Two Much With Kajol and Twinkle (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలి.. బాలీవుడ్ నటి కాజోల్ షాకింగ్ కామెంట్స్

Kajol: బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్ (Vicky Kaushal), కృతి సనన్ (Kriti Sanon) తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటులు ట్వింకిల్ ఖన్నా (Twinkle Khanna), కాజోల్ (Kajol) హోస్ట్ చేస్తున్న ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ (Two Much With Kajol and Twinkle) అనే టాక్ షోకి అతిథులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్‌లో హోస్ట్, గెస్ట్‌ల మధ్య జరిగిన సరదా సంభాషణలు, కొన్ని వివాదాస్పద కామెంట్లు ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా అజయ్ దేవగణ్ (Ajay Devgn) భార్య కాజోల్ పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షించాయి.

పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్

ఈ షోలోని ‘దిస్ ఆర్ దట్’ అనే సెగ్మెంట్‌లో ట్వింకిల్ ఖన్నా ఒక ప్రశ్నను సంధించింది. అదేంటంటే.. ‘పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్, దానిని రెన్యూవల్ చేసుకునే ఆప్షన్ ఉండాలా?’ అని. ఈ ప్రశ్నకు విక్కీ, కృతి, ట్వింకిల్ అంగీకరించక ‘రెడ్ జోన్’లో నిలబడగా, కాజోల్ మాత్రం అంగీకరిస్తూ ‘గ్రీన్ జోన్’ వైపు వెళ్లింది. ‘పెళ్లి ఏమైనా వాషింగ్ మెషీనా.. ఎక్స్‌పైరీ డేట్ ఉండటానికి’ అంటూ కాజోల్ వాదనను ట్వింకిల్ వ్యతిరేకించింది. దానికి కాజోల్ బదులిస్తూ.. ‘‘నేను కచ్చితంగా ఉండాలనే అనుకుంటున్నాను. సరైన సమయంలో సరైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటామని ఎవరు మాత్రం గ్యారంటీ ఇవ్వగలరు? కాబట్టి, రెన్యూవల్ ఆప్షన్ ఉండాలి. ఒకవేళ ఎక్స్‌పైరీ డేట్ ఉంటే, మనం ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం ఉండదు కదా’’ అని తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టింది. ఈ విషయంలో ట్వింకిల్‌ను కూడా గ్రీన్‌ జోన్‌లోకి రావాలని కాజోల్ వాదించింది. కాజోల్ మాటలు విని కృతి సనన్ సరదాగా స్పందించింది. ‘‘నిజంగా ఈ ఆప్షన్‌ ఓకే అయితే.. ఆమె ఇళ్లంతా బంగారమే’’ అని కృతి చమత్కరించింది.

Also Read- Prasanth Varma: ‘జై హనుమాన్’ డౌటేనా? ప్రశాంత్ వర్మ ఇలా ఇరుక్కున్నాడేంటి?

డబ్బుతో ఆనందాన్ని కొనొచ్చా?

‘పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్, దానిని రెన్యూవల్ చేసుకునే ఆప్షన్ ఉండాలా?’ ప్రశ్న అనంతరం ఈ సెగ్మెంట్‌లో.. ‘డబ్బుతో ఆనందాన్ని కొనొచ్చా?’ అనే ప్రశ్న ఎదురైంది. ఈ సెగ్మెంట్‌లో ట్వింకిల్ ఖన్నా, విక్కీ కౌశల్ వెంటనే అంగీకరించి గ్రీన్ జోన్‌లోకి వెళ్లారు. కానీ, కాజోల్ మాత్రం ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించి రెడ్ జోన్‌లో నిలబడింది. ‘‘ఎంత డబ్బు ఉన్నా, అది ఆనందాన్ని ఇవ్వదని నేను భావిస్తున్నాను. కొన్నిసార్లు, డబ్బు ఆనందానికి అడ్డంకిగా కూడా మారుతుంది. అది మిమ్మల్ని నిజమైన ఆనందం నుండి దూరం చేస్తుంది’’ అని కాజోల్ చెప్పుకొచ్చింది. ఇక కృతి సనస్ కొద్దిసేపు ఆలోచించిన తర్వాత.. డబ్బు కొన్ని సందర్భాలలో ఆనందాన్ని ఇవ్వగలదని అంగీకరించింది.

Also Read- Faria Abdullah: అందాలను ఆరబోసినా.. ఈ పొడుగు కాళ్ల సుందరిని ఎవరూ పట్టించుకోవడం లేదా?

ట్వింకిల్, కాజోల్‌కు ఒకే ఎక్స్..

ఈ సెగ్మెంట్‌లో మరో ఆసక్తికరమైన అంశంపై కూడా చర్చ నడిచింది. ‘బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరి ఎక్స్-పార్టనర్లతో మరొకరు డేటింగ్ చేయకూడదు’ అనే స్టేట్‌మెంట్‌కు ట్వింకిల్, కాజోల్ అంగీకరిస్తూ గ్రీన్ బాక్స్‌లో నిలబడ్డారు. అక్కడ నిలబడిన ట్వింకిల్, కాజోల్ భుజంపై చెయ్యి వేసి, ‘‘మా ఇద్దరికీ ఒకే ఎక్స్-బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు, కానీ మేమిద్దరం చెప్పలేం’’ అంటూ రహస్యాన్ని లీక్ చేసింది. దీంతో అవాక్కయిన కాజోల్ వెంటనే ట్వింకిల్‌ను ‘నోరు మూయ్ (shut up)’ అని చెప్పి, ఆ రహస్యం మరింత బయటకు రాకుండా అడ్డుకుంది. మొత్తానికి, విక్కీ కౌశల్, కృతి సనన్ ఎపిసోడ్ ఎన్నో ఫన్నీ, సీరియస్ చర్చలతో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ కూడా బయటపెట్టి, ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిందనే చెప్పాలి. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Huzurabad: కాలేజీ ఒకచోట, పరీక్షలు ఇంకోచోట.. వాగ్దేవి కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థుల అయోమయం!

Kunamneni Sambasiva Rao: సిపిఐ శతాబ్ది ఉత్సవాలు వంద సంవత్సరాలు గుర్తుండేలా నిర్వహించాలి : ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు

Bigg Boss Telugu 9: కింగ్, క్వీన్స్.. నన్ను తొక్కి నువ్వు లేవకు.. దివ్యపై రీతూ ఫైర్!

Jupally Krishna Rao: మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి : మంత్రి జూపల్లి కృష్ణారావు

Telangana Police: డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై పోలీసు సంఘం సీరియస్