Congress Victory: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం ఓ రికార్డ్. నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల గ్యాప్ ఏకంగా 10 శాతం ఉన్నట్లు రెండు పార్టీలు తమ ఇంటర్నల్ సర్వేల ద్వారా గుర్తించాయి. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ అత్యధికంగా ఉన్నది. కానీ సర్వేల ఆధారంగా ప్రత్యేకమైన వ్యూహాన్ని అనుసరిస్తూ పోలింగ్ నాటికి ఏకంగా కాంగ్రెస్ పార్టీ లీడ్ రాగా, ఫలితాల్లో బీఆర్ఎస్ కంటే 13 శాతం ఓట్లను అధికంగా సాధించి ప్రత్యర్ధులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అంటే ఈ ఉప ఎన్నికలోనే సుమారు 23 శాతం ఓట్ల షేర్‌ను కాంగ్రెస్ తన ఖాతాలోకి భారీగా పెంచుకున్నది. ఈ సంచలన విజయం వెనుక పార్టీ అనుసరించిన పక్కా వ్యూహాలు, మంత్రుల సమన్వయం కీలక పాత్ర పోషించాయి. ఇక కాంగ్రెస్ నాయకత్వం కేవలం ఎన్నికల ప్రచారంపై ఆధారపడకుండా, నియోజకవర్గంలో నిరంతరం నిర్వహించిన సర్వేలను తమ వ్యూహాలకు ఆధారంగా చేసుకున్నది. అంతర్గత సర్వేల ద్వారా గతంలో ఏ ప్రాంతాల్లో ఓట్లు కోల్పోయారో స్పష్టంగా తెలుసుకున్నారు. బీసీ, ఎస్సీ వర్గాల ఓట్లు అధికంగా ఉండే డివిజన్లపై ప్రత్యేక దృష్టి సారించి, వారి సమస్యల పరిష్కారంపై హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలైన మహాలక్ష్మి, చేయూత వంటి వాటిని విస్తృతంగా ప్ర
షేక్ పేట్, ఎర్రగడ్డలోనూ..
బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉంటాయని భావించిన ఎర్రగడ్డ, షేక్ పేట్ డివిజన్లలోనూ కాంగ్రెస్ అదరగొట్టింది. ఇందులో బీఆర్ఎస్‌కు కోర్ ఏరియాగా భావించిన ఎర్రగడ్డకు సీనియర్ మంత్రి దామోదర రాజనర్సింహకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. డివిజన్లలోని 50కిపైగా బూత్‌లలో ప్రత్యేకంగా టీమ్‌లను పెట్టి తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. రాజకీయాలపై స్పష్టమైన పట్టు, అవగాహన, అనుభవం కలిగిన నేత కావడంతో బీఆర్ఎస్‌కు తనదైన శైలిలో చెక్ పెట్టారు. హంగు, ఆర్భాటం, అధికార దర్పం, ప్రతిపక్షాలపై విమర్శలు లేకుండా స్పష్టంగా ప్రభుత్వం ఏం చేస్తుంది? చేయబోతుంది? గతంలో ఏం చేశాం? వంటి అంశాలపై స్థానిక బస్తీ ప్రజలకు అర్ధమయ్యే రీతిలో యాస మార్చి ప్రచారం చేశారు. కాలనీలు, గల్లీలు, ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలపై స్పష్టంగా ప్రచారం చేశారు. దీంతో ఎర్రగడ్డలో కాంగ్రెస్‌కు 14,158 ఓట్లు (48 శాతం) రాగా, బీఆర్ఎస్ 11,939(40 శాతం) ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక, షేక్ పేట్‌లో మంత్రులు వివేక్, కొండా సురేఖకు బాధ్యతలు అప్పగించారు. ఈ డివిజన్‌లో కాంగ్రెస్‌కు 48 శాతం, బీఆర్ఎస్కు 42 శాతం ఓట్లు వచ్చాయి.
Also Read: Warangal District: హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. ప్రైవేటు విద్యా సంస్థల నిరసన..?
సోమాజిగూడ డివిజన్‌లో..
వెంగళరావు నగర్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరిలు ప్రచారం చేయగా, అక్కడ కాంగ్రెస్‌కు 52 శాతం, బీఆర్ఎస్‌కు 35 ఓట్లు దక్కాయి. రహ్మత్ నగర్‌లో మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ప్రచారం నిర్వహించగా, కాంగ్రెస్‌కు 53 శాతం, బీఆర్ఎస్కు 38 శాతం ఓట్లు వచ్చాయి. సోమాజిగూడ డివిజన్‌లో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ప్రచారం చేయగా, కాంగ్రెస్‌కు 51 శాతం, బీఆర్ఎస్కు 32 శాతం ఓట్లు దక్కాయి. యూసప్ గూడ డివిజన్‌లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ క్యాంపెయిన్ చేయగా, కాంగ్రెస్‌కు 55 శాతం, బీఆర్ఎస్కు 34 శాతం ఓట్లు వచ్చాయి. బోరబండలో మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి ప్రచారం చేయగా, కాంగ్రెస్‌కు 49 శాతం, బీఆర్ఎస్కు 41 శాతం వచ్చాయి. ఓవరల్‌గా ముస్లిం ఓట్లలో 80 శాతం కాంగ్రెస్‌కే వచ్చాయని అధికార పార్టీ లీడర్లు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీ ఎక్కడ?.. బీహార్ ఫలితాలపై ఇంకా స్పందించని వైనం
