KCR: కేసీఆర్ నివాసంలో దసరా ప్రత్యేకత పూజలు.. పాల్గొన్న కేటీఆర్
KCR (Image Source: Twitter)
Telangana News

KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో దసరా వేడుకలు.. ఆయుధపూజలో పాల్గొన్న కేసీఆర్, కేటీఆర్

KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర రావు నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఎర్రవల్లిలోని నివాసంలో గురువారం జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ దుర్గా మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయుధ పూజలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దుర్గా మాతను ప్రార్ధించారు.

కాగా బుధవారమే రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలను కేసీఆర్ తెలియజేశారు. ఓటమి నుంచి రాష్ట్ర ప్రజల జీవితాలు గెలుపు దిశగా పయనించాలని ఆకాంక్షించారు. దసరాకు తెలంగాణ ప్రజా జీవనంలో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. దసరా పండుగ విశిష్టతను గౌరవిస్తూ.. జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా, పాలపిట్టను రాష్ట్ర పక్షిగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో బతుకమ్మతో పాటు విజయ దశమి స్ఫూర్తి ఇమిడి ఉందని అన్నారు.

Also Read: Shocking Video: ర్యాంప్ వాక్ చేస్తుండగా భూకంపం.. హడలిపోయిన మోడల్స్.. దెబ్బకు పరుగో పరుగు!

మరోవైపు దసరా పండుగ సందర్భంగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. హైదరాబాద్ పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బంజరాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నాయకులతో కలిసి దసరా పూజు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత పాలపిట్టను ఎగరవేయడం విశేషం.

Also Read: Shocking News: అత్తను జుట్టు పట్టుకొని కొట్టిన కోడలు.. వద్దని వేడుకున్న మనవడు.. వీడియో వైరల్

Just In

01

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!