TG Endowments Act (imagecredit:twitter)
తెలంగాణ

TG Endowments Act: ఎండోమెంట్ యాక్ట్ సవరణ.. ఆలయ భూముల ఆక్రమణకు ఇక చెక్..!

TG Endowments Act: ఎండోమెంట్ యాక్ట్ లోని సెక్షన్ 83ని సవరించబోతోంది. ఆ యాక్టులో సవరణలతో దేవాయభూముల(Divine Land) ఆక్రమణకు చెక్ పెడనుంది. ఆలయ ఈఓలకు ఫుల్ పవర్స్ ఇచ్చి ఆక్రమణ దారులపై ఉక్కుపాదం మోపనున్నారు. వెంటనే ఆ భూముని స్వాధీనం చేసుకోనున్నారు. మళ్లీ ఎవరు భూముల జోలికి రాకుండా నిబంధనలను కఠినతరం చేయబోతున్నారు.

ఈ యాక్టులో..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని దేవాదాయశాఖ చట్టంలోని సెక్షన్ 83ని అమలు చేశారు. ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత తెలంగాణ ఆ సెక్షన్ ను దత్తత తీసుకొని సెక్షన్ 83 ఎండోమెంట్ యాక్టును కొనసాగిస్తుంది. ఈ యాక్టులోని లొసుగులు భూ అక్రమణదారులకు వరంగా మారాయి. ఈ యాక్టులో ఎవరైనా దేవాదాయశాఖ భూమిని ఆక్రమిస్తే ఆ ఆక్రమణదారులకు నోటీసు ఇచ్చే అధికారంగానీ, కేసులు పెట్టే అధికారం గానీ లేదు. ఆ ఆక్రమణదారు నిర్మించి గోడలను సైతం కూలగొట్టే రైట్స్ లేవు. సంబంధిత ఆలయ ఈఓ అసిస్టెంట్ కమిషనర్ కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆ కమిషనర్ ఎండోమెంట్ ట్రిబ్యూనల్ ను ఆశ్రయిస్తారు. ఆ ట్రిబ్యూనల్ లో కేసు వాదించాల్సి ఉంటుంది. అందులో ఆ ఆక్రమణకు గురైన భూమి దేవాదాయశాఖ కు చెందిన భూమి అని ప్రూ(నిర్ధారణ) చేసుకోవాల్సి ఉంది. ప్రూ అయిన తర్వాతే ఆక్రమణదారుడిపై చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుంది. ఈ తతంగం అంతా జరిగే సరికి నెలలు, సంవత్సరాలు గడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Also Read: Tollywood: రాఘవేంద్రరావు – నిహారిక.. ఎందుకింత రచ్చ? అందులో ఏముందని?

అత్యధికంగా మహబూబ్ నగర్..

ఇప్పటికే రాష్ట్రంలో 87235.39 ఎకరాలు ఆలయ భూములు ఉండగా ఏకంగా 20124.03 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. కాగా విత్ అవుట్ లిటిగేషన్ తో మరో 5569.35 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు పేర్కొంటున్నప్పటికీ అధికారికంగా మాత్రం చూపడం లేదు. రాష్ట్రంలో అత్యధికంగా మహబూబ్ నగర్(Mahabubnagar) జిల్లాలోనే భూములు ఎక్కువగా ఆక్రమణకు గురయ్యాయి. ఆ జిల్లాలో 5522.22 ఎకరాలు ఉండగా అందులో 3018.01 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు అధికారికంగా వెల్లడించారు. రెండోస్థానంలో మేడ్చల్(Medical) జిల్లా ఉంది. ఈ జిల్లాలో 4125.03 ఎకరాల్లో 2888.18 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. మూడోస్థానంలో హైదరాబాద్(Hyderabada) జిల్లా ఉంది. 5718.01 ఎకరాలు, 6 కిస్తాన్ ఉండగా 2374.25 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఇలా అన్ని జిల్లాల్లోనూ ఆలయభూములు ఆక్రమణకు గురైంది. అయితే ఉన్న భూమిని కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం ల్యాండ్ ప్రొటక్షన్ సెల్ సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ఠ్రంలో ఎక్కడైనా ఆలయ భూములు కబ్జాకు గురవుతున్నట్లు ఫిర్యాదు వస్తే అక్కడికి వెళ్లి అడ్డుకోవాల్సి ఉంది. దీనికి తోడు ఎండోమెంట్ లీగల్ సెల్ ను సైతం ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఆశించిన మేర ఫలితాలు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఈఓలకే పూర్తి బాధ్యతలు

ఇది ఇలా ఉంటే ఏపీలో చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) అధికారంలోకి వచ్చిన తర్వాత ఎండోమెంట్ యాక్టులోని సెక్షన్ 83లో సవరణలు చేశారు. దాంతో సంబంధిత ఆలయ ఈవో, అసిస్టెంట్ కమిషనర్ ఫిర్యాదు, ఎండోమెంట్ ట్రిబ్యూనల్ కు వెళ్లాల్సిన అవసరం లేదుకుండా సవరణ చేశారు. ఆలయ ఈఓలకే పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఎవరైనా ఆలయ భూమి ఆక్రమిస్తే ఆక్రమణదారుడిపై కేసులతో పాటు వెంటనే నోటీసు ఇచ్చి తిరిగి స్వాధీనం చేసుకునే విధంగా అధికారాలు కల్పించాలి. మున్సిపాలిటీల్లో, జీహెచ్ఎంసీ(GHMC)ల్లో కమిషనర్లకు ఎలాంటి అధికారులు కల్పించారో అదే అధికారాలను ఏపీ ప్రభుత్వం ఈఓలకు కల్పించింది. అయితే తెలంగాణ(Telangana) ప్రభుత్వం సైతం ఎండోమెంట్ యాక్టులోని సెక్షన్ 83 ని సవరణపై అధ్యయనం చేసింది. ఆ ప్రభుత్వం చేసిన సవరణ ప్రతులను తెప్పించుకొని అధ్యయనం చేశారు. యాక్టులోని సెక్షన్ ను మార్చేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన అన్ని అంశాలను సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వానికి సైతం పంపించినట్లు సమాచారం. త్వరలో జరుగబోయే కేబినెట్ లో చర్చించి అప్రూవల్ తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఈ సెక్షన్ 83ని సవరణ చేస్తే రాష్ట్రంలోని ఆలయ భూములు సంరక్షించబడనున్నాయి. ఆక్రమణకు తావులేకుండా భవిష్యత్ తరాలకు సైతం ఆలయాల ప్రతిష్ఠతోపాటు భూములను వారసత్వంగా ఇవ్వొచ్చు.

Also Read: Ayodhya Reddy: పారదర్శక పాలనకే సమాచార హక్కు చట్టం.. రాష్ట్ర సమాచార కమిషనర్ అయోధ్య రెడ్డి

Just In

01

MLC Kavitha: హైర్ బస్సు డ్రైవింగ్ ఆర్టీసీ సిబ్బందికి ఇవ్వాలి:ఎమ్మెల్సీ కవిత

Rashmi Gautam: జూబ్లీహిల్స్ బై పోల్ రిజల్ట్స్.. సంచలన పోస్ట్ పెట్టిన యాంకర్ రష్మి

Gaddam Prasad Kumar: నేడో రేపో ఎమ్మెల్యేల ఫిరాయింపుల విచారణ..!

Warangal District: హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. ప్రైవేటు విద్యా సంస్థల నిరసన..?

Manoj Gaur Arrested: రూ.12 వేల కోట్ల మనీలాండరింగ్.. ఎస్‌ఎల్‌బీసీ కాంట్రాక్ట్ సంస్థ ఎండీ అరెస్టు