Jana Nayagan: దళపతి విజయ్ (Thalapathy Vijay) నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) నుంచి విడుదలైన మొదటి లిరికల్ వీడియో ‘దళపతి కచేరి’ పాట, నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari)లోని ‘ఇచ్చి పాడ్’ పాటను పోలి ఉండడంతో ఈ సినిమా రీమేక్ అనే వార్తలకు మరింత బలం చేకూరింది. దళపతి విజయ్ తన రాజకీయ ప్రయాణంపై దృష్టి పెట్టే ముందు చేస్తున్న చివరి సినిమాగా భావిస్తున్న ‘జన నాయగన్’ చిత్రంపై సినీ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే 2026 సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా, మేకర్స్ ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ ‘దళపతి కచేరి’ అంటూ సాగే మొదటి లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట మాస్ బీట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అయితే, ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైంది.
Also Read- Sujeeth: సుజీత్‌కు అదృష్టం ఏంటి ఇలా పట్టింది? పొగడకుండా ఉండలేకపోతున్నారుగా!
రీమేక్ వార్తలకు బలం
విజయ్ ‘జన నాయగన్’ చిత్రం నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అనే ప్రచారం చాలా కాలంగా నడుస్తోంది. ఇప్పుడు విడుదలైన ‘దళపతి కచేరి’ పాట ఈ వార్తలకు మరింత క్లారిటీ ఇచ్చినట్లయింది. ‘భగవంత్ కేసరి’లోని బాలయ్య, కాజల్, శ్రీలీలలపై చిత్రీకరించిన ‘ఇచ్చి పాడ్, ఇచ్చి పాడ్’ అనే పాటలాగే, ‘జన నాయగన్’లోని ఈ కచేరి పాట కూడా మ్యూజిక్, సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్ పరంగా పోలిక అంతగా లేనప్పటికీ విజయ్, పూజా హెగ్డే, మమిత బైజు కలిసి గ్రూపు డ్యాన్స్ చేస్తున్నారు. ‘భగవంత్ కేసరి’ పాటలో బాలయ్యకు కూతురి పాత్రలో శ్రీలీల కనిపించినట్లుగా, ‘జన నాయగన్’ పాటలో విజయ్ కూతురుగా మమిత బైజు కనిపించనుందనే క్లారిటీ ఇచ్చినట్లయింది. కాజల్ రోల్‌ను పూజా హెగ్డే పోషిస్తున్నట్లుగా తెలుస్తుంది.
Also Read- Mana Shankara Vara Prasad Garu: వైరల్ సెన్సేషన్.. మరో బెంచ్‌మార్క్‌కు చేరుకున్న ‘మీసాల పిల్ల’!
కూతురు-తండ్రి సెంటిమెంట్
ఈ పాటలోని పోలికలను చూసిన అభిమానులు, నెటిజన్లు.. విజయ్ ‘జన నాయగన్’ చిత్రం ‘భగవంత్ కేసరి’కి రీమేకే అని ధృవీకరించుకుంటున్నారు. సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు ఈ రీమేక్ వార్తలను కొంతమంది కొట్టిపారేసినప్పటికీ, మేకర్స్ ‘భగవంత్ కేసరి’కి సంబంధించిన కొన్ని కీలకమైన కాపీరైట్స్ (Good Touch Bad Touch వంటి ముఖ్య సన్నివేశాల హక్కులు) కొనుగోలు చేశారనే వార్తలు ఈ రీమేక్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేశాయి. విజయ్ తన చివరి చిత్రంగా ‘భగవంత్ కేసరి’ కథాంశాన్ని ఎంచుకోవడం, అందులో కూతురు-తండ్రి సెంటిమెంట్‌తో పాటు రాజకీయ అంశాలకు కూడా చోటు ఉండటం వల్ల, తన రాజకీయ అరంగేట్రానికి ఈ సినిమా సరైన వేదికగా ఉంటుందని భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం మరి.. ఈ సినిమా విజయ్‌కు పొలిటికల్‌గా ఎలాంటి మైలేజ్‌ని తీసుకొస్తుందో..?
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
