Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) చిత్తూరు జిల్లా పర్యటనలో ఆదివారం (9 నవంబర్, 2025) అపశృతి చోటుచేసుకుంది. పలమనేరు సమీపంలోని ముసలిమడుగు వద్ద జరిగిన ఈ ఘటనలో ఒక మహిళ కాలిపైకి పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌లోని వాహనం ఎక్కడంతో.. ఆమెకు తీవ్రగాయమైనట్లుగా తెలుస్తోంది. కుంకీ ఏనుగుల శిబిరం సందర్శన, ప్రారంభోత్సవం కోసం పవన్ కళ్యాణ్ ముసలిమడుగుకు వెళ్లారు. పర్యటన ముగించుకుని తిరిగి హెలిప్యాడ్ వద్దకు వెళ్తున్న సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తన పర్యటన ముగించుకుని హెలిప్యాడ్ వద్దకు వస్తుండగా.. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు, అభిమానులు ఒక్కసారిగా రోడ్డుకు ఇరువైపులా దూసుకురావడంతో తీవ్రమైన తోపులాట జరిగింది.
Also Read- Bigg Boss Telugu 9: ట్రోఫీకి, ఎగ్జిట్‌కి దగ్గరగా ఉందెవరంటే? మళ్లీ తనూజ చేతుల్లోనే ఎలిమినేషన్!
పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
ఈ తోపులాటలో నియంత్రణ కోల్పోయిన ఓ మహిళ కిందపడిపోయింది. అదే సమయంలో అటువైపుగా వేగంగా వస్తున్న పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌లోని వాహనం ఆమె కాలిపై నుంచి దూసుకెళ్లింది. అక్కడున్న వారంతా కేకలు వేయడంతో గమనించిన భద్రతా సిబ్బంది, స్థానికులు వెంటనే స్పందించి ఆమెను పక్కకు లాగారు. ప్రమాదానికి గురైన ఆ మహిళను హేమలత (Hemalatha)గా గుర్తించారు. ఆమెను వెంటనే చికిత్స కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమె కాలికి తీవ్ర గాయమైనప్పటికీ, ప్రాణాపాయం లేదని తెలుస్తోంది.
Also Read- Janasena X Account: జనసేన ట్విటర్ అకౌంట్ హ్యాక్!.. ఆదివారం ఉదయం ఏం పోస్టులు దర్శనమిచ్చాయంటే?
పవన్ కళ్యాణ్ స్పందనపై విమర్శలు
ఈ ప్రమాదంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాన్వాయ్‌లో వాహనం కాలిపై నుంచి వెళ్లినప్పటికీ, పవన్ కళ్యాణ్ కారు ఆపకుండా ముందుకు వెళ్లిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల తాకిడి, భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ఆగి స్పందించలేకపోయి ఉండవచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా, డిప్యూటీ సీఎం పర్యటనలో జరిగిన ఈ అపశృతి స్థానికంగా కలకలం సృష్టించింది. భద్రతా ఏర్పాట్లు మరింత పటిష్టంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సంఘటన గుర్తు చేసింది. మహిళ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. చిత్తూరు జిల్లా, పలమనేరులోని కుంకీ ఏనుగుల క్యాంప్ సందర్శన, అటవీ శాఖ అధికారులతో సమీక్షలో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లా పలమనేరు చేరుకున్న సమయంలో, హెలిప్యాడ్ దగ్గరే ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ వినతులు స్వీకరించారు. అటవీ శాఖ అధికారులతో సమీక్ష అనంతరం తిరిగి వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
మహిళ కాలుపై నుంచి వెళ్లిన పవన్ కాన్వాయ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముసలిమడుగు పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. మహిళ కాలిపై నుంచి పవన్ కల్యాణ్ కారు దూసుకెళ్లింది. బాధితురాలు హేమలతను స్థానికులు పలమనేరు ప్రభుత్వాసుప్రతికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డిప్యూటి సీఎం… pic.twitter.com/SZhnMP1xgU
— ChotaNews App (@ChotaNewsApp) November 9, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

