఉందో అనేక సందర్భాల్లో తెలియజేశారు. ముఖ్యంగా సినిమాలలోకి వచ్చి, పరిశ్రమలో నిలదొక్కుకునే క్రమంలో తన తల్లి ప్రోత్సాహం, అండదండలు ఎంతో ఉన్నాయని హేమ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. తల్లి మరణంతో హేమ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ కష్ట సమయంలో ఆమెను ఓదార్చడానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, స్నేహితులు ఆమె ఇంటికి వెళ్లి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. నటి హేమ తల్లి మరణం పట్ల టాలీవుడ్ వర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియా వేదికగా అభిమానులు సంతాప సందేశాలను పోస్ట్ చేశారు. నటి హేమ తల్లి మృతి పట్ల ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (TFCC), ‘మా’ (MAA) అసోసియేషన్ సభ్యులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తల్లి లేని లోటు తీర్చలేనిదని పేర్కొంటూ, హేమ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Read also-Varanasi title controversy: చిక్కుల్లో రాజమౌళి ‘వారణాసి’ టైటిల్.. అందుకు హనుమంతుడికి కోపం వచ్చిందా!..

Just In

01

Bhatti Vikramarka: బీజేపీలోని ఏ ఒక్క‌నాయ‌కుడైనా దేశం కోసం త్యాగం చేశారా? : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

Sridhar Babu: మున్సిపల్ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి!

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?

Grok AI Misuse: 3 రోజుల్లో ఆ కంటెంట్‌ను తొలగించండి.. ‘ఎక్స్’కి కేంద్రం సంచలన నోటీసులు

Urea Supply: రైతులు క్షమించరు జాగ్రత్త.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై ఫైర్