Kishan-Reddy (Image source Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Kishan Reddy: కాంగ్రెస్ అందుకే గెలిచింది.. జూబ్లీహిల్స్ ఫలితంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Kishan Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో (Jubilee Hills bypoll) బీజేపీకి ఏమాత్రం మింగుడుపడని ఫలితం వచ్చింది. కేవలం 17,061 ఓట్లు మాత్రమే రావడంతో కమలనాథులు డిపాజిట్ కూడా కోల్పోయారు. ఈ స్థాయి అనూహ్యమైన ఈ పరాజయంపై కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘మేము ఉన్నంతలో ప్రయత్నం చేశాం. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎంఐఎం సహకరించడం వల్లే కాంగ్రెస్ గెలిచింది. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఏం చేశాడని ఆయనకు అనుకూలంగా ఓటెయ్యాలి. ప్రత్యేక పరిస్థితులలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగాయి. మా పార్టీ అక్కడ బలహీనంగా ఉంది. ఓటమిని విశ్లేషించుకుంటాం. ఓల్డ్ సిటీలో కూడా ఏ పార్టీ గెలవదు. ప్రజా తీర్పును మేము శిరసావహిస్తాం. హస్తం పార్టీ, కారు పార్టీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. దీనిపై మేము ఫిర్యాదు చేస్తాం’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తాము ఎప్పుడూ ఒక కార్పొరేటర్‌ను కూడా గెలవలేదని ఆయన సమర్థించుకున్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ అక్కడ గెలవలేదని ఆయన ప్రస్తావించారు.

Read Also- KTR on Jubilee Hills Result: జూబ్లీహిల్స్ ఫలితంపై కేటీఆర్ తొలి స్పందన ఇదే

జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టిపెట్టాం

జీహెచ్ఎంసీ ఎన్నికలపై తాము దృష్టిపెట్టామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవిని గెలుచుకోవడమే బీజేపీ లక్ష్యమని ఆయన వివరించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనేక చోట్ల డిపాజిట్లు దక్కలేదని ప్రస్తావించారు. ఇక, బీహార్ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి బీహార్ ప్రజలు పట్టడం కట్టారని హర్షం వ్యక్తం చేశారు. ‘‘
మేము ఊహించనంత భారీ విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు. ఓటు చోరీ పై కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాన్ని ఓటర్లు తిప్పికొట్టారు. దేశమంతా ఎస్ఐఆర్ జరగాలి. జూబ్లీహిల్స్‌లో ఓటర్ జాబితా తప్పుల తడకగా ఉంది. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ప్రజల దృష్టిలో రాహుల్ గాంధీ నవ్వుల పాలయ్యారు’’ అని కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Read Also- Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్.. షాకింగ్ కామెంట్స్ చేసిన కవిత

కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము ప్రత్యామ్నాయమని, ప్రధాన ప్రతిపక్షం తామేనని చెప్పుకుంటూ వస్తున్న బీజేపీ, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఊహించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆ పార్టీ తరపున పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. 17,061 ఓట్లతో ఆయన మూడవ స్థానానికి పరిమితం అయ్యారు. గెలుపునకు ఏకంగా 98,988 ఓట్ల మేర వెనుకబడ్డారు.

Just In

01

Globe Trotter event: ‘SSMB29’ ఈవెంట్ లోకేషన్ డ్రోన్ విజువల్ చూశారా.. పిచ్చెక్కుతుంది భయ్యా..

Gadwal: గద్వాల గోనుపాడులో వెంచర్‌ స్థలం కబ్జా.. మాజీ నాయకుడే అనుమతిచ్చాడు అంటూ వ్యాపారి

Akhanda 2: బాలయ్య ‘అఖండ 2’ తాండవం సాంగ్ వచ్చేసింది.. ఏం కొట్టాడు భయ్యా థమన్..

Revanth On JubileeHills Result: జూబ్లీహిల్స్‌ ఫలితంపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. పక్కనే కొత్త ఎమ్మెల్యే నవీన్

Telangana Govt: పత్తి, వరి పంటల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధం.. ఈ యాప్‌లో మీ పంట వివరాల నమోదు చేసుకోవాలి!