The Great Pre-Wedding Show: వెర్సటైల్ హీరో తిరువీర్ (Thiruveer), టీనా శ్రావ్య (Teena Sravya) జంటగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ (The Great Pre-Wedding Show). సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ స్పందనను రాబట్టుకుంది. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న స్పందనతో చిత్రయూనిట్ హ్యాపీగా ఉంది. తమ సంతోషాన్ని షేర్ చేసుకునేందుకు శనివారం బ్లాక్ బస్టర్ ఫన్ షోని చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు, రచయిత, నటుడు బీవీఎస్ రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Also Read- Mana Shankara Vara Prasad Garu: వైరల్ సెన్సేషన్.. మరో బెంచ్‌మార్క్‌కు చేరుకున్న ‘మీసాల పిల్ల’!
అభిరుచి ఉన్న నిర్మాతల్ని ఎంకరేజ్ చేస్తేనే
ఈ కార్యక్రమంలో బీవీఎస్ రవి (BVS Ravi) మాట్లాడుతూ.. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అనేది మీడియా సినిమా. చిన్న చిత్రాలు బతకాలని అంతా అంటుంటారు. మంచి చిత్రాన్ని అందరూ ముందుండి నడిపిస్తుంటారు. పెద్ద బ్యానర్స్ చిన్న చిత్రాలను రిలీజ్ చేయడం కామనే. కానీ కొత్తగా వచ్చే చిన్న నిర్మాతలు తీసే చిన్న సినిమాల్ని రిలీజ్ అవడం చాలా కష్టం. ఇలాంటి అభిరుచి ఉన్న నిర్మాతల్ని ఎంకరేజ్ చేస్తే మరిన్ని మంచి చిత్రాలు టాలీవుడ్‌లో వస్తాయి. చిన్న చిత్రాలు ఆడితేనే ఇండస్ట్రీకి కొత్త హీరోలు, దర్శకులకు, ఆర్టిస్ట్‌లకు అవకాశాలు వస్తాయి. తిరువీర్, టీనా శ్రావ్య, రోహన్ అందరూ ఈ సినిమాలో అద్బుతంగా చేశారు. తిరువీర్ నాకు తెలిసి ఎంతో క్రమశిక్షణ ఉన్న నటుడు. ఎన్నో కష్టాలు పడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడు. సినిమా చూస్తుంటే.. సినిమాకు వెళ్లినట్లుగా కాకుండా, ఊర్లోకి వెళ్లినట్టుగా ఉంటుంది. ‘బలగం’ తర్వాత మళ్లీ నాకు ఆ ఫీలింగ్ ఇచ్చిన చిత్రమిదే. ఈ మూవీకి చాలా అవార్డులు వస్తాయి. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. కొత్త నిర్మాతలు ఇలాంటి మంచి చిత్రాలు తీసినప్పుడు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు.
Also Read- Bigg Boss Telugu 9: హౌస్‌లోని అందరి జాతకాలు బయటపడ్డాయ్.. సుమన్ శెట్టి ఒక్కడే టాప్‌లో!
ఎక్కడా ఒక్క నెగిటివ్ కామెంట్ కనిపించలేదు
నిర్మాత సందీప్ అగరం (Producer Sandeep) మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రీమియర్లు చూసి మీడియా వాళ్లే స్వయంగా గంట సేపు మాట్లాడారు. మీడియా వల్లే ఈ మూవీ ఆడియెన్స్ వరకు రీచ్ అయింది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు నా వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నాను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నన్ను నిలబెట్టిన మీడియాకు ధన్యవాదాలు. ఈ మూవీనే నన్ను నిర్మాతగా మార్చింది. ఇదంతా కూడా రాహుల్ వల్లే జరిగింది. మంచి చిత్రాన్ని నిర్మించావని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ మూవీకి వెన్నంటే ఉండి సపోర్ట్ చేసిన తిరువీర్‌కి థాంక్స్. ప్రేక్షకులు మా ఈ సినిమాను చూసి మంచి లాభాల్ని అందిస్తే.. మరిన్ని మంచి చిత్రాలను నిర్మిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానని తెలిపారు. ఈ సినిమాకు ఎక్కడా ఒక్క నెగిటివ్ కామెంట్ కనిపించలేదని, మౌత్ టాక్, పబ్లిసిటీతో ఇప్పుడిప్పుడు సినిమా పికప్ అవుతుందని, ఎంకరేజ్ చేస్తున్న మీడియా, సోషల్ మీడియాకు థ్యాంక్స్ అని చెప్పారు హీరో తిరువీర్. సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, ప్రేక్షకులలోకి సినిమాను తీసుకెళ్లిన మీడియాకు దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ థ్యాంక్స్ చెప్పారు. ఇంకా చిత్రబృందం ప్రసంగించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
