SSMB-29-TITLE( IMAGE :x)
ఎంటర్‌టైన్మెంట్

Varanasi title: మహేష్ బాబు ‘SSMB29’ టైటిల్ ఇదే.. గ్లింప్స్ చూస్తే గూస్‌బమ్స్ రావాల్సిందే..

Varanasi title: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం టైటిల్‌ను ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించారు. ఈ మెగా యాక్షన్ అడ్వెంచర్ సినిమాకు ‘వారణాసి’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు. కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో అభిమానులలో చర్చనీయాంశమైన ఈ టైటిల్, రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ‘గ్లోబ్ ట్రాటర్’ అనే భారీ ఈవెంట్‌లో రివీల్ చేశారు. టైటిల్ ప్రకటనతో పాటు, సినిమాకు సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ ‌ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. ఈ గ్లింప్స్ లో మహేష్ బాబు మునుపెన్నడూ చూడని ఒక పవర్ఫుల్ లుక్ లో కనిపించడం అభిమానులను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా, మహేష్ బాబు నంది పై గంభీరంగా స్వారీ చేస్తూ, చేతిలో త్రిశూలం పట్టుకుని ఉన్న దృశ్యం ప్రేక్షకులకు గూస్‌బమ్స్ తెప్పించేలా ఉంది.

Read also-Prabhas new project: స్పిరిట్ తర్వాత కొరియోగ్రాఫర్‌ను దర్శకుడిగా పరిచయం చేయనున్న ప్రభాస్.. ఎవరంటే?

ఇప్పటివరకు ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరించిన ఈ ప్రాజెక్ట్‌కు ‘వారణాసి’ అనే పేరు పెట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారతదేశంలో అత్యంత పురాతనమైన, పవిత్రమైన నగరాల్లో ఒకటైన వారణాసిని టైటిల్‌గా ఎంచుకోవడం, ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ కథా నేపథ్యంపై మరిన్ని అంచనాలను పెంచుతోంది. ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఒక సాహసికుడి పాత్రలో మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా కథలో వారణాసి పాత్ర, దాని ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యం ఎంత కీలకం కాబోతోందో తెలుసుకోవాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

Read also-Globe Trotter event: గ్లోబ్‌ ట్రూటర్‌ ఈవెంట్ కోసం సాహసం చేసిన మహేశ్ అభిమాని.. ఏం గుండెరా వాడిది..

కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతుండగా, త్వరలోనే దీనిపై కూడా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ‘వారణాసి’ టైటిల్ ప్రకటనతో మహేష్ బాబు అభిమానులు, సినీ ప్రేమికులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.

 

 

 

 

 

Just In

01

Varanasi Glimpse: ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే.. మహేష్ బాబు ఇరగదీశాడుగా

New Bus Stations: ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్.. గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 3 బస్‌స్టాండ్లు.. ఎక్కడెక్కడో తెలుసా?

Farooq Abdullah: ఉగ్రదాడిలో వైద్యుల ప్రమేయంపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు… తీవ్ర వివాదాస్పదం

AV Ranganath: బతుకమ్మకుంట బాగుందా? వాకర్లతో ముచ్చటించిన హైడ్రా కమిషనర్!

Rahul Gandhi: వెరీ గుడ్ రేవంత్ టీమ్ వర్క్ సూపర్ గో హెడ్.. రాహుల్ గాంధీ కాంప్లిమెంట్!