CM Revanth Reddy ( IMAGE Credit: swetcha reporter)
తెలంగాణ

CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీలో విన్ గ్రూప్ పెట్టుబడులు.. సీఎం రేవంత్ తో విన్ గ్రూప్ ఏషియో సీఈవో భేటీ!

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి  (CM Revanth Reddy)ని విన్‌గ్రూప్ ఏషియా సీఈఓ ఫామ్ చాన్ చౌ న్యూఢిల్లీలో  మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కీలక ప్రాజెక్టులను స్థాపించేందుకు విన్‌గ్రూప్ ముందుకొచ్చింది. తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ యూనిట్లు, బ్యాటరీ నిల్వ సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్న విన్‌గ్రూప్ ఉద్దేశాన్ని ఈ కంపెనీ సీఈవో సీఎం కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న సస్టైనబుల్, క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపారు. ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీపై ప్రత్యేక ఆసక్తి చూపిన ఫామ్ చాన్ చౌ, దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి ప్రణాళికలను అభినందిస్తూ, ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో పెట్టుబడి పెట్టేందుకు విన్‌గ్రూప్ సిద్ధంగా ఉందని తెలిపారు.

Also Read: CM Revanth Reddy: ప్రస్టేషన్‌తో బీఆర్ఎస్ వ్యవహరించే ఛాన్స్.. ఓ కన్నేసి ఉంచండి: సీఎం రేవంత్ రెడ్డి

గ్లోబల్ పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం

డిసెంబర్ 8–9 తేదీలలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో విన్‌గ్రూప్ చైర్మన్ ఫామ్ నాట్ వూంగ్తో కలిసి పాల్గొనవలసిందిగా ఫామ్ చాన్ చౌని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఈ సమావేశం తెలంగాణలో గ్లోబల్ పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవడంలో, భవిష్యత్‌కు దిశనిర్ధేశం చేసే గ్రీన్, ఇన్నోవేషన్ ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడంలో ఒక కీలక ముందడుగుగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు ,వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, ముఖ్యమంత్రికి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ లు పాల్గొన్నారు.

Also ReadCM Revanth Reddy: నాలాల కబ్జాలను తొలగించాల్సిందే.. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక

Just In

01

Kunamneni Sambasiva Rao: ఎర్రజెండా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం.. సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు

New Advanced Bus: 3 కొత్త బస్ టెర్మినల్స్ ఏర్పాటు.. నగరంలో నలువైపులా ఉండేలా ప్లాన్

Amberpet Drug Bust: భారీగా గంజాయి డ్రగ్స్ సీజ్​.. ఎక్సయిజ్ సిబ్బందిపై కత్తులతో దాడికి యత్నం!

Cyberabad Police: ఆడబిడ్డల జోలికొస్తే ఇక మీ పని అంతే.. షీ టీమ్స్ చూస్తున్నాయ్ జాగ్రత్త!

High Court Website: హ్యాక్​ అయిన హైకోర్టు వెబ్ సైట్.. లాగిన్ కాగానే ఆన్​ లైన్​ బెట్టింగ్ సైట్ ఓపెన్!