Konda Surekha: డిసెంబర్ 14న కొమురవెల్లి మల్లన్న కల్యాణం, జాతరను తెలంగాణ ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వైభవంగా నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అధికారులను ఆదేశించారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో దానిని దృష్టిలో పెట్టుకుని ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సెక్రటేరియట్ లో సోమవారం సిద్దిపేట(Siddipet) జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మల్లన్న జాతర, కళ్యాణం పోస్టరును ఆవిష్కరించారు.
అధికారులు సమన్వయంతో..
గత ఏడాది కంటే వైభవోపేతంగా మల్లికార్జున స్వామి కల్యాణం, జాతరను నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 14 ఉదయం 10.45 గంటలకు మల్లికార్జున స్వామి కల్యాణం, జనవరి 18 నుంచి మార్చి 16 వరకు జాతరను నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కల్యాణ వేదికను విశాలంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. కొమురవెల్లి దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమ్మవార్లు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలకు కిరీటాల తయారీ పనుల పై ఆరా తీశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను సంపూర్ణంగా నిషేధించాలని ఆదేశించారు. స్వామివారి ప్రసాదం తయారీలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.
Also Read: Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు
జానపద కళారూపాలు
కళాబృందాలచే ఒగ్గుకథ వంటి జానపద కళారూపాలను ప్రదర్శించేలా సాంస్కృతిక శాఖకు ఆదేశాలివ్వాలని కలెక్టర్ కు సూచించారు. కల్యాణోత్సవానికి వారం రోజుల ముందే సర్వసన్నద్ధంగా వుండేలా కార్యాచరణను వెంటనే అమలుపరచాలన్నారు. భక్తులకు వైద్య సేవల కోసం డాక్టర్లను, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆలయ ఆవరణలో పరిశుభ్రత తప్పనిసరి అని, అవసరమైతే పారిశుధ్య సిబ్బందిని ప్రత్యేకంగా అపాయింట్ చేసుకోవాలని కలెక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy,), ఎండోమెంటు ప్రిన్స్ పల్ సెకట్రరీ శైలజ రామయ్యర్(Sailaja Ramayar), దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, సిద్దిపేట కలెక్టర్ హైమావతి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
Also Read: Bandi Sanjay: యువత రాజకీయాల్లోకి రావాలి… కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపు
