Jogipet Robbery ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Jogipet Robbery: జోగిపేటలో రెండు దుకాణాల్లో చోరీ.. రూ.3.5 లక్షల విలువైన ఫోన్లు దొంగతనం

Jogipet Robbery:  జోగిపేట పట్టణంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న రెండు దుకాణాల్లో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఎదురెదురుగా ఉన్న ఈ రెండు దుకాణాల్లో దొంగతనం జరగడం స్థానికంగా ఆందోళన కలిగించింది.

Also Read: Jogipet: జోగిపేటలో పట్టపగలు చోరీ.. మహిళ మెడలో పుస్తెలతాడు లాక్కెళ్లిన దొంగ!

మొబైల్ షాపులో భారీ చోరీ

బండపోతుగల్ గ్రామానికి చెందిన ఎండీ ముజాయిద్ మొబైల్ షాపు యజమాని. ఎప్పటిలాగే సోమవారం రాత్రి దుకాణానికి తాళం వేసి వెళ్లిన ఆయన, మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి షట్టర్‌ తాళం తీసి ఉండటాన్ని గమనించారు. ఆందోళనతో లోపలికి వెళ్లి చూడగా, షాపులో ఉన్న రూ. 3.50 లక్షల విలువ చేసే 28 స్మార్ట్‌ఫోన్‌లు చోరీకి గురైనట్లు గుర్తించారు. దొంగిలించబడిన వాటిలో వీఓ, పోకో, ఓప్పో కంపెనీలకు చెందిన ఫోన్‌లు ఉన్నట్లు తెలుస్తుంది.

ఫర్టిలైజర్ షాపులో

అదే సమయంలో, ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లే దారిలో ఉన్న చింత రాజమల్లయ్య ఫర్టిలైజర్ షాపులో కూడా దొంగతనం జరిగింది. అర్ధరాత్రి 12:44 నిమిషాల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి షట్టర్‌ తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించి, షాపులోని రూ. 15 వేల నగదును దోచుకున్నట్లుగా సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. బాధితులు చింతల రాకేశ్ (ఫర్టిలైజర్ షాపు యజమాని తరఫున), ముజాయిద్ (మొబైల్ షాపు యజమాని) జోగిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Jogipet News: రైతులకు అదిరిపోయే మార్గం.. పత్తి సాగులో కొత్త టెక్నిక్!

Just In

01

Chennai Love Story: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ పోస్టర్.. స్పెషల్ ఏంటంటే?

Warangal: వరంగల్‌లో ఏడీబీ ప్రతినిధుల పర్యటన.. ముంపు ప్రాంతాలు, నాలా స్థితిగతుల పరిశీలన

Collector Santhosh: ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు కృషి.. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలి కలెక్టర్ సంతోష్

Terror Accused Dr Shaheen: మహిళా టెర్రర్ డాక్టర్.. ఈమె గురించి తెలిస్తే.. బుర్ర బద్దలు కావాల్సిందే?

OnePlus 15 India Launch: గుడ్ న్యూస్.. మరి కొద్దీ గంటల్లో OnePlus 15 ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవే!