Modi on Bihar Verdict: ఎన్డీయే గెలుపునకు మోదీ చెప్పిన కారణాలివే
Narendra-Modi (Image source Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Modi on Bihar Verdict: బీహార్‌లో ఎన్డీయే గెలుపునకు ప్రధాని మోదీ చెప్పిన కారణాలు ఇవే

Modi on Bihar Verdict: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Bihar Election Results) ఎన్డీయే కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 243 సీట్లు ఉండగా, జేడీయూ సారధ్యంలోని ఎన్డీయే కూటమి 201 సీట్లు గెలుచుకుంది. ఈ గ్రాండ్ విక్టరీపై కూటమి పార్టీల నేతలు ఉప్పొంగిపోతున్నారు. ఆనందోత్సాహాలు జరుపుకుంటున్నారు. ఈ ఏకపక్ష ఫలితంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (Narendra Modi on Bihar Verdict) స్పందించారు. రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధి, సామాజిక న్యాయం ఈ విజయానికి కారణాలని, ఇది రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఆయన అభివర్ణించారు. ఇంతటి అఖండ విజయాన్ని అందించిన బీహార్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు చారిత్రకమైనవని, అమోఘమైనవని అభివర్ణించారు. కూటమి పనితీరును, దాని భవిష్యత్తు‌కు రాష్ట్ర ప్రజలు ఈ ఫలితాలతో ఆమోదముద్ర వేశారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు.

రానున్న రోజుల్లో బీహార్‌లో మౌలిక సదుపాయాలను సమూలంగా మార్చివేయడానికి, రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపును పటిష్టం చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తుందని మోదీ హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో బిహార్ అభివృద్ధి కోసం క్రియాశీలకంగా కృషి చేస్తామన్నారు. బీహార్ యువత, మహిళాలకు సంపన్నమైన జీవితం అందించేందుకుగానూ చక్కటి అవకాశాలు అందేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

Read Also- Bihar CM Race: బీహార్‌‌లో మొదలైన సీఎం రేస్!.. జేడీయూ ట్వీట్ డిలీట్.. బీజేపీ సీఎం అభ్యర్థి ఆయనేనా?

బీహార్‌లో ఇంతటి అమోఘమైన విజయం సాధించేందుకు కృషి చేసిన ఎన్డీయే పార్టీల కార్యకర్తలు, నేతలను ప్రధాని మోదీ అభినందించారు. అందరూ అలుపెరుగకుండా కష్టపడ్డారని, ఎన్డీయే ప్రభుత్వ అజెండాను జనాల్లోకి తీసుకెళ్లి వివరించారని, ప్రతిపక్షాల ప్రతి అబద్ధాన్ని గట్టిగా తిప్పికొట్టారంటూ కార్యకర్తలను మెచ్చుకున్నారు.

బీహార్‌లో ఇంతటి అమోఘమైన విజయం సాధించేందుకు కృషి చేసిన ఎన్డీయే పార్టీల కార్యకర్తలు, నేతలను ప్రధాని మోదీ అభినందించారు. అందరూ అలుపెరుగకుండా కష్టపడ్డారని, ఎన్డీయే ప్రభుత్వ అజెండాను జనాల్లోకి తీసుకెళ్లి వివరించారని, ప్రతిపక్షాల ప్రతి అబద్ధాన్ని గట్టిగా తిప్పికొట్టారంటూ కార్యకర్తలను మెచ్చుకున్నారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సీఎం నితీష్ కుమార్, కూటమిలో కీలక భాగస్వాములైన చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బీహార్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసే విషయంలో ఎన్డీయే నిబద్ధతకు బీహార్ ప్రజలు పట్టం కట్టి ప్రతిఫలం ఇచ్చారని కొనియాడారు. ఈ చారిత్రాత్మక విజయం బీహార్ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని మోదీ చెప్పారు. అద్భుతమైన ఈ ప్రజాతీర్పు బీహార్ కోసం నూతన సంకల్పంతో కృషి చేయడానికి తమకు మరింత ఉత్తేజాన్ని ఇస్తుందని వివరించారు.

Read Also- Kishan Reddy: కాంగ్రెస్ అందుకే గెలిచింది.. జూబ్లీహిల్స్ ఫలితంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Just In

01

Bhatti Vikramarka: బీజేపీలోని ఏ ఒక్క‌నాయ‌కుడైనా దేశం కోసం త్యాగం చేశారా? : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

Sridhar Babu: మున్సిపల్ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి!

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?

Grok AI Misuse: 3 రోజుల్లో ఆ కంటెంట్‌ను తొలగించండి.. ‘ఎక్స్’కి కేంద్రం సంచలన నోటీసులు

Urea Supply: రైతులు క్షమించరు జాగ్రత్త.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై ఫైర్