Tollywood: సినీ పరిశ్రమలో కాంట్రవర్సీ అనేది సర్వసాధారణం. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (K. Raghavendra Rao), మెగా డాటర్ నిహారిక (Niharika Konidela)కు సంబంధించిన ఒక వీడియోపై జరుగుతున్న రాద్ధాంతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటో పూర్తిగా తెలియకుండానే, ఈ వీడియోను అడ్డం పెట్టుకుని కొందరు రాఘవేంద్రరావుపై, ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా విమర్శలు గుప్పిస్తున్నారు.
వీడియోలో నిజంగా ఏం జరిగింది?
వైరల్ అవుతున్న ఆ వీడియోను నిశితంగా పరిశీలిస్తే, అక్కడ అభ్యంతరకరమైనదేమీ కనిపించడం లేదు. రాఘవేంద్రరావు, నిహారికను ఆప్యాయంగా నడుముపై చేయి వేసి దగ్గరకు తీసుకున్నారు. నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో నిహారికకు, ఆయన కూర్చున్న కుర్చీ (Chair) కొద్దిగా ఇబ్బందిగా అనిపించినట్టుగా తెలుస్తోంది. వెంటనే ఆమె ఆయనను వదిలి వెనక్కి వచ్చారు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, వెనక్కి వచ్చిన తర్వాత కూడా నిహారిక ఆయనపై ఆప్యాయంగా చేతులు వేసి నవ్వుతూ మాట్లాడారు. నిజంగా ఆమె ఇబ్బంది పడి ఉంటే, ఆ వెంటనే మళ్లీ వెనక్కి వచ్చి అంత చనువుగా ఆయనతో మాట్లాడేవారు కాదు కదా అని కొందరు నెటిజన్లు వాదిస్తున్నారు.
ఆ కుటుంబంతో రాఘవేంద్రరావు అనుబంధం
రాఘవేంద్రరావుకు మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం గురించి తెలుగు సినీ లోకానికి బాగా తెలుసు. ఆయన చిరంజీవిని తన బాబాయ్‌గా పిలుస్తారు. నిహారిక వంటి మెగా ఫ్యామిలీ పిల్లలు ఆయన కళ్ల ముందు పెరిగిన వారే. ఈ నేపథ్యంలో, రాఘవేంద్రరావు నిహారికను ఒక కూతురులా లేదా మనవరాలిలా భావించి, ఆ చనువుతోనే ఆప్యాయంగా మాట్లాడి ఉంటారని మెగా అభిమానులు, సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.
Also Read- Mowgli Teaser: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వదిలిన ‘మోగ్లీ 2025’ టీజర్.. ఎలా ఉందంటే?
‘భూతద్దం’లో చూపించడంపై విమర్శలు
ఇండస్ట్రీలో అంతకంటే దారుణమైన ఘటనలు చాలా జరిగాయని, అప్పుడు మౌనంగా ఉన్నవారే ఇప్పుడు ఇలాంటి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపిస్తూ అనవసరమైన కాంట్రవర్సీ చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమా వాళ్లకు ఇలాంటి ఆప్యాయతలు, చనువు సహజమేనని, పనికిమాలిన ఊహలతో రాతలు రాయడం సరికాదని విమర్శకులను నెటిజన్లు దుయ్యబడుతున్నారు. మొత్తానికి, ఒక చిన్న ఆప్యాయతకు సంబంధించిన చర్యను దురుద్దేశంతో అపార్థం చేసుకుని, దాన్ని వివాదం చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరీ ముఖ్యంగా ఇలాంటి వాటి కోసమే కాచుకుని కూర్చున్న ఓ బ్యాచ్.. సోషల్ మీడియాలో చేస్తున్న అతికి అంతే లేదు. నిహారిక అని పేరు చెప్పకుండా, చిరంజీవి తమ్ముడు, పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు కూతురు అంటూ.. కావాలని ఆ ఫ్యామిలీపై రాతలు రాయడం చూస్తుంటే.. నిజంగా పవన్ కళ్యాణ్ వారికి ఎన్ని నిద్రలేని రాత్రులు పరిచయం చేసి ఉంటాడో అని.. అంతా అనుకుంటూ ఉండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
