Samantha: టాలీవుడ్ భామ, గ్లోబల్ స్టార్ సమంత (Samantha) తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ‘న్యూ చాప్టర్ బిగిన్స్’ (New Chapter Begins) అనే క్యాప్షన్.. అభిమానుల మధ్య, సినీ వర్గాలలో పెద్ద చర్చకు దారితీసింది. కొన్ని రోజులుగా ఆమె రెండో వివాహం చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు, గుసగుసలు జోరుగా వినిపిస్తున్న తరుణంలో, ఈ పోస్ట్ రావడంతో అందరూ దీనిని పెళ్లి ప్రకటనగానే భావించారు. కానీ, ఈ ప్రకటన వెనుక ఉన్న అసలు విషయం తెలిస్తే, సమంత ఫ్యాన్స్ మరింత గర్వపడతారు!
Also Read- Mowgli Teaser: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వదిలిన ‘మోగ్లీ 2025’ టీజర్.. ఎలా ఉందంటే?
సామ్ మల్టీ-టాలెంటెడ్ రోల్.. వ్యాపారంలో మరో అడుగు!
నటన, నిర్మాణం అనే రెండు రంగాల్లో విజయవంతంగా దూసుకుపోతున్న సమంత.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది. ఆమె ఇప్పటికే ‘ట్రాలాలా మోషన్ పిక్చర్స్’ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌజ్‌ను స్థాపించి, నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. వీటితో పాటు ఆమెకు ఫ్యాషన్ రంగంలోనూ అనుభవం ఉంది. ‘సాకి’ (Saaki) పేరుతో మహిళల కోసం ఫ్యాషన్ డిజైన్ బ్రాండ్‌ను విజయవంతంగా నడుపుతున్నారు. అంతేకాకుండా, సుగంధ ద్రవ్యాల వ్యాపారంలోకి అడుగుపెట్టి, ‘సీక్రెట్ ఆల్కెమిస్ట్’ (Secret Alchemist) అనే పర్ఫ్యూమ్స్ బిజినెస్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కొత్త బిజినెస్ వచ్చి చేరింది. తాజాగా సమంత.. ఒక ప్రముఖ క్లాతింగ్ బ్రాండ్‌కు సహ వ్యవస్థాపకురాలిగా (Co-Founder) మారినట్లు అధికారికంగా ప్రకటించింది. నటిగా, నిర్మాతగా, ఫ్యాషన్ ఐకాన్‌గా.. ఇలా ఒకేసారి పలు పాత్రలను సమర్థవంతంగా పోషిస్తున్న సమంతకు ఇది నిజంగానే ఒక కొత్త అధ్యాయం.
Also Read- Kaantha Controversy: ‘కాంత’.. ఎవరి తాత, నాన్నల కథ కాదు.. కాంట్రవర్సీపై రానా, దుల్కర్ క్లారిటీ!
మ్యారేజ్ కాదు.. మార్కెట్!
పెళ్లి గురించి పుకార్లు వస్తున్నప్పటికీ, సమంత మాత్రం తన పూర్తి దృష్టిని తన కెరీర్, బిజినెస్ లక్ష్యాలపైనే పెట్టినట్లుగా తాజా ప్రకటనతో అర్థమవుతోంది. కొన్నాళ్లు మ్యారేజ్ ఆలోచనలు పక్కన పెట్టి, ఇలా వ్యాపారంపై దృష్టి పెడితే.. తనపై వస్తున్న వార్తలేమైనా ఆగుతాయేమో అని సమంత ఏమైనా ప్లాన్ చేస్తుందా? నటనకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన ఆమె ఇటీవల మళ్లీ ముఖానికి రంగేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన సమయాన్ని, శక్తిని దేనిపై కేంద్రీకరిస్తున్నారో ఈ తాజా పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది సమంత. సామాజిక మాధ్యమాలలో వ్యక్తిగత జీవితం గురించి ఏ చిన్న పోస్ట్ పెట్టినా అది పెళ్లి వార్తగా మారిపోతున్న ఈ రోజుల్లో.. సమంత తన పోస్ట్‌కు సరైన, వ్యాపారపరమైన వివరణ ఇచ్చి.. ఊహాగానాలకు తెరదించారు. తనకున్న బ్రాండ్ ఇమేజ్ను, క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకుంటూ, సమంత ఇప్పుడు సినీ ప్రపంచంతో పాటు కార్పొరేట్ ప్రపంచంలోనూ పవర్ ఉమెన్‌గా ఎదుగుతున్నారు. ఈ కొత్త వెంచర్లో సమంత మరిన్ని విజయాలు సాధించాలని ఆమె అభిమానులు, ఫ్యాషన్ ప్రియులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
