Nara Lokesh: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 30వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్-2025ను విజయవంతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) శనివారం సాయంత్రం ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తాను ధరించిన కొత్త జాకెట్ ఎలా ఉందో చెప్పాలని, సరైన జవాబు ఇచ్చినవారికి సర్‌ప్రైజ్ ఇస్తానంటూ ట్వీట్ చేశారు. ఈ జాకెట్ ఏ పదార్థంతో తయారైందో ఊహించగలారా? అని ప్రశ్నించారు. ‘ మీ జవాబును కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పినవారికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది!. నా ప్రశ్నకు సరైన జవాబు ఏంటో రాత్రి 7 గంటలకు పోస్ట్ చేస్తాను’’ అని వివరించారు.
Read Also- Tonsil Stones: టాన్సిల్ సమస్య ఎందుకు వస్తుంది? నివారణ కోసం పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలు
సీఐఐ సదస్సులో ఫుల్ బిజీ
ఆంధ్రప్రదేశ్‌లోకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా, విశాఖకేంద్రంగా నిర్వహిస్తున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్-2025ను విజయవంతంగా చేసేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. విశాఖపట్నంలోనే బస చేస్తూ వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఏపీలో నెలకొన్న అవకాశాలను వివరిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. తన ప్రయత్నాల్లో భాగంగా శుక్రవారం వారీ (WAREE) సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. కంపెనీ ఛైర్మన్ అంకితా జోషి, సీవోవో శ్యామ్ సుందర్ రఘుపతితో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అన్నివిధాలా అనుకూలమైన వాతావరణం నెలకొందని, సుదీర్ఘ పాలనానుభవం ఉన్న డైనమిక్ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ఏపీ పారిశ్రామికరంగంలో పరుగులు తీస్తోందంటూ అవకాశాలు వివరించానని తెలిపారు. రెన్యువబుల్ పవర్, డేటా సెంటర్లు, బ్యాటరీ స్టోరేజి రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశానంటూ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
అంతకుముందు, గ్లోబల్ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా, చీఫ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ రేచస్ ఎల్లాతో భేటీ అయినట్టుగా లోకేశ్ తెలిపారు. భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ (కోవిడ్ – 19), రోటావాక్ (రోటా వైరస్), టైప్ బార్ టీసీవీ (టైఫాయిడ్ వ్యాక్సిన్), జెన్వాక్ (జపనీస్ ఎన్సెఫలిటీస్) వంటి వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలకు పంపిణీ చేస్తోందని వివరించారు. అన్ నివిధాలా అనుకూలతలు ఉన్న ఏపీలో కూడా వ్యాక్సిన్ తయారీ యూనిట్ నెలకొల్పాలని తాను కోరినట్టు ఆయన వివరించారు.
How’s my new jacket?
Can you guess what it’s made of? Drop your guess below – the right answer wins a surprise gift! Answer will be posted 7 pm. #GuessAndWin#CIIPartnershipSummit2025 pic.twitter.com/yaas22bYIl— Lokesh Nara (@naralokesh) November 15, 2025
