Crime News (imagecredit:twitter)
క్రైమ్

Crime News: నకిలీ పత్రాలతో 52 డొల్ల కంపెనీల ఏర్పాటు.. ఇద్దరు అరెస్ట్.. పరారీలో మాస్టర్‌ మైండ్..!

Crime News: ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ(GST) పన్నులో రూ.11.79 కోట్లు మోసం చేసిన ఒక పెద్ద ముఠా గుట్టును సైబరాబాద్ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్(Cyberabad Economic Offences Wing) అధికారులు ఛేదించారు. ఈ మోసంలో పాల్గొన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రధాన సూత్రధారి సహా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ డీసీపీ ముత్యం రెడ్డి(DCP Mutyam Reddy) తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్‌(Gujarath)కు చెందిన సోహైల్ మురాద్ అలీ లఖానీ (34), హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అక్రమ్ హస్ముద్దీన్ (43) ప్రధాన నిందితులలో ఉన్నారు.

అనేక బోగస్ కంపెనీలు

వీరి ముఠాలో మాస్టర్‌మైండ్ అబ్దుల్లా(Abdullah), నకిలీ పత్రాల (ఆధార్, పాన్ కార్డులు, కరెంట్ బిల్లులు) సహాయంతో అనేక బోగస్ కంపెనీలను సృష్టించాలని పథకం వేశాడు. నిందితులు నకిలీ పత్రాలు ఇచ్చి సిమ్ కార్డులు, జీహెచ్‌ఎంసీ(GHMC) లైసెన్సులు పొందారు. ఆ తర్వాత, ఈ నకిలీ కంపెనీలను జీఎస్టీ పోర్టల్‌(GST Portal)లో రిజిస్టర్ చేసి, జీఎస్టీ నంబర్లు తీసుకున్నారు. వీరు 52 డొల్ల కంపెనీలను తెలంగాణ(Telangana), మహారాష్ట్ర(mahrasta), తమిళనాడు(Tamil Nadu) సహా 8 రాష్ట్రాల్లో ప్రారంభించారు.

Also Read: Gold Chain Theft: 4 తులాల గోల్డ్ చైన్ చోరీ.. 12 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు.. ఎలాగంటే?

భారీగా టర్నోవర్ చేసినట్టు..

ఈ కంపెనీల పేరిట నకిలీ కొనుగోలు, అమ్మకాల పత్రాలు సృష్టించి, ఆ కంపెనీలు భారీగా టర్నోవర్ చేసినట్టు చూపించారు. దీని ఆధారంగా ఇన్​పుట్ టాక్స్ క్రెడిట్(Input Tax Credit) అనే విధానాన్ని ఉపయోగించి ప్రభుత్వ సొమ్ము రూ.11.79 కోట్లును కొట్టేశారు. ఇందుకోసం 405 నకిలీ ఈ-వే బిల్లులను కూడా తయారు చేశారు. చాలా రోజులుగా ఈ మోసం చేస్తున్న సోహైల్(Sohail), మహ్మద్ అక్రమ్‌(Mohammad Akram)లను ఏసీపీ రవీందర్ నేతృత్వంలో దర్యాప్తు చేసి అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠాలో పరారీలో ఉన్న మిగతా ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also Read: TG Endowments Act: ఎండోమెంట్ యాక్ట్ సవరణ.. ఆలయ భూముల ఆక్రమణకు ఇక చెక్..!

Just In

01

Singareni: సింగరేణికి జాతీయ స్థాయి ఉత్తమ అవార్డ్.. స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో ఎంపిక!

Soy Milk vs Cow Milk: సోయా పాలు vs ఆవు పాలు.. వీటిలో ఏది ఆరోగ్యకరం?

Transport Department: రవాణా శాఖ ఆఫీసర్ల కొరడా.. రెండ్రోజుల్లో 1050 కేసులు.. ఓవర్ లోడ్‌పై కఠిన చర్యలు!

Breast Cancer: యువతుల్లో పెరుగుతోన్న బ్రెస్ట్ క్యాన్సర్.. కారణాలు ఇవే

Kishan Reddy: కాంగ్రెస్ అందుకే గెలిచింది.. జూబ్లీహిల్స్ ఫలితంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్