Ghantasala The Great: ‘ఘంటసాల ది గ్రేట్’ టీజర్ విడుదలైంది..
ghantasala( X)
ఎంటర్‌టైన్‌మెంట్

Ghantasala The Great: ‘ఘంటసాల ది గ్రేట్’ టీజర్ విడుదలైంది చూశారా..

Ghantasala The Great: సినీ సంగీత ప్రపంచంలో ఘంటసాల వేంకటేశ్వరరావు (ఘంటసాల)చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ‘ఘంటసాల ది గ్రేట్’ అనే మూవీని అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో శ్రీమతి సి.హెచ్. ఫణి గారు నిర్మాణ సారథ్యంలో సి.హెచ్. రామారావు రచన, దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో కృష్ణ చైతన్య ఘంటసాలగా, మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించగా.. సుమన్ ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను ముఖ్య అతిథిగా హాజరైన ఆదిత్య హాసన్ లాంఛ్ చేశారు.

Read also-Vijayendra Prasad: ఈ సినిమా గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పింది వెంటే పూనకాలే..

ఆదిత్య హాసన్ మాట్లాడుతూ .. ‘నాకు ఇండస్ట్రీలో అశోక్ అనే మిత్రుడు ద్వారా బాలాజీ గారు, రామారావు గారి వద్ద పని చేసే అవకాశం వచ్చింది. కేవలం పన్నెండు రోజులు మాత్రమే రామారావు గారి వద్ద పని చేశాను. నా ఫస్ట్ రెమ్యూనరేషన్ కూడా రామారావు గారే ఇచ్చారు. ఆ తరువాత ఫారిన్ వెళ్లాను. మళ్లీ గ్యాప్ తీసుకుని వచ్చి సొంతంగా దర్శకుడిగా ఎదిగాను. ‘ఘంటసాల’ స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ మూవీని ప్రతీ ఒక్కరూ చూడండి. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. డిసెంబర్ 12న రానున్న ఈ సినిమాను అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

Read also-Varanasi title: మహేష్ బాబు ‘SSMB29’ టైటిల్ ఇదే.. గ్లింప్స్ చూస్తే గూస్‌బమ్స్ రావాల్సిందే..

దర్శకుడు రామారావు మాట్లాడుతూ .. ‘‘నా శిష్యుడు ఆదిత్య హాసన్ నా చిత్ర కార్యక్రమానికి వచ్చి టీజర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. పాట అని అనగానే అందరికీ ఘంటసాల గుర్తుకు వస్తారు. సింగర్‌గా కంటే ఆయన వ్యక్తిత్వం గురించి అందరికీ తెలియాలని ఈ సినిమాను తీశాను. ఘంటసాల వారి పాత్రను పోషించమని చాలా మంది స్టార్లను అడిగాను. స్వరాభిషేకంలో కృష్ణ చైతన్య గారిని చూసిన తరువాత ఘంటసాల వారిలా కనిపించారు. ఈ మూవీ ప్రివ్యూ చూసిన ప్రతీ ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యారు. డిసెంబర్ 12న ఈ చిత్రం రాబోతోంది. ఈ మూవీ బయటకు రాకుండా చేయాలని కొంత మంది ప్రయత్నిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలం కావాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను. ఎన్ని శక్తులు అడ్డు పడినా కూడా డిసెంబర్ 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తాను’ అని అన్నారు. ఈ సినిమాలో సుమన్, కృష్ణ చైతన్య, మృదుల , తులసి మూవీ ఫేమ్ అతులిత, సుబ్బరాయు శర్మ, జే.కె. భారవి, సుమన్ శెట్టి, అనంత్, సాయి కిరణ్, అశోక్ కుమార్, గుండు సుదర్శన్, జయవాణీ తదితరులు ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు.

Just In

01

AP TG Water Dispute: పోలవరం నుంచి నీళ్లు మళ్లించకుండా ఏపీని అడ్డుకోండి.. సుప్రీంకోర్టులో తెలంగాణ కీలక వాదనలు

MSG Trailer: అనిల్ రావిపూడి గారూ.. బుల్లిరాజు ఎక్కడ?

Khammam News: ఓరినాయనా.. గ్రామ పంచాయతీనే పేకాట అడ్డాగా మార్చిన ఉపసర్పంచ్..?

Koragajja: రీల్స్ కాంటెస్ట్.. ‘కొరగజ్జ’ రూ. కోటి ఆఫర్.. అసభ్యకరంగా చేశారో!

Medaram Jathara: అసెంబ్లీలో మేడారం సందడి.. ఆహ్వాన పత్రిక అందజేత