Will The Dream Of 'char sau' Come True
Politics

BJP Target : శ్రీమంతులు, పారిశ్రామికవేత్తలే బీజేపీ టార్గెట్

BJP Wants Only The Rich And Industrialists : బెదిరించడం.. లొంగదీసుకోవడం.. కాషాయ కండువాలు కప్పడం. ఇది బీజేపీ వ్యూహం. ఆ పార్టీ ఏ రాష్ట్రంలోనైనా ఇదే ఫార్ములా అమలు చేస్తుందనే విమర్శలున్నాయి. లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలోనూ ఈ తంత్రాన్ని ప్రయోగించింది. రాష్ట్రంలో బీజేపీ బలం అంతంత మాత్రమే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా నియోజకవర్గాలకు అభ్యర్థులు కూడా దొరికని పరిస్థితి ఎదురైంది. చాలామంది బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. ఉత్తర తెలంగాణలోనే కాస్త ఓటర్ల ఆదరణ కనిపించింది. హైదరాబాద్‌లోనూ ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. ఎన్నికలకు ఏడాది ముందు అధికారమే లక్ష్యం అంటూ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో చాలాసార్లు పర్యటించారు. కానీ, పెద్ద ప్రభావం కనిపించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లతోనే సరిపెట్టుకుంది.

లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీకి అభ్యర్థులు కరవయ్యారు. అందుకే, ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. అభ్యర్థుల వేటను ప్రారంభించింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడింది. ఆ పార్టీకి రెండు లోక్ సభ స్థానాలు కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నేతలు వెనుకడుగు వేశారు. ఈ క్రమంలోనే కారు దిగిపోతున్నారు. ఇదే బీజేపీకి అవకాశంగా మారింది. బడా వ్యాపారాలున్న నేతలను టార్గెట్ చేసింది. కాషాయ కండువాలు కప్పుకోవాలని ఒత్తిడి పెంచినట్టు తెలుస్తోంది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్‌‌కు గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరిపోయారు. పెద్దపల్లి ఎంపీ రాములు అదే బాట పట్టారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు బీజేపీ గాలం వేసింది.

Read More: మేనిఫెస్టోలో రేవంత్ మార్క్

జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బడా పారిశ్రామికవేత్త. ఆయనకు వేల కోట్ల వ్యాపారులున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో లేదు. ఆయన వ్యాపారులు సజావుగా సాగాలంటే బీజేపీలో చేరడం ఒక్కటే మార్గం. లేదంటే ఈడీ, ఐటీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఆయన కంపెనీలపై దాడులు చేసే అవకాశం ఉంటుంది. అందుకే, బీబీ పాటిల్ కాషాయ కండువా కప్పేసుకున్నారు.వరంగల్ ఎంపీ స్థానంపై బీజేపీ గురిపెట్టినా అక్కడ సరైన అభ్యర్థి లేరు. అందుకే, అభ్యర్థి కోసం వేట ప్రారంభించింది. బీఆర్ఎస్ నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ను పార్టీలోకి తీసుకొచ్చింది. ఆయన ఆర్థికంగా బలంగా ఉన్నారు. అందుకే, ఆరూరి రమేష్‌పై కాషాయ పార్టీ కన్నుపడింది. ఎన్నో ట్విస్టుల మధ్య ఆరూరి రమేష్ బీజేపీలో చేరిపోయారు. ఇక వరంగల్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు. నాగర్ కర్నూల్‌లో బీజేపీకి అభ్యర్థి లేరు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములును పార్టీలోకి ఆహ్వానించింది.

మరోవైపు కాంగ్రెస్ గేట్లు ఎత్తేశామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ప్రజా సేవ చేయాలనుకునే నేతలు పార్టీలో రావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌లో ఇన్నాళ్లూ ఇమడలేకపోయిన నేతలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయకముందే, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కారు దిగిపోయారు. ఆయన 2019 లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లోకి వెళ్లారు. మళ్లీ ఇప్పుడు హస్తం గూటికి చేరారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ, తెలంగాణ ఉద్యమకారుడు పసునూరి దయాకర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చేశారు. ఆయన 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో దాదాపు 25 ఏళ్లు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా హస్తం గుర్తుపైనే గెలిచారు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దానం గెలుపొందారు. ఖైరతాబాద్‌లో మాస్ లీడర్‌గా గుర్తింపు పొందిన దానంకు జనంలో మంచి ఆదరణ ఉంది. నిత్యం ప్రజల్లో ఉండే నేతగా గుర్తింపు ఉంది. ఆయన రాజకీయ జీవితాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. అందుకే తిరిగి తల్లి లాంటి పార్టీ చెంతకు చేరారు. అదే సమయంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Read More: అమ్మపై బెంగ..! కోర్టుకు కవిత

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత , సినీ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జడ్పీ ఛైర్సన్ సునీతా, జీహీచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. వీరంతా ప్రజా నేతలుగా గుర్తింపు పొందిన వారే. ఇలా ఉద్యమ నాయకులు, ప్రజా నాయకులను కాంగ్రెస్ అక్కున చేర్చుకుంటోంది. ప్రజా పాలన అందిస్తామని సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో పనిచేసిన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నేతలకు కాంగ్రెస్ గేట్లు తెరిచి ఉంచుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే సూత్రాన్ని అమలు చేశారు. లోక్ సభ ఎన్నికల వేళ పార్టీ బలం మరింత పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, బీజేపీ మాత్రం ఆర్థికంగా బలంగా ఉన్నవారిని నయానో భయానో చేర్చుకుంటోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు