Huzurabad ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Huzurabad: కాలేజీ ఒకచోట, పరీక్షలు ఇంకోచోట.. వాగ్దేవి కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థుల అయోమయం!

Huzurabad: షిఫ్టింగ్ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా కళాశాల భవనాలను మారుస్తూ విద్యార్థులను అయోమయానికి గురిచేస్తున్న హుజరాబాద్‌లోని వాగ్దేవి డిగ్రీ కళాశాల యాజమాన్యంపై విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ఒకచోట, పరీక్షా కేంద్రం మరోచోట ఏర్పాటు చేయడం శాతవాహన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. తక్షణమే కళాశాల అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చోద్యం చూస్తున్న యూనివర్సిటీ అధికారులు హుజరాబాద్ పట్టణంలోని సూపర్ బజార్‌లో అరకొర వసతులు, అనుమతులతో నడుస్తున్న వాగ్దేవి డిగ్రీ కళాశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు.

Also Read: Huzurabad: జాతీయస్థాయి కరాటే పోటీల్లో.. హుజూరాబాద్ విద్యార్థుల అద్భుత ప్రదర్శన!

విద్యార్థులను గందరగోళానికి గురిచేసింది

ప్రస్తుతం పరీక్షల సమయంలో ఎటువంటి షిఫ్టింగ్ అనుమతులు లేకుండా డీసీఎంఎస్ కాంప్లెక్స్‌లోని పాత జాగృతి కళాశాల భవనంలో పరీక్షలు నిర్వహించడానికి సిద్ధపడటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హుజరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ (AISB) తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్య కిరణ్ మరియు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేష్ మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం ఇప్పటికే పలుమార్లు భవనాలను మార్చి విద్యార్థులను గందరగోళానికి గురిచేసిందని తెలిపారు.

అనుమతులు రద్దు చేయాలి

పరీక్షల సమయంలో సెంటర్‌ను వేరే చోటికి మారిస్తే విద్యార్థులకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా శాతవాహన యూనివర్సిటీ అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం దేనికి నిదర్శనం అని మండిపడ్డారు. అనుమతులు రద్దు చేయాలని డిమాండ్. యూనివర్సిటీ అధికారులు ఈ పూర్తి విషయంపై తక్షణమే విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాగ్దేవి డిగ్రీ కళాశాల అనుమతులను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కళాశాల యాజమాన్యంపై మరియు శాతవాహన యూనివర్సిటీ అధికారులపై తగు చర్యలు తీసుకునేంతవరకు రాజీలేని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AISF జిల్లా సహాయ కార్యదర్శి కేశ బోయిన రాము యాదవ్, భరత్, నవీన్, సాయి, సందీప్, శ్రీధర్ పాల్గొన్నారు.

Also Read: Huzurabad News: బేడ బుడగ జంగాల కాలనీ అభివృద్ధికి వినతి పత్రం అందించిన నాయకులు

Just In

01

Jupally Krishna Rao: పర్యాటక ప్రదేశాలను దత్తత తీసుకోండి : మంత్రి జూపల్లి కృష్ణారావు

Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టు తప్పుడు నిర్ణయాలతోనే బ్యారేజీలు కూలాయి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

AV Ranganath: చెరువుల పూర్తి స్థాయి పునరుద్దరణే అసలైన పరిరక్షణ : హైడ్రా కమిషనర్ రంగనాధ్

SSMB29: ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఆమె పాత్ర పేరేంటో తెలుసా?

Agricultural Market: వ్యవసాయ మార్కెట్‌లో పిచ్చి మొక్కలు.. రైతుల వోడ్లకు స్థలమే లేక ఇబ్బందులు