CM Revanth Reddy Mark in Manifesto
Politics

Manifesto : మేనిఫెస్టోలో రేవంత్ మార్క్

CM Revanth Reddy Mark in Manifesto : ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో తెలంగాణలో ఆరు గ్యారెంటీల హామీలిచ్చింది కాంగ్రెస్. వంద రోజుల్లోనే వీటిని అమలు చేసి చూపించింది. అయితే, ఇదే రేవంత్ మార్క్ హామీలు సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ రూపొందించినట్టు కనిపిస్తోంది. మంగళవారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో గెలుపు వ్యూహాలను సిద్ధం చేశారు హస్తం నేతలు. దాదాపు 3 గంటలపాటు లోక్‌ సభ ఎన్నికల మేనిఫెస్టోకు తుది రూపుపై చర్చించారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఇంకా ఇతర నేతలు పాల్గొన్నారు. రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా భాగిదారీ న్యాయ్‌, కిసాన్‌ న్యాయ్‌, నారీ న్యాయ్‌, శ్రామిక్‌ న్యాయ్‌, యువ న్యాయ్‌ పేరిట ఇప్పటికే తన హామీలను ప్రజల ముందుంచిన కాంగ్రెస్‌ వాటిపై నేతలకు మార్గనిర్దేశం చేసింది.

Read More: అమ్మపై బెంగ..! కోర్టుకు కవిత

పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతులకు వడ్డీలేని రుణాలు, ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న సాయం పెంపు వంటి అంశాలు మేనిఫెస్టోలో పొందుపరిచింది. యువత కోసం 30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి డిప్లొమా, డిగ్రీ హోల్డర్‌కు అప్రెంటిస్‌ షిప్‌ శిక్షణకు లక్ష రూపాయల సాయం వంటి హామీలు ఉండే అవకాశం ఉంది. 30 ఏళ్ల లోపు యువత స్టార్టప్‌లకు నిధులు సమకూర్చడానికి 5వేల కోట్ల రూపాయల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు, పేపర్‌ లీకేజీల నివారణకు ప్రత్యేక చట్టం చేయాలని మేనిఫెస్టో, మహిళల కోసం నిరుపేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయల సాయం వంటి 25 హామీలపై చర్చించి మేనిఫెస్టో రూపొందించేందుకు నిర్ణయం తీసుకోనుంది.

అయితే, మేనిఫెస్టో విడుదల మాత్రం తర్వాతే ఉటుందని పార్గీ వర్గాలు చెబుతున్నాయి. ఇటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన కేంద్ర ఎన్నికల కమిటీ మళ్లీ సమావేశం అయింది. ఇప్పటికే రెండు విడతలుగా 82 మంది పేర్లను ప్రకటించింది కాంగ్రెస్. మిగిలిన అభ్యర్థుల లిస్టులను కూడా తర్వితగతిన విడుదల చేయాలని చూస్తోంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!