BRS Party: బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ బైపోల్‌లోనూ పాత స్కెచ్‌తోనే ముందుకు వెళ్లడం ఆ పార్టీ కార్యకర్తలను విస్మయానికి గురి చేస్తున్నది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గంలో గులాబీ పార్టీ కొత్త స్ట్రాటజీ అమలు చేయాల్సి ఉన్నా ఆ దిశగా ప్రణాళికలు చేపట్టలేదని స్వయంగా ఆ పార్టీ సీనియర్లే ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు. పైగా పాత స్ట్రాటజీని సమర్ధవంతంగా అమలు చేయడంలోనూ మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి. గత బై ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేసిన అస్త్రాలు అన్నీ వైఫల్యాలే అందించాయి. కానీ ఈ అర్బన్ సెగ్మెంట్‌లో ఈ సారి గత స్ట్రాటజీతో పాటు బాకీ కార్డు అనే స్లోగన్ ఎత్తుకున్నా అది ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు చర్చ జరుగుతున్నది. పోలింగ్‌కు ఒకరోజు మాత్రమే ఉండడంతో పోల్ మేనేజ్‌మెంట్‌పై నేడు ఏజెంట్లతో అగ్రనేతలు భేటీ అవుతున్నారు. ఓటర్లను పోలింగ్ స్టేషన్లకు తీసుకొచ్చే అంశం, బీఆర్ఎస్‌కు ఓటు ఎలా వేయించాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారు. గులాబీ నేతలు క్షేత్రస్థాయి లీడర్, కేడర్‌కు సలహాలు సూచనలు ఇవ్వనున్నారు.
గతంలో ఎదురుదెబ్బలు
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. అందులో పార్టీ సీనియర్ నేతలను, మంత్రులను బీఆర్ఎస్ మోహరించింది. దుబ్బాకలో సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగించినా ఫలించలేదు. హుజూరాబాద్‌లో సైతం పూర్తి స్థాయి పార్టీ నేతలను దించినా ఫలితం రాలేదు. మునుగోడులో మాత్రం వ్యూహం ఫలించింది. అక్కడ గ్రామానికి మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లను, సీనియర్ నేతలను మోహరించి ఫలితాన్ని రాబట్టింది. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సాయన్న కుటుంబంలో నుంచి మరో కుమార్తె నివేదితకు టికెట్ ఇచ్చి సెంటిమెంట్ ప్రయత్నం చేసినా బీఆర్ఎస్‌కు నిరాశే ఎదురైంది. ఓటమి పాలైంది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఇచ్చారు. గత ఉప ఎన్నికలో అనుసరించిన స్ట్రాటజీనే మళ్లీ కొనసాగించడం ప్రచారం పూర్తయ్యే దాకా చర్చ జరుగుతూనే ఉన్నది. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు ఇన్ చార్జీలు, స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం చేశారు.
Also Read: Bellamkonda Suresh: ఇల్లు కబ్జా.. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు
నేడు పోలింగ్ బూత్ ఏజెంట్లతో భేటీ
బైపోల్ ఉప ఎన్నిక చివరి అంకానికి చేరింది. ప్రచారం ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించాయి. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ పోలింగ్ బూత్ ఏజెంట్లతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ అగ్ర నేతలు కేటీఆర్, హరీశ్ రావు హాజరవుతున్నారు. ఉదయం 8 గంటలకే భవన్‌లో బ్రేక్ ఫాస్ట్ సమావేశం నిర్వహిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేయబోతున్నారు.
Also Read: Ramachandra Rao: రాష్ట్రంలో ఫ్రీ బస్సు వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి: రాంచందర్ రావు
