Anger On Mom..! A Poem That Appealed To The Court : కొద్దిరోజుల క్రితం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. కోర్టులో హాజరుపరచగా వారం రోజుల కస్టడీకి అనుమతి లభించింది. దీంతో అధికారులను ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో కుటుంబసభ్యులను కలిసేందుకు కవితకు అనుమతి ఉంది. వారం రోజులపాటు ప్రతీ రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కొందరితో ములాఖత్ అయ్యేందుకు పర్మిషన్ ఇచ్చింది న్యాయస్థానం. ఈక్రమంలోనే కేటీఆర్, హరీష్ రావు, న్యాయవాదులు ఈడీ విచారణ ముగిశాక రెండు రోజులు కలిశారు. అయితే, తల్లి, కుమారులపై బెంగ పెట్టుకున్న కవిత వారిని కూడా కలుసుకునేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరారు. దీంతో మొత్తం 8 మందిని కలిసేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. తొలిరోజు నలుగుర్ని, రెండో రోజు మిగిలిన నలుగుర్ని కలవొచ్చని తెలిపింది.
సుప్రీంలో పిటిషన్ విత్ డ్రా
సుప్రీంకోర్టులో గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను కవిత విత్ డ్రా చేసుకున్నారు. ఈడీ కవితను అరెస్టు చేసినందున ఆ పిటిషన్ నిరర్థకంగా మారిందని ఆమె తరఫు న్యాయవాదులు చెప్పారు. తదుపరి ఉన్న న్యాయపరమైన ప్రత్యామ్నాయాలు చూస్తున్నామన్నారు. ఈడీ తరఫు న్యాయవాది అందుబాటులో లేకపోవటంతో కోర్టు విచారణ వాయిదా పడింది. గతంలో ఈడీ జారీ చేసిన సమన్లు మహిళలను వారు నివసించే చోటే విచారించాలన్న సీఆర్పీసీలోని సెక్షన్ 160 నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నాయని, వాటిని కొట్టివేయాలని కవిత గతంలో దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు.
Read More: ఎమ్మెల్యే మల్లారెడ్డికి తప్పని తిప్పలు
గత ఏడాది సెప్టెంబరు 15న ఈ కేసును సుప్రీంకోర్టు విచారించింది. ఎమ్మెల్సీ కవితకు సమన్ల జారీని 10 రోజులు వాయిదా వేస్తామని ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది. సమన్లను నిరవధికంగా వాయిదా వేయడం సాధ్యం కాదని చెప్పింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ కేసును సెప్టెంబరు 26కి వాయిదా వేశారు. అయితే, కవిత తరఫు లాయర్ జోక్యం చేసుకుంటూ అంతవరకూ సమన్లను వాయిదా వేయాలని కోరారు. అందుకు ఈడీ తరఫు న్యాయవాది మౌఖికంగా అంగీకరించారు. కోర్టులో నాడు ఇచ్చిన ఆ హామీని ఉల్లంఘిస్తూ ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారంటూ దాన్ని సవాల్ చేస్తూ కవిత తరఫు లాయర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు సంస్థపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరారు.