Rolugunta Suri: విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న చిత్రం ‘రోలుగుంట సూరి’ (Rolugunta Suri). అనిల్ కుమార్ పల్లా (Anil Kumar Palla) దర్శకత్వంలో నాగార్జున పల్లా (Nagarjuna Palla), ఆధ్యారెడ్డి, భావన నీలప్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సౌమ్య చాందిని (Soumya Chandini) పల్లా నిర్మించారు. నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా హైదరాబాద్‌లో మేకర్స్ ఘనంగా నిర్వహించారు.
Also Read- Mowgli Teaser: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వదిలిన ‘మోగ్లీ 2025’ టీజర్.. ఎలా ఉందంటే?
వారి అభినందనలకు ధన్యవాదాలు
ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ కుమార్ పల్లా మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఈ సినిమా కథ తెలుసుకుని ఎన్నో ప్రశంసలు కురిపించారు. రియలిస్టిక్ విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో సినిమా మొత్తాన్ని అద్భుతంగా చేశారని అభినందించారు. ఆయన అభినందనలతో మా చిత్రయూనిట్‌కు కొత్త ఎనర్జీ వచ్చింది. చిత్ర సంగీతంపై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేసి, అభినందించారు. ఆయనకు కృతజ్ఞతలు. మా కృషిని, మా టీమ్ టాలెంట్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించడం ఎంతో సంతోషంగా ఉంది. ‘ఖుషి’ డైరెక్టర్ శివ నిర్వాణ మా సినిమా టీమ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని భరోసా ఇచ్చారు. ఇక మా హీరో నాగార్జున పల్లా అథ్లెటిక్స్‌లో నేషనల్ గోల్డ్ మేడలిస్ట్. సినిమా రంగంలో ఆయనకు మంచి భవిష్యత్ ఉంటుంది. ఈ సినిమాతో ఆయన టాలెంట్ నిరూపించుకుంటాడు. ఈ నెల 14న విడుదల అయ్యే ఈ సినిమాను థియేటర్‌కు వెళ్లి చూడాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
Also Read- Kaantha Controversy: ‘కాంత’.. ఎవరి తాత, నాన్నల కథ కాదు.. కాంట్రవర్సీపై రానా, దుల్కర్ క్లారిటీ!
రియలిస్టిక్ విలేజ్ డ్రామా
హీరో నాగార్జున పల్లా మాట్లాడుతూ.. ఇది నా ఫస్ట్ మూవీ. నేను స్పోర్ట్స్ ఫీల్డ్ నుంచి వచ్చాను. చాలా ఇష్టపడి ఈ సినిమా చేశాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, నాకు సపోర్ట్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు. ఇదే టీమ్‌తో త్వరలో మరో ప్రాజెక్టు చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ థియేటర్‌కు వచ్చి ఈ సినిమా చూసి బ్లేసింగ్స్ ఇవ్వండని కోరారు. నిర్మాత సౌమ్య చాందిని పల్లా మాట్లాడుతూ.. ‘రోలుగుంట సూరి’ ఒక రియలిస్టిక్ విలేజ్ డ్రామా. భావోద్వేగాలతో, జీవిత సత్యాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుందని భావిస్తున్నాను. చిత్రయూనిట్‌లోని ప్రతి సభ్యుడు ఎంతో టాలెంట్ ప్రదర్శించారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ ఈ సినిమా సక్సెస్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
