KCR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిసారించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. ఎర్రవెల్లి నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ బైపోల్స్‌లో బీఆర్ఎస్ ఓటమి, అనంతర పరిణామాలపై కేసీఆర్ ఆరా తీశారు. భవిష్యత్ కార్యచరణపైనా ఇరువురు సమాలోచనలు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మరింతగా పోరాటం చేయాలని కేసీఆర్ సూచించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ఓటమిపై ఆలోచించకుండా పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాగా పనిచేశారని, అధికార కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించారని, గట్టిపోటీ ఇచ్చారన్నారు.
Also Read: KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో దసరా వేడుకలు.. ఆయుధపూజలో పాల్గొన్న కేసీఆర్, కేటీఆర్
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
పార్టీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. కేటీఆర్ ను సైతం అభినందించినట్లు సమాచారం. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందుకు ఇచ్చిన గ్యారెంటీలు, హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని, ఇదే విధంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదని మరింతగా ముందుకు సాగాలని అన్నారు. ప్రజల పక్షమే బీఆర్ఎస్ పార్టీ అని, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి హామీలు, గ్యారెంటీలు అమలు చేసేలా చూడాలని ఆదేశించారు. పార్టీ కేడర్ నిరాశ కు గురికాకుండా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
Also Read: KCR: నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వం.. మీరు బాగా పనిచేయండి: కేసీఆర్
