BRS Complaint: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిబంధనలకు విరుద్ధంగా నాన్ లోకల్ కాంగ్రెస్ నేతలు తిష్ట వేసి ఓటర్లను ప్రభావితం చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి మంగళవారం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, రాంచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌లు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లను ప్రలోభ పెట్టిన సాక్ష్యాలను సీఈఓకు అందజేసి చర్యలు తీసుకోవాలని కోరారు. సీఈఓను కలిసిన బృందంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, టీజీఎస్‌పీఎస్‌సీ మాజీ సభ్యురాలు సుమిత్ర, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ మైనారిటీ నేతలు అర్షద్ అలీ ఖాన్, ఆజం అలీ తదితరులు ఉన్నారు.
Also Read: Swetcha Effect: గద్వాల్లో అక్రమ ఇసుక తయారీదారులపై కేసు నమోదు
కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలి
ఉప ఎన్నికల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కాంగ్రెస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూదిమెట్ల బాలరాజు యాదవ్ కోరారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమీషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, ఉపేంద్రా చారి, నాయకులు శ్రీనివాస్, జక్కుల లక్ష్మణ్, నిరోష ఉన్నారు.
Also Read: 12A Railway Colony: అల్లరి నరేష్ ‘12A రైల్వే కాలనీ’ ట్రైలర్ వచ్చేసింది..
