Maoist Surrender: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ..!
Maoist Surrender (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Maoist Surrender: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. మరో కీలక నేత లోంగుబాటు..?

Maoist Surrender: మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కీలక నేతలు వరంగల్ పోలీసుల(Warangal Police) ఎదుట లొంగిపోయినట్టుగా విశ్వసనీయ సమాచారం. మావోయిస్టు పార్టీలో లొంగిపోయిన వారిలో కొయ్యడి సాంబయ్య(Koyudi Sambaiah) అలియాస్ ఆజాద్ (బికేఎస్ఆర్ డివిజన్ కార్యదర్శి) అబ్బాస్ అలియాస్ రమేష్(Ramesh) (టెక్నికల్ టీం ఇన్చార్జి రామగుండం) గత రెండు రోజుల క్రితమే లుంగిపోయినట్లుగా సమాచారం ఉంది. అయితే ఈ విషయమై అటు వరంగల్ పోలీసులు ఇప్పటికి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. ఈ వార్తకు సంబంధించి బీజాపూర్ మీడియా వర్గాలు వెల్లడించాయి.

బికేఎస్ఆర్ డివిజన్ కమిటీ..

మావోయిస్టు పార్టీకి ఈ ఘటనతో మరో గట్టి దెబ్బ తగిలింది. తెలంగాణ(Telangana) మావోయిస్టు రాష్ట్ర కమిటీలు చురుకుగా ఉన్న ఇద్దరు ఆగ్రనేతలు లతోపాటు మరో 8 మంది వరంగల్ పోలీసులకు లొంగిపోయారని విశ్వసనీయ సమాచారంగా తెలుస్తోంది. అయితే అధికారిక పోలీసుల నివేదిక పెండింగ్లో ఉంది. ప్రస్తుతం వార్త నివేదికలో ఉన్న నిర్ధారణ ప్రకారం ఈ మావోయిస్టులందరూ రెండు రోజుల క్రితం లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన సోమవారం వెళ్లడయ్యే అవకాశం ఉంది. లొంగిపోయిన వారిలో బికేఎస్ఆర్ డివిజన్ కమిటీ కార్యదర్శి కొరియాడి సాంబయ్య అలియాస్ ఆజాద్ ఉన్నట్లుగా సమాచారం. ఆజాద్ గత కొన్ని దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలు కీలక వ్యూహాత్మక వ్యక్తిగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. టెక్నికల్ టీం ఇన్చార్జ్ పనిచేసిన అబ్బాస్ నారాయణ(Narayana) అలియాస్ రమేష్ కూడా లుంగిపోయినట్లుగా తెలుస్తోంది. రమేష్ చాలాకాలంగా రామగుండం ప్రాంతంలో చురుకుగా పనిచేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Also Read: Koragajja: ‘కాంతార’ తరహాలో ‘కొరగజ్జ’.. గూస్‌బంప్స్ తెప్పించే మరో రూటెడ్ కథ వస్తోంది!

విభేదాల నేపథ్యంలోనే లొంగిపోతున్న మావోయిస్టులు

మావోయిస్టు పార్టీలు అంతర్గత విభేదాలు అనే పద్యంలోనే లొంగిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఆజాద్ తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన ప్రముఖ మావోయిస్టు. దామోదర్ కు మరి కొంతమంది మావోయిస్టులకు అంతర్గత విభేదాలు అనే నేపథ్యంలోనే ఈ లొంగుబాట్లు జరుగుతున్నట్లుగా తీరుస్తోంది. ములుగు జిల్లాలోని ముద్దుల గూడెం గ్రామానికి చెందిన రాష్ట్ర కమిటీ లో కీలకమైన బాధ్యతలను ఆజాద్ కొనసాగిస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ లొంగుబాటును అధికారులు అధికారికంగా ధ్రువీకరించబడితే మావోయిస్టు పార్టీలు బలమైన పట్టును తెలుస్తోంది?. గత కొంతకాలంగా తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతంలో చురుకుగా ఉన్న మావోయిస్టు కార్యకలాపాలకు ఈ పరిణామం పెద్ద దెబ్బగా పరిగణించబడుతుందని తెలుస్తోంది.

గతంలోని చెప్పిన స్వేచ్ఛ

మావోయిస్టు కార్యకర్తలకు అతిపెద్ద మోస్ట్ వాంటెడ్ గా పరిణమిస్తున్న హిడ్మా గత కొంతకాలంగా గోదావరి పరివాహక ప్రాంత దట్టమైన అడవుల్లో అది కూడా కర్రెగుట్టల ప్రాంతంలో సంచరిస్తున్నాడని స్వేచ్ఛ(Swetcha) ద్వారా బహిర్గతం అయింది. అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకులు అక్కడ సమావేశాలు నిర్వహించినట్లుగా వార్తలు బహిర్గతం చేశాయి. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన పరిణామాల కారణంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొయ్యడ సాంబయ్య అలియాస్ గోపన్న అలియాస్ ఆజాద్ లొంగిపోతున్నట్టుగా భారీ ప్రచారం జరుగుతోంది. సాంబయ్య ములుగు జిల్లా గోవిందరావుపేట ముద్దుల గూడెం గ్రామానికి చెందినవారు. గత మూడు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నేత సాంబయ్య లొంగిపోతున్నాడనే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Modi on Bihar Verdict: బీహార్‌లో ఎన్డీయే గెలుపునకు ప్రధాని మోదీ చెప్పిన కారణాలు ఇవే

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..