Tummala Nageswara Rao (imagecredit:twitter)
తెలంగాణ

Tummala Nageswara Rao: పంట నాణ్యతా ప్రమాణాలు సడలించండి: మంత్రి తుమ్మల లేఖ

Tummala Nageswara Rao: ఎన్ఏఎఫ్ఈడీ, ఎన్సీసీఎఫ్ సంస్థలు సడలించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సోయాబీన్‌ను కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan), గిరిరాజ్ సింగ్‌(Giriraj Singh)లకు లేఖలు రాశారు. రాష్ట్రంలో సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో ఏర్పడుతున్న సమస్యలను కేంద్ర మంత్రులకు తుమ్మల వివరించారు.

ప్రత్యేక సడలింపులు

మొంథా తుపాను, అకాల వర్షాలు, అనిశ్చిత వాతావరణం కారణంగా రాష్ట్రంలో సోయాబీన్(Soybean), మొక్కజొన్న(corn), పత్తి(cotton) పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సేకరించే సోయాబీన్, పత్తి విషయంలో కొన్ని ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ(Telanagan)లో 3,66,697 ఎకరాల్లో సోయాబీన్ సాగైందని, సగటున దిగుబడి ఎకరాకు 7.62 క్వింటాళ్లుగా అంచనా వేశామన్నారు. వర్షాల వల్ల గింజల్లో రంగు మారడం, ముడతలు పడటం వంటి సమస్యల కారణంగా పంట ఎఫ్‌ఏక్యూ (FQ)నిబంధనలకు అనుగుణంగా రావడం లేదని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పరిగణించి సోయాబీన్‌పై ఎఫ్‌ఏక్యూ ప్రమాణాలను సడలించాలని కేంద్రాన్ని కోరారు.

Also Read: Chennai Love Story: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ పోస్టర్.. స్పెషల్ ఏంటంటే?

రైతుల్లో ఆందోళన..

మొక్కజొన్న సాగు ప్రస్తుతం 6.74 లక్షల ఎకరాల్లో జరుగుతుండగా, 25 క్వింటాళ్ల సగటు దిగుబడితో సుమారు 16.85 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని అంచనా వేశామన్నారు. మార్కెట్‌లో ధర క్వింటాళ్లకు రూ.1959కి పడిపోయిందని, కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.2400 రాకపోవడంతో రైతుల్లో ఆందోళన పెరిగిందని మంత్రి వివరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 48,757 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసి 14,519 మంది రైతులకు ప్రయోజనం కల్పించినట్లు తెలిపారు. ఎంఎస్‌పీ కింద మొత్తం 16.85 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు ఎన్‌ఏఎఫ్‌ఈడీ, ఎన్సీసీఎఫ్ సంస్థలకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అదేవిధంగా, మరోసారి పత్తి కొనుగోళ్లలో ఎకరాకు 7 క్వింటాళ్ల నిబంధనను ఎత్తివేయాలని కూడా మంత్రి తుమ్మల కేంద్రాన్ని కోరారు.

Also Read: Parasakthi Teaser: పెను సైన్యమై కదలిరా.. ‘పరాశక్తి’ టీజర్ ఎలా ఉందంటే?

Just In

01

Soy Milk vs Cow Milk: సోయా పాలు vs ఆవు పాలు.. వీటిలో ఏది ఆరోగ్యకరం?

Transport Department: రవాణా శాఖ ఆఫీసర్ల కొరడా.. రెండ్రోజుల్లో 1050 కేసులు.. ఓవర్ లోడ్‌పై కఠిన చర్యలు!

Breast Cancer: యువతుల్లో పెరుగుతోన్న బ్రెస్ట్ క్యాన్సర్.. కారణాలు ఇవే

Kishan Reddy: కాంగ్రెస్ అందుకే గెలిచింది.. జూబ్లీహిల్స్ ఫలితంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Bigg Boss 9: ఆ మెమోరీస్ గుర్తు చేసుకుని ఎమోషన్ అయిన బిగ్ బాస్ సభ్యులు.. పాపం తినడానికి తిండిలేక..