Ram Gopal Varma: టాలీవుడ్ స్టార్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని వారుండరు. ఎప్పుడూ వివాదాల్లో ఉండే ఆర్జీవీ ఈ మధ్య కాలంలో తన రూట్ మార్చినట్లు కనిపిస్తుంది. అయిన దానికి కాని దానికి ఏదొ విధంగా వివాదాల్లో నిలుస్తారు. ప్రధాన మంత్రి నుంచి సామాన్యుల వరకూ అందరినీ విమర్శిస్తారు. ఇందులో మెగా స్టార్ ను కూడా అనేక సార్లు తన మాటలతో ఇబ్బంది పెట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఒక మెగాస్టార్ నే కాకుండా మెగా కుటుంబాన్ని మొత్తం తన చేష్టలతో ఇబ్బంది పెట్టారు. నాగబాబు అయితే పవన్ కళ్యాణ్ విషయంలో ఆర్జీవీకి బహిరంగంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంతటి కథ జరిగిన తర్వాత ఇప్పుడు ఆర్జీవీకి మెగాస్టార్ గురించి తెలిసొచ్చింది. ‘శివ’ రీ రిలీజ్ ప్రమోషన్ లో భాగంగా మెగాస్టార్ ఆర్జీవీ గురించి చెప్పిన మాటలు ఆయన్ని కరిగించాయి. దానికి పశ్చాత్తాప పడిన ఆర్జీవీ ట్విటర్ వేదికగా మెగాస్టార్ కు క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.
Read also-Jana Nayagan: ‘జన నాయగన్’ కచేరి లిరికల్ వచ్చేసింది.. ‘భగవంత్ కేసరి’ సాంగ్ దించేశారుగా!
చిరంజీవి ఒక వీడియో సందేశం ద్వారా ‘శివ’ టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆ సినిమా గొప్పదనాన్ని ఈ విధంగా ప్రశంసించారు. “శివ’ సినిమా చూసిన తర్వాత పూర్తిగా ఆశ్చర్యపోయాను. అది సినిమా కాదు, అదొక విప్లవం! అది ట్రెండ్ సెట్టర్.. నాగార్జున ఛైన్ లాగ్ సీన్ అస్సలు మర్చిపోలేను. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి నటించారు. ఈ మూవీ రీ-రిలీజ్ అవుతుందని తెలిసి సంతోషించాను. నేటి తరానికి ఈ సినిమా గురించి తెలుసుకోవాలి. ఇదొక టైమ్ లెస్ ఫిల్మ్. రామ్ గోపాల్ వర్మ విజన్, కెమెరా యాంగిల్స్ చాలా కొత్తగా అనిపించాయి. ఈ యువ దర్శకుడు, తెలుగు సినిమా భవిష్యత్తు అని అప్పుడే అనిపించింది. హాట్‌సాఫ్ టు రామ్ గోపాల్ వర్మ! తెలుగు సినిమా ఉన్నంత కాలం ‘శివ’, చిరంజీవిలా చిరకాలం ఉంటుంది.” అని చెప్పారు. దీనిని విన్న రామ్ గోపాల్ వర్మ చిరంజీవికి తను ఏప్పుబడైనా ఏమైనా తప్పుచేసి ఉంటే క్షమించాలని కోరారు.
Read also-Richest actors: సౌత్ ఇండియాలో రిచెస్ట్ యాక్టర్స్ ఎవరో తెలుసా.. వారి ఆస్తులు ఎంతంటే?
రామ్ గోపాల్ వర్మ తరచుగా సోషల్ మీడియాలో చిరంజీవిని, మెగా కుటుంబాన్ని ఉద్దేశించి వ్యంగ్యంగా, విమర్శనాత్మకంగా ట్వీట్లు చేస్తూ వివాదాలు సృష్టిస్తుంటారు. చిరంజీవి 150వ సినిమా (ఖైదీ నం. 150) గురించి, అది ప్రజా రాజ్యం పార్టీ పెట్టడం కంటే పెద్ద తప్పు కాకూడదు అంటూ ట్వీట్లు చేశారు. చిరంజీవి నటించిన “ఖైదీ నం. 150” లోని “అమ్మడు లెట్స్ డు కుమ్ముడు” పాటలో చిరంజీవి లుంగీ కట్టుకోవడంపై హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఆశ్చర్యపోతారు అంటూ సెటైరికల్‌గా పోస్టులు పెట్టారు. ఈ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా స్పందిస్తూ, వర్మ ఒక జీనియస్ అయినా, ఇలాంటి ఎటకారాలు సరికాదని మండిపడ్డారు. చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా సమయంలో, చిరంజీవి జబర్దస్త్, హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకు అలవాటుపడిపోయి రియాలిటీకి మెగా దూరమవుతున్నారని విమర్శించారు.
Thank you @KChiruTweets gaaru, Also on this occasion I want to sincerely apologise to you if I ever unintentionally offended you ..Thank you once again for your large heartedness 🙏🙏🙏 pic.twitter.com/08EaUPVCQT
— Ram Gopal Varma (@RGVzoomin) November 9, 2025
