CM Revanth Reddy (imageccredit:twitter)
తెలంగాణ, హైదరాబాద్

CM Revanth Reddy: ప్రస్టేషన్‌తో బీఆర్ఎస్ వ్యవహరించే ఛాన్స్.. ఓ కన్నేసి ఉంచండి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పక్కగా గెలుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి ప్రకటించారు. అయితే మెజార్టీ పైనే మంత్రులు ఫోకస్ పెట్టాల్సి అవసరం ఉన్నదని సూచించారు. సోమవారం ఆయన మంత్రులు, కొందరు ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. బూత్ స్థాయిలో మానిటరింగ్ కు కో ఆర్డినేషన్ కమిటీలు పనిచేసేలా పరిశీలించాలన్నారు. ఓటర్లను బూత్‌ల వరకు తీసుకువెళ్లేలా ప్లాన్ చేయాలన్నారు. పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వానికే మైలేజ్ వస్తుందన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్(Congress) ను గెలిపించేందుకు ఫిక్స్ అయ్యారని, మెజార్టీ అత్యధికంగా వచ్చేందుకు పనిచేయాలన్నారు. పోల్ మేనేజ్ మెంట్ ఫర్ ఫెక్ట్ గా చేయాలన్నారు. ఇన్ చార్జ్ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు పోలింగ్ ముగిసే వరకు అందుబాటులోనే ఉండాలన్నారు.

Also Read: OTT censorship in India: ఓటీటీల్లో వల్గారిటీ కంటెంట్ ఉన్నా సెన్సార్ ఎందుకు పట్టించుకోదు?.. రీజన్ ఇదే..

ఆఫీసర్లకు ఫిర్యాదు..

ఇక బీఆర్ ఎస్(BRS) ఓడిపోతుందని ప్రస్టేషన్ తో వ్యవహరించే ఛాన్స్ ఉన్నదని, కానీ కాంగ్రెస్(Congress) లీడర్లు ఎవరూ తమ సహనాన్ని కోల్పోవద్దన్నారు. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని సీఎం నొక్కి చెప్పారు. తాను కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని మానిటరింగ్ చేస్తానని, బీఆర్ ఎస్ జిమ్మిక్కులు చేసినట్లు కనిపిస్తే వెంటనే ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రతీ డివిజన్, పోలింగ్ బూత్ లను లీడర్లు పరిశీలిస్తూ ఉండాలన్నారు. అనుమానం రాగానే స్థానిక ఎన్నికల అధికారులు, పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రశాతంగా ఓటింగ్ జరిగేలా నేతలంతా సహకరించాలన్నారు.

Also Read: BRS Party: గులాబీ ఏజెంట్లతో రహస్య భేటీలు.. ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూహాలు!

Just In

01

Gold Price Today: ఒక్క రోజే భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్? ఈ దెబ్బతో ఇక బంగారం కొనలేరేమో ..?

Jubliee Hills Bypoll Live Updates: ప్రశాంతంగా జూబ్లీహిల్స్ పోలింగ్.. ఓటు వేసిన ప్రధాన అభ్యర్థులు

Hydraa: పార్కులను నామరూపాలు లేకుండా చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి సార్..!

Treatment Rates: ప్రైవేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీపై సర్కారు స్క్రీనింగ్.. ట్రీట్మెంట్ రేట్లన్నీ ఒకేలా ఉండేలా ప్లాన్!

Delhi Red Fort Blast: ఢిల్లీ పేలుడు మిస్టరీని ఛేదిస్తున్న పోలీసులు.. పుల్వామా వ్యక్తికి నకిలీ పత్రాలతో కార్ విక్రయం