MLC Kavitha (imagecredit:swetcha)
తెలంగాణ

MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీ పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు.. నాకు సంబంధం లేదు అంటూ..!

MLC Kavitha: BRS పార్టీ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి నన్ను చాలా అవమానకరంగా బయటకు పంపారని అన్నారు. ఉరివేసే ఖైదీనైనా కోరిక అడుగుతారు కానీ నాకు షోకాజు నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని ఆదేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పిలిస్తే నేను కూతురిగా ఇంటికి వెళ్తాను.. కానీ బీఆర్ఎస్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా హన్మకొండ(Hanumakonda), వరంగల్(Warangal) జిల్లాల్లో కల్వకుంట్ల కవిత(MLC Kavitha) రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు.

Also Read: Kavitha On CM: సీఎం హోదాలో ఉండి.. ఆ భాష, బెదిరింపులు ఏంటి.. రేవంత్‌పై కవిత ఫైర్

గెలవాలంటే కబ్జాలు చేయాలంటా?

మేడారం పనుల టెండర్లలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని, గతంలో VTDA ద్వారా టెండర్లు ఇచ్చారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు కాంట్రాక్టు ఇస్తున్నారని కవిత అన్నారు. దీనిపై మంత్రి సీతక్క మౌనంగా ఉండడం సరికాదని వరంగల్ వరదల్లో మునిగిన వారికి ఇంకా పరిహారం అందలేదని కవిత గుర్తుచేశారు. ముఖ్యమంత్రి పర్యటించి 15రోజులైనా పరిహారం అందలేదు. వరంగల్ లో గెలవాలంటే కబ్జాలు చేయాలంటా? వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ లేకపోవడం దారుణం అని కవిత అన్నారు. సమ్మక్క – సారక్క లెక్క జిల్లాలో మంత్రులు సీతక్క, సురేఖ ఉన్నారు. ఇద్దరు మహిళా మంత్రులు ఎం చేస్తున్నారని అన్నారు. కాకతీయ యూనివర్సిటీపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని ఎంజీఎంను ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనూ ఎంజీఎంను గాలికి వదిలారు కొత్తగా కడుతున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నది హరీష్ రావు కాంట్రాక్టు కంపెనీతో అట ఆడుతున్నారని అన్నారు.

Also Read: DCC Presidents: తుది దశకు చేరిన ఏఐసీసీ కసరత్తు.. ఈ జిల్లాలో డీసీసీ పదవిపై ఉత్కంఠ!

Just In

01

Jubilee Hills Bypoll: నేటితో ఉప ఎన్నిక ప్రచారానికి తెర.. సర్వశక్తులు ఒడ్డుతున్న పార్టీలు

Honda Elevate 2025: హోండా నుంచి కొత్త సర్ప్రైజ్.. ఎలివేట్ ADV ఎడిషన్ లాంచ్

Election Betting: జూబ్లీహిల్స్ బైపోల్‌పై వందల కోట్లలో పందాలు

Janasena X Account: జనసేన ట్విటర్ అకౌంట్ హ్యాక్!.. ఆదివారం ఉదయం ఏం పోస్టులు దర్శనమిచ్చాయంటే?

Singareni Collieries: భవిష్యత్తులో కీలక ఖనిజాల తవ్వకాలు ఉంటే భాగస్వాములవుతాం