Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 67వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 67) ఊహించని ట్విస్ట్ కాదు.. ఊహించని గెస్ట్ ఎంట్రీ ఇచ్చారు. ఈయన హౌస్‌మేట్‌గా ఉండటానికి వచ్చిన గెస్ట్ కాదు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న రాజులు, రాణికి రాయల్ ఫుడ్ వండివ్వడానికి వచ్చిన ది గ్రేట్ వారెవ్వా చెఫ్ సంజయ్ తుమ్మ. అవును, సంజయ్ తుమ్మ (Sanjay Thumma) తన టీమ్‌తో హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో.. హౌస్ అంతా సందడి సందడిగా ఘుమఘుమలతో నిండిపోయింది. రాయల్ ఫుడ్ కేవలం కింగ్స్, క్వీన్‌కే అని అనడంలో మిగతా హౌస్‌మేట్స్ ఫేస్‌లు ఎలా మారిపోయాయో తెలియాలంటే.. చెబితే సరిపోదు.. కచ్చితంగా చూడాల్సిందే. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలను బిగ్ బాస్ విడుదల చేయగా, అవి వైరల్ అవుతున్నాయి. అసలీ ప్రోమోలలో ఉన్న మ్యాటర్ ఏంటంటే..
Also Read- Chennai Love Story: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ పోస్టర్.. స్పెషల్ ఏంటంటే?
ఎంటర్‌టైన్‌మెంట్ రెసిపీ
‘కోడి కూర, చిల్లుగారె’ సాంగ్‌తో చెఫ్ సంజయ్ తుమ్మ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో.. ఒక్కసారిగా హౌస్‌మేట్స్ ఆనందంతో ఊగిపోయారు. అంతా కలిసి ఆయనతో స్టెప్పులు వేశారు. ఆల్రెడీ సంజయ్ జడ్జిగా ఉన్న మరో షోలో కొన్నాళ్ల పాటు ఇమ్ము కూడా పార్టై ఉండటంతో.. అతనిపై చెఫ్ ఎక్కువ ప్రేమని కురిపించారు. ‘నేను ఎంతో హోప్స్‌తోటి, ఎంతో ఇష్టమైన ఫుడ్ తీసుకురావాలని వచ్చాను’ అని చెఫ్ అంటే, ఇప్పుడు మీరు కుక్ చేయబోతున్నారా? అని రీతూ అడిగింది. ‘మరి.. మీకు వడ్డించడం కోసం బిగ్ బాస్ పంపించారు’ అని సంజయ్ చెప్పారు. అనంతరం హౌస్‌లోకి అడుగు పెట్టిన సంజయ్.. ‘వావ్’ అనేశారు. తర్వాత ఇమ్ము రైమింగ్ డైలాగ్స్‌తో కామెడీ చేస్తున్నాడు. ‘మీకు.. మా సుమన్ అన్నని చూస్తే ఏ డిష్ చెప్పాలని ఉంది?’ అని రాణి రీతూ సంజయ్‌ని ప్రశ్నించింది. ‘సుమన్ అన్న.. అద్భుతమైన సాంబారు’ అని సంజయ్ చెప్పారు. ఇమ్మూని టెడ్డీబేర్‌తో పోల్చుతూ.. తలపై ఓ ముద్దు పెట్టిన సంజయ్.. ‘ఏంటిరా.. జుట్టు ఊడిపోయింది ఏంటిరా?’ అని అడగగానే.. ‘ఇక్కడ ప్రెజర్ అలా ఉంది సార్’ అని సమాధానం ఇచ్చాడు ఇమ్ము. ‘రాజులకు, రాణికి మంచి భోజనం వడ్డించాలని నన్ను పంపించారు’ అని క్లాప్స్ కొట్టగానే వెరైటీ డిష్‌లు పట్టుకుని వచ్చి, ఆరు బయట డైనింగ్ ఏర్పాటు చేశారు.
రాజులకు, రాణికి పెట్టే ఫుడ్ చూసి.. ప్రజలు హర్టయ్యారు. ‘రాజ్యంలో ప్రజలు మీకు నచ్చరా? మేం చెత్తకుప్పలో దొరికామా?’ అని ఇమ్ము, సుమన్ శెట్టి.. బిగ్ బాస్‌ని ప్రశ్నిస్తున్నారు. ‘రాయల్ ఫుడ్ మీకోసం ఏర్పాటు చేశాము. రాజులు, రాణి ఏదైనా వదిలేస్తే.. మీకు తప్పకుండా వడ్డిస్తాం’ అని సంజయ్ ప్రజలకు చెప్పారు. ‘రాజులు, రాణి, కమాండర్స్ వదిలేస్తే మాకా.. స్ఫూన్, ప్లేట్స్ కూడా వదలరు. వీళ్లు కింగ్‌లైందే తినడానికి అన్నట్లుగా, మూడు రోజుల నుంచి తింటూనే ఉన్నారు. మావి పేద బతుకులు సార్.. మమ్మల్ని చూసేనా ఇవ్వండి సార్’ అంటూ సంజయ్‌ని ఇమ్ము ప్రాధేయపడుతున్నాడు.
Also Read- Kaantha Controversy: ‘కాంత’.. ఎవరి తాత, నాన్నల కథ కాదు.. కాంట్రవర్సీపై రానా, దుల్కర్ క్లారిటీ!
ప్రజా తిరుగుబాటు
‘ప్రజా తిరుగుబాటు’ అంటూ వచ్చిన మరో ప్రోమోలో రాజులు, రాణిపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇమ్ము గొడ్డలి పట్టుకుని ‘మేము మీపై తిరుగుబాటు చేస్తున్నాం. కావాలి కావాలి.. మాకు న్యాయం కావాలి’ అని నిరసనకు దిగారు. ‘మీకు ఎందుకు వండి పెట్టాలి. మాకు ఏమైనా కంటెండర్‌షిప్స్ ఇచ్చారా? మాకు ఏమైనా గేమ్స్ ఆడే ఛాన్సులు ఇచ్చారా? మాకు శిక్షలు విధించారే తప్ప.. మా న్యాయం కోసం ఎప్పుడైనా ఆలోచించారా?’ అని ప్రజలు పోరాటం చేస్తున్నారు. రాజులు, రాణి వచ్చి ప్రజలతో మాట్లాడుతున్నారు. ఈలోపు రాణి రీతూ ఇమ్ము ఎదురుగా రాగా, ‘చెలికత్తెను వెళ్లమను.. ఓ.. చెలికత్తె కాదా?’ అంటూ కామెడీ చేస్తున్నాడు.
‘మా హక్కులు మాకు కావాలి. రాజ్యంలో అందరినీ సమానంగా చూడాలి. మీరు తినేదే మేమూ తింటాం. మీరు పడుకునే చోటే మేమూ పడుకుంటాం. అలా అయితేనే మీ రాజ్యంలో ఉంటాం. లేదంటే, వేరే రాజ్యానికి వలసపోతాం. వెళ్లి అక్కడ కలిసిపోతాం’ అంటూ రాజులు, రాణితో ప్రజలు వాదిస్తున్నారు. ప్రజలను విడదీసి వారితో రాజకీయం చేస్తున్నారు రాణి, రాజులు. సుమన్ శెట్టిని, రీతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇమ్మూకి తనని తోశారని చెబుతూ.. సుమన్ శెట్టి ఏడ్చేస్తున్నారు. వారిద్దరిని శిక్షించి, వారిలో వారికి తగాదా పెట్టి.. నవ్వుకుంటున్నారు రాణి, రాజులు. మొత్తంగా అయితే, ఈ రోజు ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్ అనే రేంజ్‌లో ఒక్కొక్కరు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఫుల్ ఎపిసోడ్ చూడాలంటే మాత్రం.. ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
