Delhi Car Blast: దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద పార్క్ చేసి ఉన్న కారు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో పక్కనే ఉన్న ఐదు కార్లు కూడా పూర్తిగా దగ్దమయ్యాయి. ప్రమాద అనంతరం పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో స్థానికులు తలో దిక్కు పరిగెత్తారు. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా 15 మంది గాయపడ్డారు. నాలుగు రోజుల్లో నలుగురు టెర్రర్ డాక్టర్లను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ బ్లాస్ట్ చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా జరిగిన పేలుడుకి, ఉగ్రవాదుల అరెస్టుకు మధ్య సంబంధం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వరుసగా పేలిన కార్లు..
ఎర్రకోట మెట్రో స్టేషన్ గేటు -1 దగ్గర ఈ కారు బ్లాస్ట్ చోటుచేసుకుంది. మెుదటి కారు పేలిన తర్వాత పక్కనే ఉన్న మిగతా కార్లు సైతం వరుసగా బ్లాస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మెుత్తంగా 10 వాహనాల వరకూ ధ్వంసమైనట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు మృతదేహాలు పెద్ద ఎత్తున ఎగిరిపడ్డాయి. ప్రమాదంలో గాయపడిన వారిని లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించే క్రమంలోనే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆస్పత్రి సూపరిండెంట్ తెలిపారు. ఆస్పత్రిలో చేరిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
#WATCH | A call was received regarding an explosion in a car near Gate No. 1 of the Red Fort Metro Station, after which three to four vehicles also caught fire and sustained damage. A total of 7 fire tenders have reached the spot. A team from the Delhi Police Special Cell has… pic.twitter.com/F7jbepnb4F
— ANI (@ANI) November 10, 2025
దిల్లీలో హై అలర్ట్..
పేలుడు నేపథ్యంలో దిల్లీ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. అటు దిల్లీతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి నగరాలకు సైతం హైఅలర్ట్ జారీ అయ్యింది. మరోవైపు దిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం, ఎన్ఎస్‌జీ సహా క్లూస్ టీమ్ ఘటనా స్థలికి చేరుకున్నాయి. అయితే కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి రిమోట్ సాయంతో ఎవరైనా ఆపరేట్ చేశారా? అన్న అనుమానాలను సైతం దర్యాప్తు వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
#WATCH | Delhi: Multiple casualties have been brought to the LNJP hospital due to the blast near Gate No 1 of Red Fort Metro Station. Several people have been injured in the incident, sources tell ANI
(Visuals from the spot) pic.twitter.com/Utih8Qmq6U
— ANI (@ANI) November 10, 2025
పేలుడు దృశ్యాలు వైరల్
మరోవైపు పేలుడు అనంతర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాహనాలు పెద్ద ఎత్తున మంటల్లో కాలిపోవడం, ప్రజలు భయంతో దూరంగా వెళ్లిపోతుండటంతో వీడియోల్లో చూడవచ్చు. పలువురు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం కూడా కొన్ని వీడియోల్లో రికార్డయ్యింది. ప్రమాద అనంతరం ఘటనాస్థలిలో భీతావాహ వాతావరణం నెలకొన్నట్లు వీడియోలను బట్టి అర్థమవుతోంది. అయితే దిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సోమవారం సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.
“Delhi Blast ”
Huge Explosion Near Lal Quila Gate No. 1 In Chandni Chowk, One Dead“Delhi” on High Alert 🚨🚨🚨
Chandi Chowk Market closed panic everywhere around
“lal Quila ”#delhi #lalquila #delhiblast #breakingnews pic.twitter.com/bjaSWUXpcJ— Deshhit 🇮🇳 (देशहित) (@Akhi_826) November 10, 2025
Also Read: Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం.. సాయంత్రం 6 గంటల్లోపు వస్తేనే ఓటింగ్ కు ఛాన్స్!
అగ్నిమాపక అధికారి ఏమన్నారంటే?
పేలుడు ఘటనపై అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు స్పందించారు. ‘ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో కారు పేలిందని మాకు కాల్ వచ్చింది. దాంతో వెంటనే 25 అగ్నిమాపక వాహనాలు అక్కడికి పంపించాము. పోలీసులు ఆ ప్రాంతం మెుత్తాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. అటుగా వెళ్లే ట్రాఫిక్ ను తాత్కాలికంగా నిలిపివేశారు’ అని సదరు అధికారి తెలిపారు. అయితే పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు.
