Agricultural Market: తొర్రూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పిచ్చి మొక్కలు విపరీతంగా మొలిచాయి. నిండా కలుపు మొక్కలతో కప్పుకుపోయి, అసలైన రైతు కష్టాన్ని ఎవ్వరూ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. వర్షాలు కురిసినప్పటి నుంచి యార్డ్ అంతా అడవి మొక్కలతో నిండిపోయాయి. రైతులు పంట వోడ్లు పోసుకునే స్థలమే లేక ఆందోళన చెందుతున్నారు. సీజన్ వచ్చింది. పంట కోసి వోడ్లు అరబెట్టాలంటే యార్డులో అడుగుపెట్టే చోటు లేదు, పిచ్చి మొక్కలు నిండిపోవడంతో మా పంట ఎక్కడ పెట్టాలో అర్ధం కావడం లేదనీ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Thorrur SC Boys Hostel: తొర్రూరు ఎస్సీ హాస్టల్‌లో వసతుల కొరత.. విద్యార్థుల అవస్థలు
వోడ్లు అరబెట్టడానికి స్థలం లేక పొలాలపక్కనే ధాన్యం
అధికారులు ఒక్కసారి వచ్చి చూసినా కూడా ఇంత దుస్థితి ఉండేది కాదు అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ పరిశుభ్రత, మౌలిక సదుపాయాల పరంగా పూర్తిగా నిర్లక్ష్యం చోటుచేసుకున్నదని రైతులు మండిపడుతున్నారు. వోడ్లు అరబెట్టడానికి స్థలం లేక పొలాలపక్కనే ధాన్యం ఆరబెడుతున్నామని, దీనివల్ల వర్షం వస్తే పంట నష్టం జరుగుతోందని చెబుతున్నారు. వ్యవసాయ మార్కెట్ రైతుల బతుకు దారమని, ఇక్కడి దుస్థితి పట్ల అధికారులు కళ్ళు మూసుకోవడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను గుర్తించి, మార్కెట్ యార్డ్‌లో తక్షణ చర్యలు తీసుకుని పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పంట వోడ్లు సులభంగా అరబెట్టే సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: Crime News: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. బస్సు ప్రమాదం మరువకముందే మరో బీభత్సం.. ఇంట్లోకి దూసుకుపోయిన..!
