KTR: ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. ఆ అవినీతి సొమ్మును తీసుకొని, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల పాత బాకీల గురించి నిలదీయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దొంగదారిలో గెలవాలని చూస్తున్న కాంగ్రెస్ పతనానికి ప్రజలంతా తగిన బుద్ధి చెప్పాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా యూసఫ్‌గూడలో నిర్వహించిన భారీ రోడ్ ర్యాలీలో కేటీఆర్ మాట్లాడారు.
Also Read: KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీహిల్స్‌లో పోస్టర్ల కలకలం
పదేళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం
ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆయన మండిపడ్డారు. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, చేసిన మోసాన్ని ప్రజలు మరోసారి గుర్తు చేసుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆరు హామీల పేరుతో కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండింటికి సమ ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్‌కు ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ మెడలు వంచి హామీలను అమలు చేయిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
Also Read: KTR: అవినీతిని తరిమికొట్టాలంటే కాంగ్రెస్ ను ఓడించాలి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
