Saudi Bus Accident (imagecredit:twitter)
తెలంగాణ

Saudi Bus Accident: సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. హైదరాబాద్ వాసులు దుర్మరణం

Saudi Bus Accident: సౌదీలో ఝోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్(Hyderabad) వాసులు కొంతమంది దుర్మరణం పాలయ్యారు. మక్కా నుండి మదీనాకు భారతీయ యాత్రికులతో వెళుతున్న బస్సు ఓ డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ బస్సులో ఒకరు తప్ప మిగతా అందరూ ప్రమాదంలో మరణించారని సమాచారం. అక్కడి ప్రాథమిక నివేదికల ప్రకారం బస్సులో 42 మందికి పైగా మృతి చెందారని తెలిపారు. మదీనా నుండి 160 కి.మీ దూరంలో ఉన్న ముహర్హత్ వద్ద నిన్న రాత్రి 11.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఇ యాత్ర కోసం హైదరాబాద్ నుండి వచ్చిన వారిలో సగానికి పైగా మహిళలు మరియు పిల్లలు ఉన్నట్టుగా అక్కడ అధికారులు తెలిపారు. వీరంతా ప్రమాదంలో మరణించారు. చాలా మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అక్కడి అధికారులు తెలిపారు.

Also Read: Jangaon Road Accident: జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొని ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జు.. ఇద్దరి మృతి!

సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం

సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని మీడియా వార్తలు వచ్చాయి. వెంటనే స్పందించిన సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్(CS), డీజీపీ(DGP)ని అదేశించారు. తెలంగాణ(Telangana)కు చెందిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని సీఎం అదేశించారు. సీఎం అదేశాలతో సీఎస్ రామకృష్ణారావు(CS Ramakrishna Rao) ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని అదేశించారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

Also Read: Minister Vakiti Srihari: మత్స్యకారుల సంక్షేమం అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి వాకిటి శ్రీహరి

Just In

01

KP Vivekananda: కాంగ్రెస్ ట్రాప్‌లో కల్వకుంట్ల కవిత పడిపోయారు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద

Digital Arrest Scam: 6 నెలలపాటు ‘డిజిటల్ అరెస్ట్’లో మహిళ… రూ.32 కోట్లు దోచేసిన కేటుగాళ్లు

Harish Rao: రైతుల ఆత్మహత్యలకు బాధ్యులెవరు..? ప్రభుత్వం పై హరీష్ రావు ఫైర్

CJI Gavai: రాజ్యాంగం స్థిర పత్రం కాదు.. సీజేఐ గవాయ్ కీలక వ్యాఖ్యలు

OnePlus 15R Launch: ఇండియాలో లాంచ్ అవ్వబోతున్న OnePlus 15R.. ఫీచర్లు ఇవే!