Rajamouli ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

SS Rajamouli: రాజమౌళి పై కేసు నమోదు.. దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమన్న వానరసేన?

SS Rajamouli: రామోజీ ఫిల్మ్ సిటీలో SSMB 29 సినిమా టైటిల్ రివీల్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతుం ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్ ను ఖరారు చేశారు. మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తుంది. పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే, ఈ ఈవెంట్ లో రాజమౌళి చేసిన దేవుడి పై చేసిన కామెంట్స్ పెద్ద వివాదానికి దారి చేశాయి.

Also Read: The Girlfriend Collections: బాక్సాఫీస్ వద్ద రష్మిక మూవీ కొత్త రికార్డ్ .. ది గర్ల్‌ఫ్రెండ్ 10 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

వారణాసి టైటిల్ ఈవెంట్ లో రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని కొందరు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సరూర్ నగర్ పోలీసులకు రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదు చేశారు.రాజమౌళిపై కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఎవరూ కూడా హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు పోలీసులను కోరారు.

Also Read: VC Sajjanar: కరేబియన్ పౌరసత్వo.. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా.. 21వేల సినిమాలు.. ఐబొమ్మ రవి చిట్టా ఇదే!

నువ్వు సినిమా తీస్తే తీసుకో.. అది నీ ఇష్టం, దేవుళ్ళ పై ఇలా కామెంట్స్ చేస్తారా? అయిన దేవుళ్ళ పై  నమ్మకం లేకుండానే దేవుడి పేర్లు పెట్టి సినిమాలు తీస్తున్నావా? సక్సెస్ తలకెక్కితే ఇలాగే ఉంటుంది. ఏం చేద్దాం? ఇప్పుడు నువ్వు దేవుళ్ళతోనే పెట్టుకున్నావ్ ? చూద్దాం నీ సినిమా ఎలాంటి అడ్డంకులు ముందుకు వెళ్తుందా అనేది? మనుషులు తప్పు చేస్తే దేవుళ్ళను ఎందుకు నిందించడం అని రాజమౌళి చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంకొందరు అసలు నిన్ను ఎవరు సినిమాలు తియ్యమన్నారు? నువ్వు సినిమాలు  తీసి  మమ్మల్ని ఎంటర్టైన్ చెయ్ బాబు అని మేము చెప్పలేదుగా.. మళ్ళీ తీసి  ఇలాంటి మాటలు అనడం దేనికి? అంటూ ఒక రేంజ్ లో రాజమౌళి ని ఏకిపారేస్తున్నారు.

Also Read: Shiva Re-Release: నాగార్జున ‘శివ’ రెండు రోజుల గ్రాస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. రీ రిలీజ్‌కు ఇంత క్రేజా..

Just In

01

HMDA: ముగిసిన హెచ్ఎండీఏ ప్రీ బిడ్ మీటింగ్.. ప్లాట్ల వేలానికి భారీ స్పందన

Delhi Car Blast: 2021 నుంచే కుట్ర.. 6 నగరాల్లో డీ6 మిషన్.. లేడీ డాక్టర్ ప్లాన్ రివీల్!

Army Chief Upendra Dwivedi: బ్లాక్‌మెయిలింగ్‌కు భారత్ భయపడదు.. పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్..!

Ginning Mills Strike: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిలిచిన పత్తి కొనుగోళ్లు.. ఆందోళనలో అన్నదాతలు

Hyderabad Tragedy: కడుపులోనే కవలలు మృతి.. కాసేపటికే భార్య మరణం.. తట్టుకోలేక భర్త ఏం చేశాడంటే?