The Face of The Faceless: ఆస్కార్‌కు నామినేటైన సినిమా తెలుగులో రిలీజ్
The Face of The Faceless (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

The Face of The Faceless: 123 అవార్డులు పొంది, ఆస్కార్‌కు నామినేటైన సినిమా తెలుగులో.. రిలీజ్ ఎప్పుడంటే?

The Face of The Faceless: ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్’ (The Face of the Faceless) మూవీ వరల్డ్ వైడ్‌గా సిల్వర్ స్క్రీన్‌పై సంచలనాలను క్రియేట్ చేసి, 2024 ఆస్కార్ అవార్డులకు సైతం నామినేటైంది. ఇప్పుడీ మూవీ తెలుగులో, తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ట్రై లైట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని.. దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ మద్దతుతో నవంబర్ 21న తెలుగు వెర్షన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

Also Read- Ram Gopal Varma: ‘శివ’ సైకిల్ చేజ్ చైల్డ్ ఆర్టిస్ట్‌కు 35 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన వర్మ! ఆ పాప ఇప్పుడెలా ఉందంటే?

అప్పుడు నటుడిగా, ఇప్పుడు పాస్టర్‌గా..

కాథలిక్ మత సోదరి, సామాజిక కార్యకర్త సీనియర్ రాణి మరియా నిజ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది, ఆమె పేదల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా పనిచేసిన మంచి మనిషి. ఈ చిత్రం సీనియర్ రాణి మరియా ఎదుర్కొన్న కష్టాల గురించి, అణగారిన వర్గాల కోసం, మహిళా సాధికారత కోసం ఆమె చేసిన కృషి గురించి చెబుతుంది. ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్‌’లో విన్సీ అలోషియస్ సీనియర్ రాణి మరియా పాత్రను పోషించారు. ఇక హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఒకప్పటి హీరో రాజా మాట్లాడుతూ.. ఒకప్పుడు నటుడుగా ఈ ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చాను. ఇప్పుడు ఒక పాస్టర్‌గా వచ్చాను. క్షమాపణ అనేది అందరి వల్ల అయ్యేది కాదు. క్షమాపణ అనేది చాలా గొప్పది. రాణి మరియా త్యాగం గురించి ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా‌ను ప్రతీ ఒక్కరూ ప్రమోట్ చేయాలని కోరుతున్నాను. 123 అవార్డులు పొందిన సినిమా ఇది, అంతేకాదు, ఆస్కార్‌కు కూడా ఎంట్రీ వచ్చిన సినిమా. నవంబర్ 21న విడుదలయ్యే ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు.

Also Read- Mowgli Teaser: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వదిలిన ‘మోగ్లీ 2025’ టీజర్.. ఎలా ఉందంటే?

ఒకరిని క్షమిస్తేనే శాంతి

దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ సీఈఓ డాక్టర్ ఐ. లూర్దూ రాజ్ మాట్లాడుతూ.. క్షమాపణ అనేది గొప్పది. ఒకరిని క్షమిస్తేనే అక్కడే శాంతి ఉంటుంది. చాగంటి ప్రొడక్షన్స్ ఈ సినిమా విడుదలకు సపోర్ట్ చేస్తుంది. ప్రపంచాన్ని కదిలించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షలందరికీ నచ్చుతుంది. అందరు ఆదరించాలని, నవంబర్ 21న వస్తున్న ఈ సినిమాను థియేటర్లలో చూడాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, CSI బిషప్ విల్సన్, డైరెక్టర్ వంశీకృష్ణ, నటుడు జక్కుల కృష్ణ మోహన్ వంటి వారంతా పాల్గొని.. నవంబర్ 21న వస్తున్న తెలుగు వెర్షన్‌ను కూడా భారీ స్థాయిలో హిట్ చేయాలని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Chinese Manja: ‘చైనా మాంజా విక్రయాలను అరికట్టాలి’.. సీఐకి డివైఎఫ్ఐ వినతి

Beauty OTT: ‘బ్యూటీ’ ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడంటే?

Hydraa: దుర్గం చెరువు ఆక్ర‌మ‌ణ‌లకు హైడ్రా చెక్‌.. కబ్జా చెర నుంచి 5 ఎకరాలకు విముక్తి

Municipal Elections: పట్టణాల్లో ఎన్నికల వేడి.. ఆశావహుల్లో ఉత్కంఠ

New Year 2026 Wishes : మీ ప్రియమైన వారికీ న్యూ ఇయర్ విషెస్ ఇలా చెప్పేయండి!