KTR Warns Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం (Jubileehill bypoll Result) వచ్చి 24 గంటలు కూడా కాకముందే బీఆర్ఎస్ పార్టీ (BRS) కార్యకర్తలు, నాయకులపై గూండాయిజానికి, రౌడీయిజానికి పాల్పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉందని, కానీ, బీఆర్ఎస్ కార్యకర్త క్రిష్టోఫర్ మీద జరిగినట్టుగా ఎక్కడా దాడులు జరగలేదని అన్నారు. ఏదైనా ఉపఎన్నిక గెలిచిన తర్వాత తమ పార్టీకి చెందిన కార్యకర్తలు ఇంత హద్దులు దాటి ప్రవర్తించారా?, అనేది ఒక్కసారి గుర్తుతెచ్చుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఒకవేళ తాము కూడా ఏడు ఉపఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ విధంగా విర్రవీగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ సింబల్‌ను అవహేళన చేసేలా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రవర్తించలేదని పేర్కొన్నారు. కానీ, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలిచిన తర్వాత బీఆర్ఎస్ సింబల్ అయిన కారును ఊరేగిస్తూ, క్రేన్‌తో మోసుకెళ్తూ అవహేళన చేశారని కేటీఆర్ మండిపడ్డారు. తాము కూడా అలా చేసి ఉండే కాంగ్రెస్ వాళ్లు ఎక్కడ ఉండేవారో ఒక్కసారి ఆలోచించుకోవాలని (KTR Warns Congress) ఆయన హితబోధ చేశారు.
Read Also- KTR Meets Sunitha: జూబ్లీహిల్స్‌లో ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నివాసానికి వెళ్లిన కేటీఆర్
కార్యకర్తలకు కంటికి రెప్పలా ఉంటా
తమ పార్టీ కార్యకర్త క్రిష్టోఫర్, క్రీస్టియన్ మైనారిటీకి చెందనివాడని, ఆయనపై రెహ్మత్‌నగర్‌లో జరిగిన దాడిని ఖండిస్తున్నానని కేటీఆర్ చెప్పారు. ఈ దాడికి కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ‘‘కొన్ని ఎన్నికల్లో గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం. కానీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ విధంగా కక్షపూరితంగా వ్యహరిస్తాం, రౌడీయిజం చేస్తామంటూ తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు. తగిన బుద్ధి చెబుతారు. దాడిలో గాయపడ్డ క్రిష్టోఫర్‌కు ధైర్యం చెప్పడానికి మేమంతా వచ్చాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఏం జరిగినా కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. వదిలిపెట్టే సమస్యలేదు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గెలవొచ్చు, ఓడిపోవచ్చు, కానీ కార్యకర్తలకు ఎవరికి ఏ అన్యాయం జరిగినా అర్ధ గంటలో వస్తానని చెప్పాను, వచ్చానని పేర్కొన్నారు. ఎవరికి ఇబ్బంది ఎదురైనా ఇంటికి వెళ్తామని చెప్పారు.
Read Also- Jammu And Kashmir Blast: జమ్మూ-కాశ్మీర్ నౌగాం లో భారీ పేలుడు.. 9 మంది మృతి
రిగ్గింగులు, దొంగ ఓట్లు వేసినా.. మా ఓట్లు తగ్గులేదు
మంగళవారం నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఆ రోజు అన్ని విషయాలు చర్చిస్తామన్నారు. కానీ, ఈ దాడి విషయంలో కాంగ్రెస్ పునరాలోచించుకోవాలని, కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలని, సంయమనం పాటించకపోతే, విజయగర్వంతో ఇదే విధంగా విర్రవీగితే తప్పకుండా ప్రజలు బుద్ధి చెబుతారని, తప్పకుండా తాము కూడా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని కేటీఆర్ అన్నారు. రాకేష్ క్రిఫ్టోఫర్‌తో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. గతంలో తమకు 80 వేల ఓట్లు వస్తే, ఇప్పుడు 70 వేల ఓట్లు వచ్చాయని, తమకు ఓట్లేమీ తగ్గలేదని, ఇన్ని రిగ్గింగులు, ఇన్ని దొంగ ఓట్లు, ఇన్ని పైసలు పంచి, చీరలు పంచి, కుక్కర్లు పంచి, ఇన్ని కథలు పడ్డాక కూడా తమ అభ్యర్థికి 75 వేల ఓట్లు వచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదేమీ స్వల్ప సంఖ్య కాదు, కచ్చితంగా భవిష్యత్‌లో జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ జెండా ఎగురువేస్తామని అన్నారు. కేటీఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై కేటీఆర్ స్పందిస్తూ, తనది అహంకారం కాదని, ఆత్మవిశ్వాసమని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ది కేవలం టెక్నికల్ గెలుపు మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గుండాయిజం మానుకోకుండా ప్రజలే బుద్ధి చెప్పేలా తయారు చేస్తామని అన్నారు.
Live: కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ గారిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
📍రహమత్ నగర్, జూబ్లీహిల్స్ https://t.co/sz2mlvZUKd
— BRS Party (@BRSparty) November 15, 2025
