Sukesh Chandrasekhar Sensational Comments On Kavitha Arrest
జాతీయం

Welcome Kavithakka : కవిత అరెస్టుపై సుఖేష్‌ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు

Sukesh Chandrasekhar Sensational Comments On Kavitha Arrest : కవిత అరెస్ట్‌పై సుఖేష్‌ చంద్రశేఖర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మండోలి జైలు నుంచి రాసిన లేఖలో కవిత అరెస్ట్ ద్వారా కేజ్రీవాల్‌తో సహా అవినీతి సహచరులందరి పేర్లు బట్టబయలు కాబోతున్నాయని తెలిపాడు. బూటకపు కేసులని, రాజకీయ ప్రతీకారమని ఇన్నాళ్లూ కవిత చేసిన వాదన అసంబద్ధమని రుజువైందని చెప్పాడు. సింగపూర్‌, హాంకాంగ్‌, జర్మనీలో మీ పార్టీ దాచుకున్న వేల కోట్లు బయటకు వస్తాయని లేఖలో సుఖేష్ వెల్లడించాడు.

నెయ్యి డబ్బాలంటూ మీరు చెప్పిన కథలపై దర్యాప్తు జరుగుతోందని తెలిపాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని అధికారం నుంచి తెలంగాణ ప్రజలు దించేశారని, అరెస్ట్ అయిన కవిత తీహార్ జైలుకి రావడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పాడు. ‘‘ కవితక్క మీ నెయ్యి టిన్ కథలు, రేంజ్ రోవర్ కలెక్షన్ కథలు, గోవా కథలు, కాంట్రాక్ట్ కథనాలు, గత సంవత్సరం నేను షేర్ చేసిన వాట్సాప్ స్క్రీన్ షాట్ల ప్రకారం దర్యాప్తు జరుగుతుంది.

Read More: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు దొందూ దొందే!

త్వరలోనే ఈడీ, సీబీఐ వద్ద చట్ట ప్రకారం విచారణను ఎదుర్కొనేందుకు మిమ్మల్ని కలుస్తాను అక్క’’ అంటూ సురేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నాడు. కవితను తీహర్ జైలుకి సాదరంగా స్వాగతిస్తానని చెప్పాడు. తీహార్ జైలు మీరు సుదీర్ఘంగా ఉండడం కోసం విలాసవంతమైన భవనమని, మీకోసం ఇక్కడ మరో సోదరుడు అవినీతి చక్రవర్తి అరవింద్ కేజ్రీవాల్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారని తాను అనుకుంటున్నట్టు తెలిపాడు. కేజ్రీవాల్ ఎంత ప్రయత్నించినా మీ అబద్ధాలు డ్రామాలన్నింటికీ ఇది క్లైమాక్స్‌గా మారబోతోందని అన్నాడు సుఖేష్ చంద్రశేఖర్.

Just In

01

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?