Bandi-Sanjay (Image source Swetcha)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Bandi Sanjay: యువత రాజకీయాల్లోకి రావాలి… కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపు

Bandi Sanjay: నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలి

లేనిపక్షంలో రాజకీయ కుటుంబ వారసత్వమే కొనసాగే ప్రమాదం
సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలు కొనసాగించే అందరిపైనా ఉంది
యువతకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు

కరీంనగర్, స్వేచ్ఛ: యువత రాజకీయాల్లోకి రావాలని, నవ భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లోకి రాకుంటే రాజకీయ కుటుంబ వారసత్వమే కొనసాగే ప్రమాదముందని ఆయన అన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సూచించారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాల నేపథ్యంలో, సోమవారం కరీంనగర్‌లో వేలాది మందితో సర్దార్@150 యూనిటీ మార్చ్ నిర్వహించారు.

ఎస్సారార్ కళాశాల నుంచి నిర్వహించిన పాదయాత్రలో యువత, విద్యార్థులతో కలిసి పాదయాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు, యువకులు హాజరయ్యారు. వారందరితో కలిసి పాదయాత్ర చేస్తూ బండి సంజయ్ ముందుకు సాగారు. అంతకుముందు పాదయాత్ర ఆరంభంలో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. యువత రాజకీయాల్లోకి రాకుంటే దేశాన్ని కుటుంబ వారసత్వ రాజకీయాలు పట్టి పీడించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశానికి ఏ మాత్రం మంచి పరిణామం కాదన్నారు. వారసత్వ రాజకీయాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర వ్యతిరేకమన్నారు.

Read Also- VC Sajjanar: కరేబియన్ పౌరసత్వo.. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా.. 21వేల సినిమాలు.. ఐబొమ్మ రవి చిట్టా ఇదే!

ప్రపంచంలో నెలకొన్న పోటీ, ఎదురవుతున్న సవాళ్లను భారత్ అధిగమించాలంటే తప్పనిసరిగా యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. ‘‘భారత దేశ ఐక్యత కోసం తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మహనీయుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయిపటేల్. దేశంలోని 560 సంస్థానాలను ఒకే జెండా కిందకు తీసుకొచ్చి భారతదేశాన్ని ఏకం చేసిన మహనీయుడు. పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదు. తెలంగాణను పాకిస్థాన్‌లో కలపాలని, లేదా ముస్లిం దేశంగా మార్చాలని ఆనాడు నిజాం రాజు కుట్రలు చేసిండు. ఒకవేళ తెలంగాణ భారత్‌లో విలీనం కాకుంటే మన పరిస్థితి ఎట్లుండేదో ఒక్క క్షణం ఆలోచించండి. మరో పాకిస్థాన్, మరో శ్రీలంక, మరో బంగ్లాదేశ్‌లా మారి ఆకలి కేకలతో కల్లోల దేశంగా మారేది. ఇది ఆనాడే గ్రహించిన పటేల్ తెలంగాణకు స్వాతంత్య్రం రాకుండా స్వతంత్య్ర రాజ్యంగా ఉంటే భారతమాత కడుపులో కేన్సర్‌ ఉన్నట్లేనని ప్రకటించి ‘ఆపరేషన్ పోలో’ పేరుతో నిజాం కుట్రలను భగ్నం చేసి తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్ పటేల్ మనందరికీ ఆరాధ్యుడు. దేశంలో ఆధునిక సివిల్ సర్వీసెస్ వ్యవస్థను స్థాపించడంలో పటేల్ కీలక పాత్ర పోషించారు’’ అని బండి సంజయ్ కొనియాడారు.

Read Also – Satish death Case: సీఐ మృతి కేసు దర్యాప్తు వేగవంతం.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అర్థమైంది ఏంటంటే?

సౌదీ బస్సు ఘోర ప్రమాదంపై దిగ్బ్రాంతి

సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ఘోర ప్రమాదంలో 42 మంది భారతీయులు మరణించినట్లు సమాచారం తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యానని బండి సంజయ్ అన్నారు. అందులో 18 మంది తెలుగు వాళ్లు కూడా ఉన్నట్లు తెలిసిందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే సౌదీ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని, ఆ కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందిస్తామని, మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Just In

01

Tortoise: రాజ్ తరుణ్ మరో ప్రయోగం.. ఈసారి ‘టార్టాయిస్’గా..!

Delhi Blast Case: ఢిల్లీ బ్లాస్ట్‌ కేసులో దొరికిన సహకుట్రదారుడు.. సంచలనాలు వెలుగులోకి

Bigg Boss Telugu 9: కుండలు బద్దలవుతున్నాయ్.. రీతూ వర్సెస్ డిమోన్.. అసలైన ఆట మొదలైంది..

Jagriti Janam Baata: సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ మైన్‌ను సందర్శించిన కవిత.. కీలక వ్యాఖ్యలు

Global Summit Telangana: గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు స్థల పరిశీలన చేసిన ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క