Chikiri Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట ‘చికిరి చికిరి’ సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా, సినీ ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంటోంది. తాజాగా, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ పాటపై తనదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపించారు.
Read also-Prasanth Varma: ‘జై హనుమాన్’ డౌటేనా? ప్రశాంత్ వర్మ ఇలా ఇరుక్కున్నాడేంటి?
ఆర్‌జీవీ ప్రశంసలు
ఆర్‌జీవీ తన సోషల్ మీడియా వేదికగా ఈ పాటను వీక్షించిన తర్వాత తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆయన ఇలా చెప్పుకొచ్చారు.. “చాలా కాలం తర్వాత నేను రామ్ చరణ్‌ను అతని అత్యంత సహజమైన, రా (Raw), ఎక్స్‌ప్లోసివ్ ఫార్మ్‌లో చూశాను. ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాటలో చరణ్ అద్భుతంగా కనిపించాడు” అని పేర్కొన్నారు. అంతేకాకుండా, దర్శకుడు బుచ్చిబాబు సానా పనితీరును అభినందిస్తూ, “ఒక స్టార్ నిజంగా మెరిసేది అతని మీద అడ్డుపడని సహజత్వం ఉన్నప్పుడు మాత్రమే. నువ్వు ఫోకస్‌ను సరైన చోట పెట్టావు అది హీరోపైనే” అంటూ బుచ్చిబాబు సానాను కొనియాడారు. స్టార్ హీరో ఇమేజ్‌ను, అతనిలోని సహజత్వాన్ని సరిగ్గా చూపించడంలో బుచ్చిబాబు విజయం సాధించారని ఆర్‌జీవీ తన ప్రశంసల ద్వారా తెలియజేశారు.
బుచ్చిబాబు స్పందన
రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ప్రత్యేకమైన ప్రశంసలపై ‘పెద్ది’ దర్శకుడు బుచ్చిబాబు సానా వెంటనే స్పందించారు. ఆర్‌జీవీ మాటలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. బుచ్చిబాబు తన రిప్లైలో ఇలా రాసుకొచ్చారు.. “మీ మధురమైన మాటలకు హృదయపూర్వక ధన్యవాదాలు ఆర్‌జీవీ సర్. నేను ఎప్పుడూ నమ్మేది ఒక్కటే, పెద్ద సినిమాల్లో డైరెక్టర్‌కి కొన్ని క్షణాలు దక్కొచ్చు, కానీ స్టార్ మాత్రం ఎప్పుడూ తన అత్యంత ప్రకాశంలో మెరవాలి. మీరు అదే విషయాన్ని చెప్పడం నాకు ఎంతో అర్థవంతంగా ఉంది సర్.”
Read also-King Nagarjuna: అఖిల్, చైతూలకు ‘శివ’ సీక్వెల్ చేసేంత ఘట్స్ లేవ్..
బుచ్చిబాబు చేసిన ఈ రిప్లై, స్టార్ హీరోతో సినిమా చేసేటప్పుడు దర్శకుడిగా ఆయనకున్న ఆలోచనా విధానాన్ని, హీరో పాత్రకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేసింది. సినిమా కథలో దర్శకుడి విజయం కొన్ని సన్నివేశాలకే పరిమితమైనా, స్టార్ హీరో ప్రకాశవంతంగా కనిపించడం ముఖ్యమని ఆయన నమ్మారు. ఆర్‌జీవీ సైతం అదే విషయాన్ని ప్రస్తావించడం తనకు ఎంతో సంతోషాన్ని, అర్థవంతమైన అనుభూతిని ఇచ్చిందని బుచ్చిబాబు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ ‘పెద్ది’ అనే పాత్రలో నటిస్తుండగా, జాన్వీ కపూర్ కథానాయిక. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆర్‌జీవీ, బుచ్చిబాబుల మధ్య జరిగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి, ‘చికిరి చికిరి’ పాటకు మరింత హైప్‌ను తీసుకొచ్చింది.
The true purpose of every craft in cinema, be it direction, music, cinematography etc should be only to elevate the HERO.
After a long time, I saw @AlwaysRamCharan in his most raw, real, and explosive form in the #peddi song Chikiri Chikiri
Hey @BuchiBabuSena kudos to you for…— Ram Gopal Varma (@RGVzoomin) November 11, 2025
