MLC Kavitha: కామన్ స్కూల్ సిస్టమ్ పెట్టాలని, దాని కోసం కేంద్రం నుంచి పాలసీ మారాల్సి ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) అన్నారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్(Telangana Jagruti Teachers Federation) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ పై సోమాజీ గూడ రాష్ట్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సిస్టమ్ లో ఉంటూ విద్య వ్యవస్థను మార్పు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.ఇప్పుడు పెద్దలు చెప్పిన అన్ని అంశాలతో కలిపి పది తీర్మానాలు చేసుకున్నామన్నారు. విలువలతో కూడిన విద్యను అందించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయించాలి. అవసరమైతే అన్ లిమిటెడ్ గా బడ్జెట్ ఉండాలన్నారు. టెక్నాలజీని విరివిగా వాడాలని, 1 వ తారీఖున టీచర్లకు జీతాలిచ్చినట్లే, మిడ్ డే మీల్స్, స్కూల్ మెయింటెన్స్ సిబ్బందికి జీతాలు చెల్లించాలన్నారు.
కామన్ స్కూల్స్ విధానం
ఒక గ్రేడ్ కు ఒక టీచర్, క్లాస్ ఒక టీచర్, తరగతి కి ఒక గది ఉండాలన్నారు. ప్రీ ప్రైమరీ స్కూల్స్ పెట్టాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టాలన్నారు. 20 ఏళ్లకు పైగా టీచింగ్ అనుభవమున్న వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, టీచర్లకు బోధనేతర పని తగ్గించాలి. అవసరమైతే అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ ను పెంచాలన్నారు. కులాల వారీగా స్కూల్స్ పెట్టటంపై ఎప్పటి నుంచో నేను కూడా మదనపడుతున్నానన్నారు. కానీ ఎస్సీ, ఎస్టీ లకు కోసం వచ్చే ఫండ్స్ వారికే కేటాయించాల్సి ఉంటుంది. అందువల్ల కామన్ స్కూల్స్ విధానం కష్టం అన్నారు. ఆదివాసీ, గిరిజనుల కోసం ప్రత్యేక విద్యా విధానాన్ని రూపొందించాలన్నారు. ఆడబిడ్డల కోసం ప్రత్యేక విద్యా విధానం ఉండాలని నేను కోరుకుంటున్నాన్నారు. వారికోసం శానిటరీ ప్యాడ్స్, లేడీ టీచర్లు ఉండాలన్నారు. ప్రైమరీ స్కూళ్లలో పీఈటీ లు కూడా ఉండాలని, ఏటా ఏకానమీ సర్వే జరిగినట్లు ఎడ్యుకేషన్ సర్వే కూడా జరగాలన్నారు. ఇది మొదటి మీటింగ్ మాత్రమే. భవిష్యత్ మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకుందామన్నారు.ఒక్కరోజులో తీరే సమస్యలు కావు అని, ఒక్కొక్కటిగా సమస్యలపై పోరాటం చేద్దామన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో..
తెలంగాణ ఏర్పడిన సమయంలో విద్యా వ్యవస్థ గురించి మనం చాలా బాధపడ్డామన్నారు. పీజీ చేసిన వాళ్లు కూడా ఉద్యోగాలు పొందలేకపోతున్నారని మదనపడ్డాం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు ప్రభుత్వ కళాశాలలు, స్కూల్స్ ఎక్కువగా లేవు అన్నారు. మన యూనివర్సిటీల మీద అప్పుడు ఎక్కువ ఫోకస్ చేయలేదన్నారు. ఐతే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత విద్యా వ్యవస్థలో మనం ఏం సాధించుకున్నామో మాట్లాడుకుందాం అన్నారు. ఇది రాజకీయాలతో సంబంధం లేని అంశం. కానీ మనం ఏం మాట్లాడిన రాజకీయమే అవుతుంది అన్నారు.
Also Read: AV Ranganath: బతుకమ్మకుంట బాగుందా? వాకర్లతో ముచ్చటించిన హైడ్రా కమిషనర్!
బీఆర్ఎస్ పదేళ్లలో..
బీఆర్ఎస్ పదేళ్లలో విద్యా వ్యవస్థ బాగాలేదని కాంగ్రెస్ ఆరోపించిందని, విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిందని, కానీ రెండేళ్లైనా సరే ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు లేదు అన్నారు. రెండేళ్లలో ఏలాంటి చర్యలు చేపట్టకుండా ఇంకా ఎప్పుడు చర్యలు తీసుకుంటారన్నారు. ఒక విద్యా కమిషన్ వేశారు. అది మంచి నిర్ణయమే. కానీ విద్యా కమిషన్ ఏం చేస్తోందన్నారు. ఆదివాసీలు, మహిళల విద్యా పట్ల వివక్ష కొనసాగుతోందన్నారు.
ఆడపిల్లలను మాత్రం
ప్రజాక్షేత్రంలో తిరుగుతుంటే ఈ సమస్య మనకు స్పష్టం గా తెలుస్తోందని, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోయిన సరే ఆడపిల్లలకు చదువు ఆపేస్తున్నారన్నారు. మగ పిల్లల చదవుకోసం అప్పులు చేసైనా ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారన్నారు. కానీ ఆడపిల్లలను మాత్రం చదువు లేకుండా ఆపేస్తున్నారన్నారు. ఆడపిల్లల చదువు అనేది చాలా డెలికేటేడ్ సమస్య గా మారిందన్నారు. బస్సు లేకపోయిన, వీధి దీపం లేకపోయినా సరే ఆడపిల్లల చదువు ఆపేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న సరే అది ఆడపిల్లల చదువుకు లింక్ అయి ఉంటుందన్నారు. అందుకు నిజామాబాద్ లో జరిగిన సంఘటన ఉదాహరణగా చెబుతాను.. నిజామాబాద్ లో ఐటీ టవర్ ఏర్పాటు చేస్తే మహిళలకు కూడా ఉద్యోగాలు వచ్చాయి. కానీ మహిళ ఉద్యోగులకు సపరేట్ బస్సు వేస్తేనే ఉద్యోగాలకు పంపిస్తామని తల్లితండ్రులు చెప్పారన్నారు.సేప్టీ లేకుండా వాళ్లను ఉద్యోగాలకు పంపించలేమని చెప్పారన్నారు. అంటే ప్రభుత్వం ఆడపిల్లల విద్య, ఉద్యోగానికి సంబంధించి సపరేట్ విధానం అమలు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే సిస్టమ్ లో కూడా ఆడపిల్లల విషయంలో భారం పడుతోందన్నారు. అందుకే కమ్యూనిటీ, జెండర్ స్పెసిఫిక్ గా చర్చ జరగాల న్నారు.
Also Read: Shubman Gill injury: ఐసీయూలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. డాక్టర్స్ ప్యానల్ ఏర్పాటు
