Jubilee Hills Bypoll: తెలంగాణ టీడీపీ నేతలు పొత్తు వద్దని వారించారు. స్వయంగా పోటీ చేద్దామని కేడర్‌లో జోష్ నింపుదామన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్‌లో పోటీ చేసి రాబోయే రోజుల్లో అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రజలకు ఒక సందేశం ఇద్దామని అధినేత చంద్రబాబు దగ్గర ప్రపోజల్ పెట్టారు. కానీ, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. పొత్తుతోనే పోదామని నేతలకు ఆదేశాలు ఇచ్చారు. కానీ, ఏపీ స్ట్రాటజీ ఇక్కడ వర్కవుట్ కాలేదు. పొత్తుతో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ సైతం ఘోర ఓటమిని చవిచూసింది. సాధారణ ఎన్నికల కంటే తక్కువ ఓట్లు తెచ్చుకొని డిపాజిట్ సైతం కోల్పోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
తెలంగాణలో తిరస్కరణకు కూటమి ఫార్ములా
ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీతో టీడీపీ కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లింది. 175 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 164 చోట్ల విజయం సాధించింది. అదే కూటమిని తెలంగాణలోనూ కొనసాగిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తొలి అడుగు వేశారు. ఆ పార్టీ జాతీయ నాయకత్వంతో కలిసి ఇదే విషయం చెప్పారు. బీజేపీకి టీడీపీ, జనసేన మద్దతు తెలిపాయి.
బీజేపీ నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి ప్రచారం చేశారు. కానీ ఓట్లు రాబట్టడంలో విఫలమయ్యారు. నియోజకవర్గంలో 6 డివిజన్లు ఉంటే ఏ ఒక్క డివిజన్‌లోనూ కూటమి పోటీ ఇవ్వలేకపోయింది. కనీసం చెప్పుకోదగిన ఓట్లను సైతం సాధించలేకపోయింది. 2023 సాధారణ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డికి 25,866 ఓట్లు రాగా, ఈ ఉప ఎన్నికలో కేవలం 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా బీజేపీ బరిలో దిగి డిపాజిట్ తెచ్చుకున్నది. ఇప్పుడు కూటమితో వెళ్లి డిపాజిట్ కోల్పోవడం చర్చకు దారి తీసింది. గతం కంటే 8,805 ఓట్లు తక్కువగా రావడంతో తెలంగాణలో ఏపీ స్ట్రాటజీ పని చేయదని ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పినట్లు అయింది.
ఆ తప్పే కొంప ముంచిందా?
ఉప ఎన్ని ఎన్నికలో పోటీ చేసేందుకు టీడీపీ సీనియర్ నేతలు అరవింద్ కుమార్ గౌడ్, నందమూరి సుహాసినితోపాటు పలువురు ఆసక్తి చూపారు. చంద్రబాబుకు సైతం పోటీ అంశాన్ని వివరించారు. అయితే, ఆయన మాత్రం ఏపీలో తెలంగాణ నేతలతో సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతానికి కమిటీలు వేయాలని, సంస్థాగతంగా బలోపేతం చేయాలని సూచించారు. కమిటీలు సైతం పూర్తి చేయాలని త్వరలోనే రాష్ట్ర కమిటీ వేస్తా మని ప్రకటించారు. దీనికి కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రచారానికి సైతం పలువురు నేతలు దూరంగా ఉన్నారు. బీజేపీ సైతం కలుపు కొని పోలేదని సమాచారం. కూటమినే తల్లోని అనైక్యతతోనే ఘోర ఓటమిని చవి మాూళాయే ప్రచారం జరుగుతున్నది. ఉడిపి నేతలకు ఏ బాధ్యతలు అప్పగించకుండా పని చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో చం ద్రబాబు ఆదేశించినా పట్టించుకోలేదని స్పష్టమవుతున్నది.
చంద్రబాబు మనసు మార్చుకుంటారా?
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేరు ఇక్కడ ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్, లీ ఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటున్నది అసెంబ్లీ అయినా, స్థానిక, మున్సిపల్ ఎన్నికలు అయినా ప్రధాన పోటీ వాటి మధ్యే పార్ల మెంట్ ఎన్నికల్లో మాత్రమే ప్రజలు బీజేపీ వైపు చూశారు. ఈ పరిస్థితులను అంచనా వేయకుండా ఏపీ మాదిరిగానే తెలంగా ణలోనూ వెళ్లాలని చంద్రబాబు భావించ డంపై పార్టీలోనూ, అటు రాజకీయ వర్గా ల్లోనూ చర్చనీయాంశమైంది. టీడీపీపై ప్రజల్లో సానుభూతి ఉన్నప్పటికీ దానిని మలుచుకోవడంలో విఫలమవుతున్నారనే ప్రచారం జరుగుతున్నది.
రాబోయే రోజు లోనూ కూటమితో వెళితే మూడు పార్టీల నేతలు ఏకతాటిపైకి రారనే ప్రచారం ఊపందుకున్నది. దీంతో కూటమిపై నీలనీడలు కమ్ముకున్నట్టయింది. బలోపేతలు కనుకు పట్టింది. పార్టీని కూటమి అంటూ అడుగులు వేయడం ముమ్మాటికీ ఆయన తప్పిదమే అని పార్టీ నేతలే బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు పార్టీ బలోపేతం దృష్టి సారిస్తారా? కూటమి అంటూ కాల యాపనతోనే కాలం వెల్లడిస్తారా? ఉన్న నేతలను, కేడర్న సైతం పార్టీకి దూరం చేసుకుం చేసుకుంటారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
