The Girlfriend- Jatadhara: రష్మిక మందానా కీలక పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఫీల్-గుడ్ రొమాంటిక్ డ్రామా ‘ది గర్ల్ ఫ్రెండ్’ విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన దక్కించుకుంది. రష్మిక నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. సుధీర్ బాబు హీరోగా వచ్చిన జటాధర సినమా కూడా మెదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. రెండో రోజు మాత్రం కొంత నెమ్మదించింది. ఈ రెండు సినిమాలు రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
Read also-Ram Gopal Varma: మెగాస్టార్‌కు క్షమాపణలు చెప్పిన రామ్ గోపాల్ వర్మ.. ఎందుకంటే?
ది గర్ల్ ఫ్రెండ్
ఈ సినిమా రెండో రోజు కూడా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటి రోజు శుక్రవారం పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ, కలెక్షన్లు సాధారణంగా ఉన్నాయి. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి సుమారు రూ. 1.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. (తెలుగు: రూ.1.23 కోట్లు, హిందీ: రూ.0.07 కోట్లు). రెండో రోజు శనివారం వీకెండ్ కావడంతో మౌత్ టాక్ బాగుండటంతో, రెండో రోజు కలెక్షన్లు మొదటి రోజు కంటే గణనీయంగా పెరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. రెండో రోజున ఇండియాలో అన్ని భాషల్లో కలిపి సుమారు రూ. 2.50 కోట్ల నెట్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో, రెండు రోజుల్లో ఈ చిత్రం ఇండియా నెట్ కలెక్షన్ రూ. 3.80 కోట్లకు చేరుకుంది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ ఆక్యుపెన్సీ కూడా పెరిగినట్లుగా నివేదికలు వచ్చాయి. పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం రాబోయే రోజుల్లో పుంజుకునే అవకాశం ఉందని మేకర్స్ ట్రేడ్ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read also-Richest actors: సౌత్ ఇండియాలో రిచెస్ట్ యాక్టర్స్ ఎవరో తెలుసా.. వారి ఆస్తులు ఎంతంటే?
జటాధర
సుధీర్ బాబు నటించిన హారర్ థ్రిల్లర్ ‘జటాధర’ కూడా శుక్రవారం విడుదల అయ్యింది. ఈ చిత్రం మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా డీసెంట్ ఓపెనింగ్స్ సాధించింది. ఇండియా నెట్ కలెక్షన్ సుమారు రూ. 1.07 కోట్లు (తెలుగు వెర్షన్: రూ.85 కోట్లు) గా నమోదైంది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు (శనివారం) వసూళ్లు కాస్త తక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. వీకెండ్ అయినప్పటికీ, థియేటర్ ఆక్యుపెన్సీ 20 శాతం లోపే నమోదు కావడంతో కలెక్షన్లలో పతనం కనిపించింది. రెండో రోజున ఇండియా నెట్ కలెక్షన్ సుమారు రూ. 90 లక్షల నుంచి రూ.1 కోటి లోపు ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా. దీంతో, ఈ సినిమా రెండు రోజుల మొత్తం వసూళ్లు సుమారు రూ. 2.10 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 8 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉన్నందున, ఈ ప్రారంభ కలెక్షన్లతో ఆ లక్ష్యం కొంచెం కష్టమేనని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
