Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ తర్వాత పలు ప్రైవేట్ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను రిలీజ్ చేశాయి. ఇందులో అత్యధిక సంస్థలు కాంగ్రెస్ కే లీడ్ ను ఇచ్చాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్య పోటీని చూపించిన సర్వే సంస్థలు..చాలా తక్కువ లీడ్ లో కాంగ్రెస్(Congress) గెలిచే ఛాన్స్ ఉన్నట్లు తమ అంచనాలు రిలీజ్ చేశాయి. ఒకటి రెండు సంస్థలు మాత్రం బీఆర్ఎస్(BRS) కూడా లీడ్ ఇచ్చాయి. అయితే ఈ సర్వేలన్నీ అంచనాలు మాత్రమేని, కచ్చితమైన ఫలితాలు ఈ నెల 14 న తేలుతాయని ఈ రెండు పార్టీల లీడర్లు చెబుతున్నారు. అన్ని సంస్థలు తమ స్టడీని రిలీజ్ చేస్తూ ప్లస్ ఆర్ మైనస్ 2 శాతాన్ని కోడ్ చేశాయి. సహజంగానే ఆక్యురేట్ గా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయలేమనే ఇండికేషన్ ను సంస్థలు మెయింటెన్ చేయడం గమనార్హం. ఈ సర్వే సంస్థల్లో కొన్ని మధ్యాహ్నం 3.30 తర్వాత పోలింగ్ శాతం నుంచి అంచనాలు వేయగా, మరి కొన్ని సంస్థలు సాయంత్రం 4. నుంచి రాత్రి 6 గంటల వరకు జరిగిన పోలింగ్ సరళిని బట్టి అంచనాలు వేసినట్లు తెలుస్తుంది. అయితే ఎవరికి వారు మాత్రం తమ అభ్యర్థి గెలుస్తారనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.
పోస్టు చేస్తూ శుభాకాంక్షలు..
ఓవరల్ గా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచే అవకాశం అత్యధిక శాతం ఉన్నట్లు స్పష్టమవుతుంది. దీంతో ఆ పార్టీ సోషల్ మీడియాతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ ముందుగానే కొన్ని ప్రాంతాల్లో సెలబ్రేషన్స్ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు పోలింగ్ ముగిసిన తర్వాత ఆయా ఇళ్ల వద్ద సంబురాలు నిర్వహించారు. అసెంబ్లీలో అడుగు పెడుతున్న నవీన్ యాదవ్(Naveen Yadav) కు కంగ్రాట్స్ అంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో పోస్టులు పెడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ను పోస్టు చేస్తూ శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఈ నెల 14న ఎగ్జాట్ పోల్స్ గా మారితే నవీన్ యాదవ్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని టీపీసీసీ నేతలు బలంగా నమ్ముతున్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ కు మరో ఎమ్మెల్యే పెరగనున్నారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి గెలవగా, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లోనూ హస్తం పార్టీ క్యాండిడేట్ విజయం సాధించి పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచనున్నారు.దీంతో లోకల్ బాడీతో పాటు ఇతర బై సెగ్మెంట్లలో బై ఎలక్షన్లు వచ్చినా..కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందే సంకేతాన్ని సృష్టించినట్లవుతుంది.
పకడ్బందీగా వ్యూహాం…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా వ్యూహం అనుసరించిందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ల సలహాలు, సూచనలను పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు స్పష్టంగా అమలు చేశారు. మంత్రులను డివిజన్ల వారీగా ఇంచార్జ్ లను వేసి ఎమ్మెల్యేలు(MLAs)), ఎంపీలు(MP), ఎమ్మెల్సీలు, చైర్మన్ లు నాయకులను ప్రచార కార్యక్రమాలలో నిమగ్నం చేయడంలో పార్టీ సక్సెస్ అయింది.దీంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు షో లు, మంత్రులు, నాయకుల ఇంటింటి ప్రచారాలు, ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ ఎన్నికల వ్యూహాలతో ముందుకు సాగడంతో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విజయవంతం అయ్యారు.అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, క్షేత్ర స్థాయి లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి అందరిని సమన్వయం చేస్తూ గత నెల రోజులుగా పకడ్బందీగా ఎన్నికల ప్రణాళికలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ సఫలం అయింది.దీంతో పాటు మైనార్టీ ఓటు బ్యాంక్ ను స్వాధీనం చేసుకునేందుకు ఎంఐఎం మద్ధతుతో పాటు అజారుద్దీన కు మంత్రి పదవి ఇవ్వడం కూడా కలిసి వచ్చిందని పార్టీ నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఇలా( పర్సంటేజ్ లో)…
సంస్థ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ
బిగ్ టీవీ 48.9 44.2 3.8
పబ్లిక్ పల్స్ 48.5 41.8 6.5
నాగన్నసర్వే 47.84 41.4 8.7
పీసీఎస్ సర్వే 47 39 12
పల్స్ టుడే 47 44 7
చాణిక్యస్ట్రాటజీ 46 43 6
జన్మైన్ సర్వే 42.5 41.5 11.5
ప్రివెర్ మీడియా 47.41 43.13 7.9
స్మార్ట్ పోల్ 48.2 42.1 7.6
ఆరా మస్తాన్ 47.49 39.25 3.95
Also Read: Prabhas: ప్రభాస్‌కు ఎందుకు అంత క్రేజ్.. పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి రీజన్ ఇదే..
బీఆర్ ఎస్ అనుకూలంగా ఇచ్చిన సంస్థలు
సంస్థ బీఆర్ ఎస్ కాంగ్రెస్ బీజేపీ
మిషన్ చాణక్య 41.60 39.43 18.97
నేషనల్ ఫ్యామిలీ ఓపీనియ న్ 44.49 39.24 10.93
