Bachupally Land Scam (imagecredit:swetcha)
సూపర్ ఎక్స్‌క్లూజివ్, హైదరాబాద్

Bachupally Land Scam: బాచుపల్లి భూముల్లో ఏక్కోలేక పీక్కోలేక మైరాన్ తిప్పలు


Bachupally Land Scam: బాచుపల్లిలో బడా భూస్కాం లీలలు అన్నీ ఇన్నీ కావు. తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. నిషేదిత భూములపై సీసీఎల్ఏ క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేసింది. అందుకు సర్వే నెంబర్ 83 లోని ఆర్వోఆర్ ఫైల్‌కు గత నెల 22న ఆర్డర్ ఇచ్చింది. దీంతో 100 ఎకరాల్లో ఉండే ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న ఓన‌ర్స్‌కు ఆశలు చిగురించాయి. సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ ఇచ్చిన తీర్పు అయినా నిలబడుతుందా? గత 30 ఏండ్లుగా పహాణీలు, 1బీ రికార్డ్స్ సరిగ్గా చూసే ఇచ్చారా? అనేక విషయాలను పట్టించుకోకుండా ఇచ్చిన తీర్పుపై ప్రీ లాంచ్‌లో కొనుగోలు చేసిన ఓనర్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్(MRO) మూడో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 22 రోజుల్లోనే సీసీఎల్ఏలో ఫైనల్ ఆర్డర్ రావడంతో మైరాన్ ప్లాట్ ఓనర్స్‌కు ప్రాణం వచ్చినట్లు అయింది. ఈ భూములను కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు టైటిల్ క్లియర్ చేసుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తున్న. సీలింగ్ ఫైల్ మిస్సింగ్‌ వ్యవహారంపై ‘స్వేచ్ఛ’ ఇప్పటికే కథనాన్ని ప్రచురించింది. ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికీ ఆ ఫైల్ ఆర్డీవో ఆఫీస్‌లో ఇంకా దొరకనే లేదు.

6 నెలల హైడ్రామాకు తెర పడినట్టేనా?

ప్రభుత్వానికి సరెండర్ చేసిన సీలింగ్ భూమిలో ఓనర్ దగ్గర నుంచి సాదాబైనామాలు పుట్టుకొచ్చాయి. పొజిషన్ మాత్రం పట్టా భూమిలో చూపించడంతో వివాదం మొదలైంది. ఈ భూమిపై మైరాన్ రియల్ ఎస్టేట్ సంస్థ అనుమతులకు అప్లై చేసుకుని రూ.150 కోట్ల మేర ప్రీ లాంచ్‌లో వసూలు చేసి అమ్మేసినట్టు సమాచారం. గత 6 నెలలుగా వివాదం వివిధ కోర్టులకు చేరింది. సీసీఎల్ఏలో 30 ఏండ్లుగా రెవెన్యూ రికార్డుల్లో లేని పట్టాదారుడికి, అప్పటికే అమ్ముకున్న భూమిని నేషనల్ ఖాతా ఉందని పట్టాగా మార్చాలని పెట్టుకున్న అప్లికేషన్‌కు క్లియర్ ఆర్డర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ తిరస్కరించిన తీర్పులపై సీసీఎల్ఏ ఇచ్చిన ఉత్తర్వులు ఏదో మతలబు నడిచినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కంట్యూనియస్ రికార్డుల్లో ఉన్నారని ఇచ్చిన తీర్పు, అన్ రిజిస్టర్ ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్‌తో ఓనర్‌షిప్ ఇవ్వడానికి అభ్యంతరాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇకనైనా ఈ డ్రామాలకు తెరపడుతుందా, ఇంకా కొనసాగుతాయా అనేది చూడాలి.


మైరాన్‌కు మదర్ డాక్యుమెంట్‌తో తిప్పలు

మైరాన్ రియల్ ఎస్టేట్ సంస్థ బాచుపల్లిలో 5 ఎకరాల్లో బడా అపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది. ఇందులో 2.30 గుంటలు సర్వే నెంబర్ 83లో కొనుగోలు చేసినట్లు అనుమతులకు అప్లై చేసిన డాక్యుమెంట్‌లో ఉన్నది. వాటి మదర్ డాక్యుమెంట్ ఓనర్ కోడూరు వెంకటరామయ్య సీలింగ్‌కు సరెండర్ చేసిన రికార్డులు ఉన్నాయి. దీంతో మైరాన్‌కు టైటిల్ లేకుండా పోయింది. 5.25 గుంటలు కోడూరు వెంకటరామయ్య సీలింగ్‌గా ప్రకటించారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేక పోయేసరికి ఆయన వద్ద నుంచి ప్రభుత్వ భూమి సాదాబైనామాతో అన్ రిజిస్టర్ డాక్యుమెంట్లు‌గా ఉన్నది. 1996లో ఖయ్యూం, రాము, అంజనేయులు, చంద్రకళకు ఇది చేరింది. తర్వాత అమృత గౌడ్ నుంచి బగ్గా వైన్స్ , ఆ తర్వాత కాంక్రీట్ అనిల్ రెడ్డి అక్కడ నుంచి మైరాన్‌ చేతికి చిక్కింది. సీలింగ్‌లో ప్రభుత్వానికి చేరిన ఓనర్స్‌తో తీసుకోవడం అనుమతులు అప్లై చేయడం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.

Also Read: Swetcha Effect: గద్వాల్లో అక్రమ ఇసుక తయారీదారులపై కేసు నమోదు

బౌండరీల మాయ?

83 సర్వే నెంబర్‌లోని మిగతా ఓనర్స్ వేములపల్లి కృష్ణమూర్తి, నిమ్మగడ్డ రామనాథం. 1664లోని సేల్ డీడ్‌లోని బౌండరీల ప్రకారం ఇప్పుడు లేకపోవడంతో ఇష్టానుసారంగా భూములను రాయించుకుంటున్నారు. వేములపల్లి కృష్ణమూర్తి 6.35 గుంటల భూమికి గాను ట్రిడెంట్ అర్గానిక్స్ (రెడ్డి ల్యాబ్స్) కి 4.12 గుంటల భూమిని అమ్మకం జరిపారు. మరో 28 గుంటల భూమి బాపయ్య చౌదరికి విక్రయించారు. మరో 1.30 గుంటల భూమిని అన్ రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా 1990లో కృష్ణారెడ్డి అనే వ్యక్తికి అమ్మారు. దీన్ని 2006లో (ఫైల్ నెంబర్ 5592/ఈ/2006) వాల్యుయేషన్ చేయించుకున్నారు. 6.35 గుంటల్లో కృష్ణమూర్తి బౌండరీల ప్రకారం సుమారు 2.10 గుంటలు 200 ఫీట్ల ఇన్నర్ రింగ్ రోడ్డుకు వెళ్లినట్టు తెలుస్తున్నది. అయితే, అప్పటికే సీలింగ్ ల్యాండ్‌ను కొనుగోలు చేసిన మైరాన్, ఇప్పుడు మళ్లీ సీసీఎల్ఏలో మేనేజ్ చేసి 1984లో ఫ్యామిలీ సెటిల్మెంట్‌లో వచ్చిన భూమి అని చెప్పుకుంటున్న సురేంద్ర ప్రసాద్ నుంచి పాస్ బుక్‌లు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నది. లోసుగులు చాలా ఉండడంతో మైరాన్‌కు మళ్లీ టైటిల్ కష్టాలు రాక మానవని ప్లాట్ ఓనర్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అగ్రిమెంట్ల దందాలు?

బాచుపల్లిలో 1964లో కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి అగ్రిమెంట్లు చేసుకుని గత 5 ఏండ్లుగా దందాలు కొనసాగిస్తున్నారు. మొత్తం 100 ఎకరాలకు పైగా గతంలో అన్ రిజిస్టర్‌తో బాచుపల్లిలో ఓ కుటుంబం రియల్టర్స్‌ను మోసం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అగ్రిమెంట్ల పేరుతో టైటిల్ అంటూ మరికొందరు మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. వేములపల్లి సురేంద్ర ప్రసాద్‌ ఫ్యామిలీకి సెటిల్మెంట్ల డీడ్ ఉందని అగ్రిమెంట్లు చేసుకున్నారు. సర్వే నెంబర్ 478లోని మమత మెడికల్ కాలేజీ స్థలం, సర్వే నెంబర్ 83లో ఉన్న భూమిలోని లిటిగేషన్‌ను క్యాచ్ చేసుకోవడానికి శ్రీనివాస్ రెడ్డి, రాజు, లక్ష్మారెడ్డిలు మొదట అగ్రిమెంట్స్ చేసుకున్నారు. వీళ్లే 2025 ఏప్రిల్ 4న సీసీఎల్ఏలో అప్లికేషన్ పెట్టించినట్లు సమాచారం. దీని తర్వాతనే మైరాన్ కు చెందిన వాళ్లు తహసీల్దార్‌కు ఆర్డీవో, కలెక్టర్‌కు అప్లికేషన్ పెట్టుకున్నారు. దీన్నే మరోసారి విచారణ జరిపినట్లు కలరింగ్ ఇచ్చినా నేరుగా సురేంద్ర ప్రసాద్ నుంచి మైరాన్ సంప్రదించి ఫైల్ ఫైనల్ ఆర్డర్ తెప్పించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పటికే సురేంద్ర ప్రసాద్ ఐదుగురికి అగ్రిమెంట్లు చేసినట్లు తెలుస్తున్నది. 83 సర్వే నెంబర్‌లో మరో 2.38 గుంటల ఓనర్ నిమ్మగడ్డ రామనాథం కుటుంబం నుంచి మరికొందరు అగ్రిమెంట్లు చేసుకోవడంతో ఈ భూముల్లో బడా వివాదాలకు కారణమైంది. ఎవరికి భూమి ఉంది. ఎవరు రికార్డుల్లో ఉన్నారు. సీలింగ్ ఫైల్ ఏలా మిస్ అయిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. రెవెన్యూ రికార్డులకు సరైన టైటిల్‌ను పట్టించుకోకుండా ఇచ్చే తీర్పులతో సమస్యలు మరింత జటిలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇదే అదునుగా సూరారంకి చెందిన మధ్యవర్తులతో అధికారులకు కోట్లలో చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. లంచాల మత్తులో రెవెన్యూ అధికారులు ఉండడంతో అటు సీలింగ్ ల్యాండ్ ఇటు సర్వే నెంబర్ 82, 84 లోని ప్రభుత్వ భూమిని కాపాడడంలో విఫలం అవుతున్నారు. పక్క సర్వే నెంబర్‌తో కబ్జాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మొత్తానికి కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు టైటిల్ కోసం దారులు వెతుక్కుంటుంటే, అధికారులకు, మధ్యవర్తులకు మూడు పువ్వులు ఆరు కాయల్లా ముడుపులు అందుతున్నట్టు సమాచారం.

Also Read: Supreme Court: ఢిల్లీ పేలుడు నేపథ్యంలో.. ఓ కేసు విచారణలో సుప్రీంకోర్టు స్పష్టమైన సందేశం

Just In

01

Chiranjeevi in Spirit: ‘స్పిరిట్’లో మెగాస్టార్ కామియోపై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి.. కానీ చిరుతో..

Vakiti Srihari: మత్స్య కారుల అభివృద్ధికి కృషి.. రూ.123 కోట్ల బడ్జెట్ కేటాయించాం.. మంత్రి వాకిటి శ్రీహరి

Tollywood movie budget: టాలీవుడ్ సినిమాలకు ప్రస్తుతం బడ్జెట్ పెరుగుతూ వస్తుంది.. దీనికి కారణం ఏంటంటే?

Al Falah University: ఉగ్రవాదులకు అడ్డా అంటూ ఆరోపణలు.. స్పందించిన అల్‌-ఫలాహ్‌ యూనివర్శిటీ

Movie budget: సినిమాలకు పెట్టిన బడ్జెట్ నిజంగా అంత అవుతుందా.. ఎందుకు అలా చెప్తారు?